YS Jagan Defamation: వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు (YS Jagan Defamation) జారీ చేసింది. అదానీ గ్రూప్ వ్యవహారంలో తనపై తప్పుడు వార్తలు రాసి పరువుకు భంగం కలిగించారంటూ ఆ రెండు పత్రికలపై శ్రీ వైయస్ జగన్ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.
అదానీ గ్రూప్ కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా, ఉన్నట్లుగా కట్టు కథలు రాశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ పత్రికల్లో తనకు వ్యతిరేకంగా రాసిన కథనాలను తొలగించాలని కూడా జగన్ కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీ రాష్ట్ర చరిత్రలో అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49 చొప్పున ‘సెకీ’తో విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తూ కథనాలు ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతికి జగన్ తరఫు న్యాయవాదులు ఇటీవల లీగల్ నోటీసులు జారీ చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య అత్యంత పారదర్శకంగా జరిగిన ఆ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని, దాన్ని ప్రముఖంగా ఫస్ట్ పేజీలో ప్రచురించాలని నోటీసుల్లో ఉటంకించారు. అందుకు ఆ పత్రికలు స్పందించకపోవడంతో, వాటిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
అలాగే, ఆ పత్రికల్లో తనకు వ్యతిరేకంగా రాసిన కథనాలు కూడా తొలగించేలా ఆదేశించాలని కోరుతూ, వైయస్ జగన్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పైనా కోర్టు స్పందించింది. ఈ వ్యవహారం తర్వాత పిటిషనర్ వైయస్ జగన్‌పై రాసే కథనాలకు న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.
ఇవీ చదవండి: YS Jagan tweet: విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం
YS Jagan fire: నా తల్లి, చెల్లెళ్ల పేరుతో చంద్రబాబు రాక్షస రాజకీయం
Jagan longest press meet: ఆర్గనైజ్డ్ క్రిమినల్‌లా చంద్రబాబు వ్యవహారం.. రాష్ట్ర అప్పులు, బడ్జెట్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
