Akhila Priya: నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ (Akhila Priya) మరోసారి హల్ చల్ చేశారు. నంద్యాల విజయ డెయిరీలో ఆకస్మిక తనిఖీలు చేసిన అఖిల ప్రియ.. చైర్మన్ పై ఫైర్ అయ్యారు. డెయిరీలో ఎన్టీఆర్ శిలాఫలకం తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ పై కేకలు వేస్తూ ఫోన్ లో హంగామా చేశారు.
ఛైర్మన్ ఛాంబర్ లో మాజీ సీఎం జగన్ చిత్రపటం ఉండటంతో డెయిరీ డైరెక్టర్ పై ఎమ్మెల్యే అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాంబర్ లోని జగన్ చిత్రపటం తొలగించి సీఎం చంద్రబాబు ఫొటోను స్వయంగా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.
అఖిలప్రియ విజయ డెయిరీలోకి రావడమే కాక చైర్మన్ కుర్చీలో కూర్చోవడంపై డెయిరీ ఛైర్మన్ ఎస్వీ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తనని ప్రశ్నించకూడదంటూ అఖిల ప్రియ హల్ చల్ చేశారు. అభ్యంతరం ఉంటే రాత పూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలని దబాయించారు. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, విజయా డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఫోన్ లో తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.
వైయస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడులు
నంద్యాల జిల్లాలో వైయస్సార్ సీపీ సానుభూతి పరులపై దాడులు జరుగుతున్నాయి. కోవెలకుంట్ల మండలం పెద్ద కొప్పెర్ల గ్రామంలో వైయస్సార్ సీపీ సానుభూతిపరులపై గ్రామ టీడీపీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి తో పాటు అనుచరులు దాడికి పాల్పడ్డారు. పెద్ద కొప్పెర్ల గ్రామంలో వైఎస్సార్ సీపీ ఉనికి ఉండకూడదనే అక్కసుతో మైనారిటీ కుటుంబాలపై కట్టెలతో టీడీపీ నాయకులు దాడి చేశారని బాధితులు వాపోయారు.
టీడీపీ నాయకుల దాడిలో పది మందికి గాయాలయ్యాయి. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. రేవనూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి భాదితులు వెళ్లగా, పోలీసులు కేసు నమోదు చేసుకోలేదని చెబుతున్నారు. కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ కు వెళ్లాలంటూ సలహా ఇచ్చారని బాధితులు చెబుతున్నారు.
https://twitter.com/swati_YSJ/status/1846425746715431115
ఇవీ చదవండి: Bhuma Akhila Priya: భూమా అఖిల ప్రియపై కలెక్టర్ కు గంగుల నాని ఫిర్యాదు
Akhila Priya: చెప్పినట్టుగానే చేస్తున్న అఖిలప్రియ.. వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం
Akhila Priya: నాకూ ఓ రెడ్ బుక్.. 100 మంది ఇబ్బంది పడతారు: అఖిల ప్రియ
Jagan vs CBN: జగన్ ఇంటి ఫెన్సింగ్ వర్సెస్ చంద్రబాబు దుబారా!
YS Jagan on Liquor: లిక్కర్ పాలసీపై వైయస్ జగన్ సంచలన ట్వీట్
