HomeAndhra PradeshMega DSC: ఆర్ఆర్ మిశ్రా కమిటీ నివేదిక ఎప్పుడు? ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ అప్ డేట్!

Mega DSC: ఆర్ఆర్ మిశ్రా కమిటీ నివేదిక ఎప్పుడు? ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ అప్ డేట్!

Mega DSC: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు? లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ ఫలించే క్షణాలు ఎప్పుడు? సిలబస్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమైన అభ్యర్థులు నోటిఫికేషన్ (Mega DSC) గురించి వర్రీ అవుతున్నారా? వచ్చే అకడమిక్ ఇయర్ నాటికి పోస్టుల భర్తీ ఖాయమా? ప్రభుత్వం విడుదల చేసిన సిలబస్ తో అభ్యర్థులు ఊపిరి పీల్చుకుంటున్నారా? డీఎస్సీ పరీక్ష కూడా టెట్ అంత కఠినంగా ఉంటుందా? ఇటీవల విద్యాశాఖ రోడ్ మ్యాప్ లో మే 11 నుంచి 30 డీఎస్సీ సీట్ల భర్తీ చేపట్టనున్నారని పేర్కొన్నారంటే దాని అర్థం మార్చిలో నోటిఫికేషన్ వెలువడుతుందా? ఇలాంటి అంశాలపై ఇప్పుడు టీచర్ ఉద్యోగార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం సుమారు 7 లక్షల మంది అభ్యర్థులు వేచి చూస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, అభ్యర్థులు, కోచింగ్ సెంటర్ల విజ్ఞప్తి మేరకు నోటిఫికేషన్ ను ప్రభుత్వం వాయిదా వేసింది. టెట్ ఫలితాల వెల్లడి అనంతరం నవంబర్ 6న నోటిఫికేషన్ ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఆఖరి నిమిషంలో ఎస్సీ వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. వర్గీకరణ కోసం ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ ను ఏపీ ప్రభుత్వం ఈ కమిటీ చైర్మన్ గా నియమించింది. ఈ కమిటీ 60 రోజుల్లో తన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అయితే, వర్గీకరణ అంశం తేలేందుకు మరింత సమయం పడుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందన్నద క్లారిటీ రావడం లేదు. అటు ప్రభుత్వ వర్గాలు కూడా దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. అయితే, ప్రిపరేషన్, సిలబస్ కంప్లీట్ చేయడానికి బోలెడంత సమయం లభించిందని కొందరు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నం అయ్యారు. కానీ చాలా కాలంగా డీఎస్సీ కోసం వెయిట్ చేస్తున్న వారు మాత్రం ఇంకెప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో అని ఉసూరుమంటున్నారు.

తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ గురించి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పందించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ (ఆర్ఆర్) మిశ్రా కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ అయితే ఎంత వరకు వచ్చిందన్నది తన పరిధిలో లేదని జవాబిచ్చారు. ఆర్ఆర్ కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుందన్నది కూడా తనకు తెలియదన్నారు. అయితే, కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

డీఎస్సీ సిలబస్ ను విడుదల చేసిన సందర్భంగా మంత్రి లోకేష్ అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని ఆయన ట్వీట్ చేశారు. అంతకు ముందు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కూడా డీఎస్సీ అభ్యర్థులు నోటిఫికేషన్ గురించి దిగులు పెట్టుకోవద్దని, తాను లోకేష్ తో మాట్లాడానని చెప్పారు. సిలబస్ పూర్తి చేసుకుని బాగా ప్రిపేర్ అవ్వాలని ఆయన సూచించారు. వచ్చే అకడమిక్ ఇయర్ నాటికి మెగా డీఎస్సీ పూర్తి చేస్తామంటూ అసెంబ్లీలో కూడా మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా ప్రిపరేషన్ పై ఫోకస్ పెట్టాలని విద్యారంగ నిపుణులు అభ్యర్థులకు సూచిస్తున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా 3 నెలల సమయం ఇస్తారని, ఆలోగా సిలబస్ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు పునర్విమర్శ, పునరభ్యాసం, కీలకమైన ప్రశ్నలపై ఫోకస్ పెట్టేందుకు సమయం ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి వచ్చే జూన్ నాటికి కొత్త టీచర్లు రాష్ట్రంలోని పాఠశాలల్లో అడుగు పెడతారా? అన్నది వేచి చూడాల్సిందే.

ఇవీ చదవండి: DSC Notification: 6న ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్.. టెట్ ఫలితాలపై అప్ డేట్!
AP DSC 2024: ఏపీ డీఎస్సీకి సర్వం సిద్ధం.. డిసెంబర్ 31లోగా పూర్తి?!
Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫలితాల విడుదల

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు