Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగం పెంచింది. ఏఆర్ డెయిరీతో సహా గత టీటీడీ బోర్డులో కొందరు బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిన్న టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళీకృష్ణను సిట్ బృందం ప్రశ్నించింది. ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక ప్రయోజనాలపై అధికారులు ప్రశ్నలు గుప్పించినట్లు తెలుస్తోంది.
ఏఆర్ డెయిరీ ప్లాంట్ సామర్థ్యం, నెయ్యి తయారీ విధానాలను పరిశీలించడానికి తమిళనాడులోని దుండిగల్ కు సిట్ అధికారులు వెళ్లనున్నారు. లడ్డూ పోటు పరిశీలించి, తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను మరో బృందం ప్రశ్నించనుంది. టీటీడీ పరిపాలన భవనంలో నెయ్యి కొనుగోలు ఒప్పందాలను ఇంకో బృందం పరిశీలించనుంది. మార్కెట్ విలువ కంటే తక్కువకు కోట్ చేసినప్పటికీ టెండర్ ను బోర్డు ఎలా ఆమోదించిందో తెలపాలంటూ అధికారులు, బోర్డుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
YS Jagan Decleration: జగన్ తిరుమల పర్యటన రద్దు.. డిక్లరేషన్‌పై ఎందుకీ వివాదం?
YS Jagan: వైయస్ జగన్ తిరుమల వెంకన్న దర్శనం వేళ డిక్లరేషన్ వివాదం
YS Jagan on Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirumala Laddu: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు
