EVM Tampering : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంల గోల్ మాల్ పై దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రశ్నిస్తున్న తరుణంలో మహారాష్ట్ర ఫలితాలపై కూడా రాజకీయ పార్టీల నాయకులు ఇదే రకమైన రియాక్షన్ ఇస్తున్నారు. (EVM Tampering)
మహారాష్ట్ర రిజల్ట్ ట్రెండ్స్‌పై ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన (UBT) స్పందించింది. ఇది ప్రజా తీర్పు కాదని, ఎక్కడో ఏదో తప్పు జరిగిందని యూబీటీ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తం ఎన్నికల నిర్వహణ యంత్రాంగాన్ని మహాయుతి తన ఆధీనంలోకి తీసుకుందని ఆరోపణలు గుప్పించారు.
మహా ఫలితాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజల నిర్ణయం కాదన్నారు. ఎక్కడో ఏదో తప్పు జరిగిందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రజల మనోభావాలు ఏంటో తమకు బాగా తెలుసని చెప్పారు. ఈ ఫలితాలు మహారాష్ట్ర ప్రజల తీర్పు కాదన్నారు. ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేనకు చెందిన అభ్యర్థులు అంత మంది ఎలా గెలుస్తారంటూ ప్రశ్నలు గుప్పించారు.
2014, 2019లో జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కకూడదని ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా కుట్రలు పన్నారని సంజయ్ రౌత్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈసారి కూడా మహారాష్ట్రలో ప్రతిపక్ష నేత ఎవరూ ఉండకూడదన్న లక్ష్యంతో అంతా ఇలా కుట్రలు చేశారన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చాలా కాలంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోందని, ఇప్పుడు కార్యాచరణ చేసిందని సంజయ్ రౌత్ అన్నారు.
ఇవీ చదవండి: maharashtra election result: ఆరు నెలలు తిరక్కుండానే మహారాష్ట్రలో సీన్ రివర్స్!
Local body elections: ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ
EVM Hacking: ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనా? ఏఐ ఏం చెప్పిందో తెలుసా?
EVM Management: ఈవీఎం మేనేజ్‌మెంట్ సిస్టంపై నోడల్ అధికారులకు శిక్షణ
Lok Sabha Elections: 140 లోక్ సభ నియోజకవర్గాల్లో ఓట్లు ఎక్కువ లెక్కించారా?
Jamili Elections: 2026లోనే కొత్త నియోజకవర్గాలు.. 2027లో జమిలి?
