Pakistan Cricket: పాకిస్తాన్ వైట్-బాల్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ నియమితులైన ఆరు నెలల్లోనే ఆ దేశ క్రికెట్ బోర్డుతో విభేదాలు ఏర్పడిన తరువాత పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2011 వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు విజయాన్ని అందించిన 56 ఏళ్ల గ్యారీ కిర్ స్టెన్.. ఈ ఏడాది ఏప్రిల్ చివరిలో పీసీబీ PCB (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు)కు (Pakistan Cricket) నియమితులయ్యాడు.
కోచ్ లేదా కెప్టెన్ నుంచి ఎటువంటి ఇన్‌పుట్ తీసుకోకుండా, జట్లను ఎంపిక చేసే పూర్తి బాధ్యతను జాతీయ సెలక్షన్ కమిటీకి అప్పగించినప్పటి నుంచి కిర్‌స్టన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మధ్య విభేదాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ టెస్ట్ కోచ్ జాసన్ గిల్లెస్పీ తన పాత్రను మ్యాచ్-డే విశ్లేషకుడిగా పరిమితం చేశారని, ఇది అతని మార్క్ కాదని చెప్పాడు. కిర్‌స్టెన్ ఈ విషయంపై బహిరంగ ప్రకటన చేయనప్పటికీ, ESPNCricinfoలోని నివేదికలో అతను ఇటీవలి పరిణామాలతో చాలా కలత చెందాడని వెల్లడించింది.
మొహమ్మద్ రిజ్వాన్‌ను పాకిస్తాన్ కొత్త వైట్-బాల్ కెప్టెన్‌గా నియమించినప్పుడు కూడా కిర్‌స్టన్ నుంచి కనీసం ఇన్‌పుట్ తీసుకోలేదు. విలేకరుల సమావేశంలో రిజ్వాన్ నియామకం అధికారికంగా ప్రకటించినప్పుడు దక్షిణాఫ్రికా దేశస్థుడైన కిర్ స్టెన్ దేశంలోనే లేడు. ఓ నివేదిక ప్రకారం, అతని నిష్క్రమణ నిర్ణయం రెడ్ బాల్ కోచ్ జాసన్ గిల్లెస్పీతో విభేదాలే కారణమయ్యాయని తెలుస్తోంది.
ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో తొలి టెస్టులో పాకిస్థాన్ ఓడిపోవడంతో సెలక్షన్ కమిటీలో ఆకిబ్ జావేద్, అలీమ్ దార్, అజర్ అలీ, అసద్ షఫీక్, హసన్ చీమాలు చోటు దక్కించుకున్నారు. ఆఖీబ్ పాకిస్థాన్ వైట్-బాల్ కోచ్‌గా దీర్ఘకాలిక ప్రాతిపదికన బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు.
నవంబర్ 4 నుంచి ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ వైట్ బాల్ పర్యటన ఉంది. ఈ క్రమంలో జట్టులో మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం.
ఇవీ చదవండి: T20 Cricket: టీ20 క్రికెట్‌లో జింబాబ్వే చితక్కొట్టుడు.. రికార్డులు బద్దలు
Cricket: టీమిండియా కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్.. నవంబర్ 17 నుంచి దిగ్గజాల టోర్నీ!
T10 Cricket: టీ10 క్రికెట్‌లో సంచలనం.. స్కాట్లాండ్ బ్యాటర్ రికార్డు సెంచరీ
Pakistan: ఇమ్రాన్‌ఖాన్ టార్గెట్.. పాక్ సర్కారు సక్సెస్ అయిందా?
Dhoni Rohit Sharma: హిట్ మ్యాన్‌పై మహీ పొగడ్తలు.. ఏమన్నాడంటే
Virat Kohli: కోహ్లీ ప్రపంచ రికార్డు.. టెస్టు చరిత్రలో సంచలనం
