Rushikonda: రుషికొండ భవనాలను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న విశాఖలో పర్యటించిన నారా చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వంలో నిర్మించిన అధునాతన భవనాలను పరిశీలించారు. సుమారు గంటకు పైగా రుషికొండ (Rushikonda) భవనాలను చూశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏమన్నారంటే..
ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరుగుతాయా అని ఆశ్చర్యపోయే విధంగా ఈ సంఘటన జరిగింది. ఇలాంటివి సాధ్యమా అనిపిస్తోంది. కలలో కూడా ఇలాంటివి జరుగుతాయని ఊహించడం కూడా కష్టంగా ఉంది. ఒక వ్యక్తి విలాసవంత జీవితాల కోసం, తన స్వార్థం కోసం ఏ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారో మైండ్ బాగ్లింగ్. గుండె చెదిరిపోయే నిజాలు వస్తున్నాయి. ఇంత నేరాలు చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అన్నింటికీ తెగించాలి. అప్పుడే ఇలాంటివి చేయగలుగుతారు.
ప్రజాస్వామ్యం చాలా బలమైంది. ఇలాంటివి జరుగుతున్నాయని కోడై కూస్తున్నా ఎవరినీ ఇక్కడికి రానీయలేదు. జర్నలిస్టులు ప్రయత్నం చేశారు.. సోషల్ యాక్టివిస్టులు ప్రయత్నం చేశారు.. పర్యావరణ ప్రేమికులు ఎన్విరాన్‌మెంట్ అంతా డిస్టర్బ్ అవుతోందని వాపోయారు. అయినా ఎవరూ రాలేకపోయారు.
నేను కూడా ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేశా, పవన్ కల్యాణ్ కూడా ప్రయత్నం చేశాడు, బీజేపీ వాళ్లు ప్రయత్నం చేశాడు. ఎవరూ కూడా దరిదాపుల్లోకి కూడా ఇక్కడికి రాలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఏ విధంగా చేయగలుగుతారన్నది ఇది ఒక కేస్ స్టడీ. ప్రజాస్వామ్యం చాలా బలమైంది. ఆ రోజు అడ్డుకోగలిగారు కానీ ఈ రోజు నేరుగా వచ్చి చూస్తున్నాం. ఎంత దుర్మార్గంగా చేశారు అన్నది ప్రజలకు చెప్పే అవకాశం మాకు ఇచ్చారు.
ఎలాంటి వ్యక్తులను రాజకీయాల్లో రానీయకూడదన్నది ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత మళ్లీ అవకాశం ఇచ్చారు. నేను చాలా దేశాలు తిరిగా.. చాలా మంది పాలకులను చూశా. ఇలాంటి ప్యాలెస్‌లను ఎక్కడా చూడలేదు. సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్‌ను కట్టుకోవడం ఎక్కడా చూడలేదు. ఒకప్పుడు చంద్రగిరి ప్యాలెస్, విజయనగరం ప్యాలెస్, మైసూర్ ప్యాలెస్‌లను చూశాం. నాగరికత ప్రపంచంలో చరిత్రలో చాలా ప్యాలెస్‌లు ఉండిపోయాయి కానీ ఇలాంటి ప్యాలెస్‌లు కట్టుకోవాలని ఎవరూ చూడరు.
ఆ రోజు కూడా చరిత్రలో చూస్తే పాలకులు విలాస వంతమైన జీవితానికి పెద్ద పెద్ద ప్యాలెస్‌కుల కట్టుకోవడానికి ప్రపపంచలో దొరికే మార్బుల్ అంతా తెచ్చుకునేవాళ్లు, ఫ్యాన్సీ ఫర్నీచర్ పెట్టేవాల్లు హైదరాబాద్‌లో ఫలక్‌నుమా, ఢిల్లీలో చూశా. ఇప్పుడు ప్రజాధనంతో ఇలాంటివి కట్టుకున్నారంటే ఎంత ధైర్యం కావాలి. దానికి మీరంతా సాక్ష్యులు.
ఈ ప్యాలెస్ చూస్తే మొదటి కలిగిదే ఆశ్చర్యం. ఆ తర్వాత కలిగేది ఉద్వేగం..బాధ. ఒక వ్యక్తి విచ్చల విడితనంతో ఇంత దుర్మార్గంగా చేయగలుగుతున్నాడని ఆక్రోసం వస్తోంది. బాధ కలుగుతోంది. ఉత్తరాంధ్ర మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.400 కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ.. ఈ ప్యాలెస్ కోసం రూ.431 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ప్యాలెస్ కట్టేటప్పుడు అడుగడుగునా అబద్ధాలు చెప్పాడు. టూరిజం కోసం కడుతున్నామని నమ్మించారు.
రాష్ట్రపతి, ప్రధాని విడిది కోసం అంటూ బుకాయించే పరిస్థితి వచ్చింది. రాష్ట్రపతి, ప్రధాని వస్తే వాళ్లు నేవెల్ గెస్ట్ హౌస్‌లో ఉంటారు. వాళ్లు ఎప్పుడూ విలాసాలు కోరుకోలేదు. ఇతని మనస్తత్వం అర్థం కావడం లేదు. తను రాజు అనుకుంటున్నాడా.. రారాజు అనుకుంటున్నాడా.. చక్రవర్తి అనుకుంటున్నాడా..శాశ్వత్వంగా ఈ ప్యాలెస్‌లో కూర్చోవాలనుకున్నాడా అని అర్థం కావడం లేదు. ఈ ప్యాలెస్‌లోని 36 లక్షలు పెట్టి విలాసవంతమైన టబ్ పెట్టుకున్నాడు. దాంట్లో పడుకోవాలని కొన్నాడు. కమ్మోర్డ్ 12 లక్షలు పెట్టి కొన్నాడు. ఇక్కడ మూడు ప్యాలెస్‌లు కట్టాడు.
ఎందాడ గ్రామ పరిధిలో సర్వే నంబర్ 19లో మొత్తం 61 ఎకరాలు. ఇందులో 9.88 ఎకరాల్లో 7 బ్లాక్‌లతో కూడిన 7 విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. 19,968 చదరపు మీటర్లు అన్నారు.. చూస్తే 13,541 చదరపు మీటర్లలో 4 బ్లాకులు కట్టారు. విజయనగరం బ్లాక్.. ఇక్కడ ఏ, బీ, సీ అని మూడు బ్లాక్‌లు కట్టారు. ఇవి మామూలుగా లేవు. అదిరిపోయేలాగా ఉన్నాయి. 9.88 ఎకరాలు అనుకున్నది దగ్గర దగ్గర 18 ఎకరాలు కొండను తవ్వి ఆక్రమించారు. కొండను కొట్టేశారు జపాన్ టెక్నాలజీని ఉపయోగించారు. బ్లూ ఫాగ్ సీ.. ఇది సుందరమైన ప్రాంతం. విశాఖపట్నంలోనే ఇది బెస్ట్ బీచ్.
ఇక్కడ మొదటి బ్లాక్ `ఏలో నాలుగు బెడ్‌రూంలు ఉన్నాయి. “బిలో మూడో నాలుగో ఉన్నాయి.. “సి`లో నాలుగు రూంలు ఉన్నాయి. గజపతి బ్లాక్.. ఇక్కడ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టారు. అన్ని చోట్ల నుంచి సముద్రం వ్యూ కనపడేలా కట్టారు. లగ్జరీ ప్యాలెస్‌లాగా కట్టారు. కలింగా బ్లాక్.. ఇక్కడ 300 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ కట్టారు. రాజులు కూడా ఇలాంటి ఆఫీసులు కట్టుకుంటారని నేను అనుకోను. ఇక్కడ ఉన్న కారిడార్ చూస్తే వైట్ హౌస్‌లో కానీ, రాష్ట్రపతి భవన్‌లో కానీ ఇలాంటివి నేను చూడలేదు.
పీఏలకు, ఇక్కడ పనిచేసేవాళ్లకు లేటెస్ట్ టెక్నాలజీతో రూంలు కట్టారు. వేరే దేశాల నుంచి మార్బుల్స్ తెచ్చారు. వెంగీ బ్లాక్.. ఈ పేరు ఎలా వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. 100కేబీఎస్ సబ్ స్టేషన్, 200 టన్నుల సెంట్రల్ ఏసీ ఉన్నాయి. ఇలాంటి ఏసీ, ఫ్యాన్లను నేను ఎక్కడా చూడలేదు. దొంగలకు కూడా ఇంత ఇన్నోవేషన్ ఎలా వచ్చిందో తెలియడం లేదు. వీళ్ల సొంత డబ్బులు కాదు కాబట్టి అన్ని రూల్స్ వయోలేషన్ చేశారు. ఎన్‌జీటీని, హైకోర్టును అన్నింటినీ మభ్యపెట్టారు.
అధికారులను బెదిరించి పనులు చేయించారు. ఈ రోజు ఎంక్వైరీ చేస్తే ఎంతోమంది ఎగిరిపోయే పరిస్థితి ఉంది. ఒక దుర్మార్గుడు.. కరుడుకట్టిన నేరస్తుడు.. ఒక ఎస్కోబార్. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు పనికి వస్తారా అన్నది చూడాలి. ఒకపక్క పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటూనే ఇలా విలాసవంతమైన ప్యాలెస్‌లు కట్టుకుంటాడు.
ఈ ఐదు వందల కోట్లతో కనీసం రోడ్డకు గుంతలన్నా పూడ్చేవాళ్లం. సర్వే రాళ్ల పై తన బొమ్మ వేసుకునేందుకు రూ.700 కొట్లు ఖర్చు పెట్టాడు. పురాణాల్లో కొందరు రాజులు ఇచ్చిన మాట కోసం రాజ్యాలను త్యాగం చేశారు. ఇతను తన భోగ విలాసాల కోసం ప్రజాధనాన్ని వాడుకున్నాడు. పెద్ద ప్యాలెస్ నిర్మించుకున్నాడు. ఇవన్నీ వీడియోలు తీస్తాం.. డిటెయిల్స్ ఇస్తాం. ప్రజల ముందు పెడతాం. దీనిపై పెద్ద ఎత్తున చర్చ పెడతాం.. ఎలాంటి ఉల్లంఘనలు చేశారో పెడతాం.. దీన్ని ఏం చేయాలో … దేనికి ఉఫయోగపడుతుందో అర్థం కావడం లేదు.
ఇది దేనికీ వయబుల్ కాదు.. దేశంలో ఎక్కడా లేనటువంటి అరుదైన ప్లేస్ పై ఈయన కన్ను పడింది. ఇక్కడ క్యాంప్ ఆఫీసు ఏంటో నాకు అర్థమే కాలేదు.. ఇంకో బ్లాక్ కట్టారు.. పేరు చెప్పను.. గజపతి బ్లాక్..ఆ ఆఫీసు ఏంటో అర్థమే కాలేదు…? ఏదైనా ఒక ప్లానింగ్ ఉండాలి కదా.. ఏం కట్టినా ఒక పర్పస్ ఉండాలిగా ?ఎక్కడికి పోతున్నారు మీరు. సిగ్గు.. బిడియం.. ప్రజలంటే భయం ఉంటే.. యూ కెన్ ఆన్సర్ దిస్. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆన్సర్ చేయాలి.
వారికి శాశ్వతంగా ఉంటామనే ధీమా వచ్చింది .. ప్రజాస్వామ్యంలో ఎవరూ శాశ్వతం కాదు. విశాఖను మోసం చేయడానికి..చేసే అరాచకాలు చేసి.. రాజధాని ఇక్కడ పెడతున్నానని నమ్మించేందుకు.. ఇలాంటి తప్పుడు పనులు చేశాడు. రాజధాని కట్టకుండా ప్రజలను మభ్య పెట్టేందుకు ఈ కట్టడాలు కట్టారు. నేరుగా చేశాను.. నేను కలలో కూడా ఊహించలేదు.. ఇలా రాజకీయ నాయకులు తప్పుడు పనులు చేసి ఎదురుదాడి చేస్తారని నేను కలలో ఊహించలేదు. రాష్ట్రాన్ని దోచుకుని సంపాదించడం సమర్ధనీయం కాదు.
అందరినీ విస్మయానికి గురి చేసే అలాంటి సంఘటన. ప్రజా స్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఛీ కొట్టాల్సిన సంఘటన. దీనిపై చర్చ చేసి.. లాజికల్ గా ఎలా తీసుకువెళ్లాలో ఆలోచన చేద్దాం. ఇప్పుడు తవ్విన కొద్దీ ఆశ్చర్యపరిచే ఘటనలు బయటికి వస్తున్నాయి. ఎవరు ఇచ్చారు వీరికి ఆ ధైర్యం.. ఇలాంటి తప్పులు చేసి.. మళ్లీ బుకాయిస్తున్నారు. నలబై ఏళ్లు రాజకీయాలు చేశాం.. పోరాటం చేశాం.. సిద్ధాంత పోరాటం.. కానీ రాజకీయ ముసుగులో తప్పులు చేసి ఎదురుదాడి చేస్తున్నారు. ఇప్పడు రాజకీయ ముసుగు వేసుకున్న నేరస్తులపై పోరాటం చేయాల్సి వస్తోంది.
టూరిజంకు ఇది వయబుల్ కాదు… ప్రజా స్వామ్యం భారీ ప్రైస్ పే చేసింది. శిక్ష ఏమి వేయాలి.. ఎలా ముందుకు తీసుకువెళ్లాలి. ముందు యాజ్ ఇట్ ఈజ్ దీనిని ప్రజలను చూడనివ్వండి. ఏ సీఎం కూడా ఇంతలా బరి తెగించలేదు. నేను ఏం చేసినా.. ఆరునెలల తర్వాత మర్చిపోతారు.. మళ్లీ రావచ్చు.. వెయ్యి కోట్లు మిగిలిపోతాయి. విలాసవంతంగా బతకొచ్చు. వాటీజ్ దిస్. ఇలాంటి అవినీతిపరులు హీరోలుగా తయారైతే.. సమాజం ఎక్కడికి పోతుంది. మళ్లీ ఇలాంటి దుర్మార్గుడు వస్తే.. విశాఖ పట్నం మిగలదు.. సముద్రం మిగలదు..ఏమీ మిగలదు. ఒక కాస్టలీ ప్రయోగం జరిగింది. ప్రజాస్వామ్యం చిన్నబోయేలా జరిగింది. ఇది నేరం అవునా కాదా? ఇలాంటి నేరం చేసిన వాళ్లని ఏం చేయాలి? ప్రజా కోర్టులో శిక్షించాలి.’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: Rushikonda: అద్భుతమైన భవనాలు కడితే దుర్మార్గం.. ఏమీ కట్టకపోతే అమోఘం!
Nara Chandrababu Naidu: నా మీటింగ్‌లో ఆర్భాటాలు ఉండవు.. చెట్లు నరకడం ఉండదు
CM Chandrababu: ఇసుక, మద్యంలో జోక్యం వద్దు.. చంద్రబాబు వార్నింగ్
Chandrababu: జనసేన, బీజేపీలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి
