India vs Australia: భారత్ vs ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం నమోదు చేసింది. తద్వారా టెస్టుల్లో భారత్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత్ ఆస్ట్రేలియాను (India vs Australia) ఓడించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లిల సెంచరీలు, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి టెస్టులో ఆస్ట్రేలియాపై 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. 534 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ నిలబడలేకపోయింది. ఆస్ట్రేలియా నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోయింది.
భారత్ తరఫున మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా చెరో మూడు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ 89 పరుగులు చేసి స్టార్ ప్లేయర్‌గా నిలిచాడు. అతనితో పాటు, మిచెల్ మార్ష్ 47 పరుగులు చేయగా, అలెక్స్ కారీ 36 పరుగులు చేశాడు. అంతకుముందు, జైస్వాల్ 161 పరుగులు చేయగా, కోహ్లి తన చిరస్మరణీయమైన 30వ టెస్టు శతకం సాధించాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
టెస్టుల్లో అత్యుత్త బౌలింగ్ ప్రదర్శన చేసిన టీమిండియా కెప్టెన్లు
* 10/135 – కపిల్ దేవ్ vs వెస్టిండీస్, (అహ్మదాబాద్-1983)
* 10/194 – బిషన్ సింగ్ బేడీ vs ఆస్ట్రేలియా (పెర్త్-వాకా స్టేడియం-1977)
* 9/70 – బిషన్ సింగ్ బేడీ vs న్యూజిలాండ్ (చెన్నై-1976)
* 8/72 – జస్‌ప్రీత్ బుమ్రా vs ఆస్ట్రేలియా (పెర్త్-ఆప్టస్ స్టేడియం-2024)
* 8/109 – కపిల్ దేవ్ vs ఆస్ట్రేలియా (అడిలైడ్-1985)
ఆసియా ఖండం బయట ఇండియాకు అతిపెద్ద విజయాలు (రన్స్ పరంగా)
* 318 పరుగులు – వెస్టిండీస్‌పై (నార్త్ సౌండ్-2019)
* 295 రన్స్ – ఆస్ట్రేలియాపై (పెర్త్, ఆప్టస్ స్టేడియం-2024)
* 279 పరుగులు – ఇంగ్లాండ్‌పై (హెడింగ్లీ-1986)
* 272 రన్స్ – న్యూజిలాండ్‌పై (ఆక్లాండ్-1968)
* 257 పరుగులు – వెస్టిండీస్‌పై (కింగ్‌స్టన్-2019)
ఆస్ట్రేలియాపై భారత్ భారీ విక్టరీలు (రన్స్ పరంగా)
* 320 పరుగులు – (మొహాలీ-2008)
* 295 రన్స్ – (పెర్త్-2024)
* 222 పరుగులు – (మెల్‌బోర్న్-1977)
* 179 రన్స్- (చెన్నై-1998)
* 172 పరుగులు – (నాగ్‌పూర్-2008)
2000 సంవత్సరం తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్‌ల్లో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓడిన మ్యాచులు
* దక్షిణాఫ్రికాపై – పెర్త్ (వాకా స్టేడియం) 2008
* దక్షిణాఫ్రికాపై – పెర్త్ (వాకా స్టేడియం) 2016
* ఇండియాపై – అడిలైడ్ 2018
* ఇండియాపై – పెర్త్ (ఆప్టస్) 2024
ఇవీ చదవండి: Cricket Australia: కోహ్లీ కాదు.. ఆస్ట్రేలియా పత్రికల్లో ఇండియన్ ప్లేయర్ డామినేషన్!
Rishabh Pant: టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీని వెనక్కి నెట్టిన పంత్
Rishabh pant: ఐపీఎల్ రికార్డుడు బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. రూ.27 కోట్లు!
WTC: ఆల్-టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన రిషబ్ పంత్
