HomeAndhra PradeshAnita: జగన్‌కు హోంమంత్రి అనిత కౌంటర్.. ఇష్టానుసారం పోస్టులు పెడితే...

Anita: జగన్‌కు హోంమంత్రి అనిత కౌంటర్.. ఇష్టానుసారం పోస్టులు పెడితే…

Anita: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రెస్ మీట్ లో ప్రభుత్వంపై కీలక విషయాలు మాట్లాడారు. సోషల్ మీడియా పోస్టులు, అరెస్టుల పర్వంపై రాజకీయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో హోంమంత్రి అనిత (Anita) స్పందించారు. జగన్ కు కౌంటర్ గా పలు అంశాలు మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే..

* కొన్ని కొన్ని పదాలు ఎవరి నోటి నుంచి వింటే సభ్య సమాజం తలదించుకుంటుందో.. అలాంటి పదాలు పులివెందుల ఎమ్మెల్యే జగన్ నోటి నుంచి వస్తుంటే ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది.
* ఐదేళ్ల విధ్వంస పరిపాలనలో ఆర్థిక నేరగాళ్ల నుంచి ఆకు రౌడీల వరకు ప్రతి ఒక్కరికి రాజకీయ ముసుగు వేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ,అత్యాచారప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చి దేశంలో మన ఏపీ పరువు తీసిన జగన్.. 5 నెలల కాలంలోనే ఏవో జరిగాయని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాట్లాడుతున్నారు.
* జగన్ ఒక మొసలి కన్నీరు కరిచినట్టు మాట్లాడారు.

* లా అండ్ ఆర్డర్, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాట్లాడుతున్నారు. మరి ఆయన హయాంలో ఏం జరిగిందనే విషయం ఆయన మర్చిపోయినా కూడా ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు.
* ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మమ్మల్ని ప్రశ్నించే జగన్.. తమ ఐదేళ్ల కాలంలో విధ్వంసాలు, దాడులు ఎన్ని జరిగాయో లెక్కలు తీస్తే విసిగిపోతాం.
* గత ఐదేళ్లలో నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ప్రతి 8 గంటలకు హత్యాచారం, ఒక హత్య జరిగేవి… ప్రతి రెండు గంటలకు మహిళలపై దాడులు జరిగేవి.

* ఆ రోజు మాట్లాడని ఈ పులివెందుల ఎమ్మెల్యే ఈరోజు ఏ అధికారం ఉందని మాట్లాడుతున్నారు. మీకు ఏం అర్హత ఉంది ?
* నీ హయాంలో ఎన్ని ఘోరాలు జరిగాయి. ఈ రోజు అధికారం పోయే సరికి నీకు అక్క చెల్లెమ్మలు గుర్తు వచ్చారా ?
* నీ ఐదేళ్ల పాలనలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా అయిందంటే వెంటిలేటర్ కి వెళ్లింది
* నీ హయాంలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయి.. ఆడ బిడ్డలను నడిరోడ్డుమీద పొడిచి చంపేసిన ఘటనలు ఎన్ని జరిగాయో? తెలియదా నీకు?
* సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడేవారిపై మేము యాక్షన్ తీసుకుంటే.. వాళ్ళని జగన్ వెనకేసుకు వస్తున్నాడు.
* ఎలాంటి వారైనా తల్లి, చెల్లి జోలికి వచ్చిన లాగి పీకుతారు..నీ చెల్లి, తల్లి, నీ బాబాయ్ కూతురు చెల్లి గురించి నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడారు.

* షర్మిల వైఎస్ఆర్ కి పుట్టలేదు.. విజయమ్మను అడగాలని నీ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే.. ఆ రోజు కూడా నీకు పౌరుషం రాలేదంటే.. నీకు అధికార పిచ్చి, ధన పిచ్చి ఎక్కువ అయింది
* వైఎస్ఆర్ సీపీ కార్యకర్త వర్రా రవీంద్రరెడ్డి దారుణమైన పోస్టులు పెట్టారు-విజయమ్మ, షర్మిలపై దారుణమైన పోస్టులు పెట్టారు.
* సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పేరుతో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు..గౌతు శీరిష, చింతకాయల విజయ్ , రంగనాయకమ్మను ఇబ్బందిపెట్టారు.

* వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. కొన్ని పోస్టుల గురించి మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది
* మమ్మల్ని మీరు పెట్టిన బాధలు సమాజానికి తెలియాలి
* నాపై ,నా రాజకీయ జీవితంపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు…దారుణంగా పెట్టిన పోస్టులు తట్టుకోలేకే కొందరిని అరెస్టు చేస్తున్నాం. ఇలాంటి వెధవలను రక్షించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.

* ఫేక్ ఖాతాలు సృష్టించి మమ్మల్ని దారుణంగా తిడుతున్నారు. నా పేరుతో ఫేక్ ఖాతా సృష్టించి ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ల భాష గురించి మాట్లాడేందుకు సభ్యత, సంస్కారం అడ్డొస్తోంది.
* జగన్ హయాంలో పోలీసులను డ్యూటీ చేయనివ్వలేదు.
* సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసినా ఊరుకోం…పోలీసులు తలెత్తుకుని విధులు నిర్వహించేలా చేస్తాం..
* నేరగాళ్లు అనుక్షణం భయపడేలా చర్యలు తీసుకుంటాం.

* ఆధారాలు లేకుండా అరెస్టు చేస్తే కోర్టులు ఊరుకుంటాయా?..అర్ధరాత్రి గోడలు దూకి అరెస్టులు చేయడం ఎవరూ మరిచిపోరు
* సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే సప్తసముద్రాలు దాటి ఉన్నా మేము కూడా పట్టుకుంటాం.

ఇవీ చదవండి: Vangalapudi Anita: టెక్నాలజీతో నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నాం
Crime News: విద్యార్థిని తొడపై కొరికిన కీచక టీచర్! చెప్పుకోలేని చోట తాకుతూ..
Crime News: టీనేజ్ అమ్మాయి విశృంఖలత్వం.. 19 మందికి ఒకేసారి హెచ్ఐవీ
Guntur Crime: దాష్టీకానికి మరో అమ్మాయి బలి… తెనాలి యువతి కన్నుమూత

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు