Tollywood Buzz: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన అందాల నటి కోమలి ప్రసాద్.. ఇప్పుడు మరోసారి తన అసలైన వృత్తిలోకి అడుగుపెట్టింది. తాజాగా డాక్టర్‌గా తిరిగి సర్వీస్ ప్రారంభించిన ఆమె, ఇకపై సినిమాలకు దూరమవుతుందా? అనే చర్చకు తెరలేపింది. Tollywood Buzz
విశాఖ నుంచి న్యూయార్క్ వరకూ.. కోమలీ ప్రయాణం
విశాఖపట్నంలో జన్మించి, విద్యలో పదును పెంచిన కోమలి.. ప్రవర మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేసింది. జాతీయ స్థాయి అథ్లెట్‌గా కోకో, బ్యాడ్మింటన్‌లో బంగారు పతకాలు సాధించింది. క్లాసికల్ డాన్సర్‌గా కూడా ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఎంసీపై ఆసక్తితో న్యూయార్క్‌కి మాస్టర్స్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో, సినీ అవకాశాలతో మలుపు తిరిగింది ఆమె జీవితం. మాస్టర్స్‌ను పక్కన పెట్టి ఫుల్ టైమ్ యాక్టర్‌గా మారింది.
సినీ కెరీర్: స్క్రీన్‌మీద ఓ గుర్తింపు
2016లో ‘సీతాదేవి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కోమలి ప్రసాద్, ‘నెపోలియన్’, ‘రౌడీ బాయ్స్’, ‘హిట్-2’, ‘సెబాస్టియన్ పీసీ524’, ‘హిట్-3’ వంటి హిట్ సినిమాల్లో నటించింది. ఇటీవల నాని నటించిన ‘హిట్-3’లో ఎస్పీ వర్షా పాత్రలో తన నటనకు ప్రశంసలు అందుకుంది.
ఇన్‌స్టాలో వైరల్ పోస్ట్.. డాక్టర్‌గా రీ ఎంట్రీ!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కోమలి ప్రసాద్, ఇటీవల వైట్ కోట్‌లో కనిపిస్తూ “మళ్లీ డాక్టర్‌గా వస్తున్నా.. మీ చిరునవ్వు కోసం సిద్ధంగా ఉండండి!” అంటూ ఓ పోస్టు షేర్ చేసింది. దీంతో ఆమె డెంటిస్టుగా ప్రాక్టీస్ ప్రారంభించినట్టు స్పష్టమైంది.
ఈ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. సినిమాలు మానేసిందా? లేక డెంటిస్ట్రీతో పాటు నటన కొనసాగిస్తుందా? అన్నది అభిమానుల్లో ప్రశ్నగా మారింది.
ఇవీ చదవండి: Chitrangda Singh : 20 ఏళ్లుగా హిట్ కోసం పరితపిస్తున్న హీరోయిన్..!
Meenakshi Chaudhary: నడుము అందాలతో కవ్విస్తున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు
Nargis Fakhri: నర్గీస్ ఫక్రీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్ హాట్ బ్యూటీ ఫొటో గ్యాలరీ
Mrunal Thakur hot: బాత్ టబ్బులో మృణాల్ హాట్ పోజులు.. విషయం అదా?
