HomeAndhra PradeshDeputy CM: అదానీ-జగన్ వ్యవహారంపై పవన్ హాట్ కామెంట్స్

Deputy CM: అదానీ-జగన్ వ్యవహారంపై పవన్ హాట్ కామెంట్స్

Deputy CM: అదానీ, జగన్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సౌర విద్యుత్ ఒప్పందాలపై రెండు రోజుల నుంచి మొత్తం పరిశీలిస్తున్నాను. ఒకసారి సీఎంతో మాట్లాడి సమిష్టిగా ఒక అభిప్రాయానికి వస్తామన్నారు. పోలీసులను వారి పనిచేసుకోనివ్వండని, నా పని నేను చేస్తానన్నారు. హోంశాఖ, శాంతిభద్రతలు నా పరిధిలో లేవని కామెంట్ చేశారు. నేను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాల్సి ఉంటుందన్నారు.

మీడియా తనను అడిగిన ప్రశ్నలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని పవన్ చెప్పారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవారిని ఎందుకు పట్టుకోవట్లేదని మీడియా అడిగిందన్నారు. ఇబ్బంది పెట్టినవారిని పట్టుకోవడంలో తటపటాయింపు ఎందుకని మీడియా అడిగిందని, ఈ విషయాలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గత ప్రభుత్వంలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం లేవన్నారు. సమోసాల కోసమే గత ప్రభుత్వం రూ.9 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు.

ఆర్జీవీ నోటీసులకి స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని, ఆయన ఒక్కరే కాదు.. మిగతా చాలా మంది విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని, పోలీసులు వాళ్లని పట్టుకోలేకపోతున్నారా లేక పోలీసులకు వాళ్లను పట్టుకోవడంలో చిత్తశుద్ధి లేదా ? అని మీడియా ప్రశ్నించింది.

లా అండ్ ఆర్డర్, హోమ్ నేను చేయడం లేదన్న పవన్, సో మీరు అడగాల్సింది సీఎంగారిని అని చెప్పారు. నన్ను పంచాయతీరాజ్ శాఖ గురించి అడిగితే నేను చెప్పగలను అని వ్యాఖ్యానించారు.

మరోవైపు జగన్ కి అదానీ సంస్థ లంచం ఇచ్చిన వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు చక్రవర్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. జగన్ కి రూ.1,750 కోట్లు లంచం ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సెకీతో అదానీ కంపెనీ ఒప్పందంపై విచారణ జరపాలన్నారు. జగన్ కి అదానీ సంస్థ లంచం ఇచ్చినట్లు అమెరికా విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఒప్పందానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Revanth reddy on Adani: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. అదానీ రూ.100 కోట్లు వెనక్కి!
Sharmila fire: జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డ షర్మిల.. అదానీతో ముడిపెడుతూ..
Adani court case: అమెరికా కోర్టులో అదానీపై కేసు.. మధ్యలో జగన్? వాస్తవం ఏంటి?
Adani Enterprises: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రికార్డు.. మార్చి త్రైమాసికంలో 137.5 శాతం లాభం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు