Essential commodities: రాష్ట్రంలో ధరల పర్యవేక్షణపై సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. మంత్రి నాదెండ్ల అధ్యక్షతన ధరల పర్యవేక్షణపై (Essential commodities)మంత్రులు భేటీ అయ్యారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్న, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
బియ్యం, కందిపప్పు, టమాట, ఉల్లి ధరల నియంత్రణపై చర్చ జరిగింది. టమాట, ఉల్లి నిల్వ పద్దతులపై మంత్రుల కమిటీ అధ్యయనం చేయనుంది. మార్కెట్ లో ధరల పరిస్థితిని మంత్రులు, అధికారులు సమీక్షించారు. ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాలతో బియ్యం ధరల స్థిరీకరణ జరిగినట్లు గుర్తించారు. ప్రత్యేక కౌంటర్లలో అమ్మకాల ద్వారా కందిపప్పు ధరలు తగ్గినట్లు తెలిపారు.
కేంద్రం దిగుమతి సుంకం పెంపుతో వంటనూనె ధరలు పెరిగినట్లు గుర్తించారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.110కి పామాయిల్ ను ప్రభుత్వం అమ్ముతోందన్నారు. దిగుమతిదారులు, హోల్ సేల్, రిటైల్ నిర్వాహకులతో ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయన్నారు. రాయితీ ధరలపై క్యూఆర్ కోడ్ ద్వారా వంటనూనె అమ్మకాలు జరపాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా బియ్యం, కందిపప్పు, పంచదార రాయితీపై సరఫరా చేయనున్నారు. కిలో కందిపప్పు రూ.67, అరకిలో పంచదార రూ.16 చొప్పున విక్రయం చేయనున్నారు. రైతు బజార్లు, రాష్ట్రంలోని 2,200 ఔట్ లెట్లలో విక్రయానికి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రులు ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వ చర్యలతో గత నెలలో ఉల్లి, టమాట ధరలు తగ్గాయని మంత్రులు తెలిపారు.
154 మండల కేంద్రాల్లో సీపీ యాప్ ద్వారా రోజూ ధరల విశ్లేషణ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ధరల స్థిరీకరణకు రూ.500 కోట్లతో నిధి ఏర్పాటుకు ప్రభుత్వ యోచన చేస్తోందని మంత్రులు తెలిపారు. మార్కెట్ రుసుము సెస్ ను 2 నుంచి ఒక శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చార్జీలపై బహిరంగ ప్రకటన
ఇంధన కొనుగోలు, సర్దుబాటు ఛార్జీలపై బహిరంగ ప్రకటన వెలువడింది. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ ప్రకటన జారీ చేసింది. కొనుగోలు చేసిన విద్యుత్ కు సర్దుబాటు ఛార్జీలు విధించాలని డిస్కమ్ లు ప్రతిపాదన చేశాయి. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు కొన్న విద్యుత్ కు సర్దుబాటు ఛార్జీ వసూలు చేయనున్నారు. విద్యుత్ ఎక్సైజ్ లో 2023-24లో అధిక ధరలకు కొనుగోలున చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
అధిక ధరకు కొన్న విద్యుత్ కు ట్రూ అఫ్ ఛార్జీల విధింపు కోరుతూ ప్రతిపాదన చేశాయి. ట్రూ అప్ ఛార్జీల విధింపు కోరుతూ ఏపీఈఆర్సీకి డిస్కమ్ లు ప్రతిపాదించాయి. విద్యుత్ కొనుగోలుకు రూ.6.50 వ్యయమైందని డిస్కంలు పేర్కొన్నాయి. సర్దుబాటు ఛార్జీలుగా ఒక్కో యూనిట్ కు 0.4 పైసలు విధించేందుకు ఏపీఈఆర్సీ నిర్ణయించింది. ట్రూ అప్ ఛార్జీలపై అభిప్రాయాలు ఈనెల 19లోగా తెలపాలని ఏపీఈఆర్సీ కోరింది.
ఇవీ చదవండి: Power Bills: కూటమి ప్రభుత్వంలో బాదుడే బాదుడు
Perni Venkataramaiah: జగన్ సంపద సృష్టిస్తే.. కూటమి నేతలు ఏం చేస్తున్నారో తెలుసా?
YSRCP: వైయస్సార్ సీపీ కీలక పిలుపు.. అలా చేద్దామంటూ ప్రకటన
AP Political News: దీపావళికి గ్యాస్ బండ ఫ్రీగా ఇస్తామని విద్యుత్ చార్జీలతో బాదుడా?
