HomeCinemaDevara Trailer: దేవర ట్రైలర్.. సోషల్ మీడియా షేక్ అవ్వాలి.. చూసేందుకు రెడీనా?

Devara Trailer: దేవర ట్రైలర్.. సోషల్ మీడియా షేక్ అవ్వాలి.. చూసేందుకు రెడీనా?

Devara Trailer: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర చిత్రం ట్రైలర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఇందుకోసం అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ, ఇతర నటీనటులు ఇప్పటికే ముంబై చేరుకున్నారు.

ఆర్ఆర్ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర కావడంతో పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. భారీగా క్రేజ్‌ పెరిగింది. మేకర్స్‌ కూడా ప్రమోషన్స్‌ కార్యక్రమాలు విస్తృతం చేశారు. బాలీవుడ్‌ నుంచే దేవర సినిమా ప్రమోషన్లను శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ముంబై చేరుకున్న ఆయన రేపు ట్రైలర్‌ రిలీజ్ వేడుకలో పాల్గొంటారు. ఇదే ఈవెంట్‌లో హిందీ మీడియాతో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ మాట్లాడనున్నారు.

‘దేవర’ సినిమా ఉత్తరాది ఇండియా థియేట్రికల్ హక్కులను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ దక్కించుకోవడం విశేషం. కరణ్ జోహార్‌కి చెందిన ఈ నిర్మాణ సంస్థ మొదట ‘బాహుబలి’ చిత్రాన్ని బాలీవుడ్‌ లోకి బాగా తీసుకెళ్లింది. ఇప్పుడు ‘దేవర’ చిత్రాన్ని నార్త్ బెల్ట్‌లో విడుదల చేసేందుకు భారీ ధరకు హక్కులను దక్కించుకుంది. బాలీవుడ్‌లో దేవరకు ఎదురే లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

సెప్టెంబర్‌ 27న తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా దేవర చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌ అంచనాలను పెంచేశాయి.

ఇవీ చదవండి: Devara: దేవర నుంచి మరో సాంగ్ రిలీజ్.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌తో జాన్వీ పోటీ పడిందా?
Fear song from Devara: దేవర నుంచి ఫస్ట్‌ సాంగ్ రిలీజ్.. మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ కెవ్వు కేక!
NTR: క్లాస్‌ అండ్‌ మాస్.. దంచి కొడుతున్న ఎన్టీఆర్..!
NTR: రామ్ చరణ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ త్యాగం!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు