HomeAndhra PradeshYS Jagan: ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్.. ఇంత నిర్లక్ష్యమా? : వైయస్ జగన్

YS Jagan: ఇవి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్.. ఇంత నిర్లక్ష్యమా? : వైయస్ జగన్

YS Jagan: విజయవాడ మునగడానికి కారణం చంద్రబాబు నిర్లక్ష్యమేనని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. వరద బాధితులను పరామర్శించిన సందర్భంగా మీడియాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.

భారత వాతావరణ శాఖ నుంచి తుపానుపై హెచ్చరికలు ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహించిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులకు రిలీఫ్ క్యాంపులు లేవని, ఆర్థిక సాయం కథ దేవుడెరుగు.. మంచి నీళ్లు కూడా దొరకని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను పరామర్శించిన అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

’’ఎంత దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉందంటే, ఒక్కసారి మైకు పెట్టి ఎవరినైనా అడగండి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ల ఇళ్లలో నుంచి దాదాపుగా రెండు రోజులపాటుక కనీసం తిండి కూడా లేని పరిస్థితి నుంచి బోట్లు ఏమైనాయంటే చాలీ చాలని పరిస్థితి, ఆ బోట్లు కూడా ఎక్కించుకోని పరిస్థితులు, సందుల్లోకి, గొందుల్లోకి బోట్లు పోని పరిస్థితి. బోట్లలో వచ్చే వారి సంఖ్య, నడుచుకుంటూ వచ్చే వాళ్లు ఎంత మంది ఉన్నారు? గమనించండి. ఈలోతు దాకా నీళ్లు ఉండి నడుచుకుని వస్తున్నారు. వచ్చిన వాళ్లుక కనీసం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలో తెలియదు. కనీసం రిలీఫ్ క్యాంపులు లేవు. వీళ్లను తీసుకుని వెళ్లే కార్యక్రమం లేదు. చెప్పిందీ లేదు, చేసిందీ లేదు.

వాళ్ల బంధువుల ఇళ్లకు పోతున్నారు. కనీసం వాళ్లకు ఇళ్లలోకి నీళ్లు పోయాయి, రిలీఫ్ క్యాంపులు పెట్టని పరిస్థితి, కనీసం ఎవరికైనా సహాయం చేశారా;? కాస్తో కూస్తో ఇచ్చారా అంటే.. ఒక్కరికి కూడా కనీసం దమ్మిడీ పైసా ఎవరికీ ఇవ్వలేదు. నిజంగా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ చూసి ఉండం.

ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. అంటే దాని అర్థం.. ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈరకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది. ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి. ఇప్పుడు పడిన వర్షానికన్నా ఎక్కువ వర్షాలు పడ్డాయి. కానీ ఏరోజూ కూడా మనుషులు చనిపోయిన పరిస్థితి, ఇంతటి దారుణమైన పరిస్థితి ఏరోజూ రాలేదు.

ఆగస్టు 28న బుధవారం నాడే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని, వా యుగుండంగా మారుతోందని రాష్ట్ర ప్రభుత్వానికి అలర్ట్ వచ్చింది. ఆ అలర్ట్ లో గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయి. చిన్నగా పడతాయి. శుక్రవారం సాయంత్రానికల్లా అది ఎక్స్ ట్రీమ్ రెయిన్ ఫాల్ కింద మారుతుంది. శనివారం అంతా ఉంటుందని అలర్ట్ వచ్చింది. అంటే 20 సెం.మీ.పైగా పడుతుంది అంటే అది ఎక్స్ స్ట్రీమ్ రెయిన్ ఫాల్ అని. మరి అది ఎక్కడ వస్తుంది? ఏయే మండలాల్లో వస్తుందని ఐఎండీ ద్వారా మనకు సమాచారం ఉంది. కానీ మనం ఏం చేశాం అన్నది ఒక ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచన చేయాలి.

28న అలర్ట్ వచ్చిన వెంటనే ఎక్స్ ట్రీమ్ రెయిన్ ఫాల్ మనదగ్గరే కాదు, కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు, తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా పడుతుందని చెప్పడం జరిగింది. కృష్ణా నది క్యాష్మెంట్ ఏరియా భీకరంగా తయారవుతుందని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం అన్నాక ఏం చేయాలి?

శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల డ్యాములు ఇప్పటికే నిండి ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం ఇరిగేషన్, రెవెన్యూ, హోం శాఖలతో రివ్యూ చేసి ఈ రకంగా తుఫాను రాబోతోంది, డ్యాములు నిండి ఉన్న నేపథ్యంలో, ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని ఒక ప్రణాళికబద్ధంగా ఒక కార్యక్రమం చేయాలి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి కనీసం 60-70 టీఎంసీల నీటిని అక్కడి నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయకపోవడం వల్ల కృష్ణా నదిలో వరదలు రావడం, ఒకవైపున తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా 1.70 లక్షల క్యూసెక్కులు రావడం, ఇది కూడా మనకు సీడబ్ల్యూసీ వాళ్ల నుంచి సమాచారం ఉంది.
ఈనెల 30 నుంచి కృష్ణా నది ఇంకా భీకరంగా నీళ్లు వస్తాయని సమాచారం ఉంది.

శ్రీశైలంలో నీళ్లను తగ్గించి ఉంటే, తుంగభద్ర నీళ్లు శ్రీశైలం, నాగార్జున సాగర్ లో ఆపి ఉంటే, ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్ స్టాన్షియల్ గా నీటిని అక్కడే మనం కట్టడి చేసి ఉండొచ్చు. అది కాక కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తున్న నీళ్లు మూసీ నది నుంచి వస్తున్న నీళ్లు ఇవన్నీ కూడా పులిచింతలలో ఇప్పటికే నిండిన కెపాసిటీ.. అక్కడ కూడా నీళ్లు తగ్గించి ఉంటే, అక్కడ కూడా నీళ్లు ఆపి ఉండే పరిస్థితి. కానీ అవేమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించలేదు. 30వ తేదీ నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చి ఉంటే ఒక 8 లక్షలు లేదా 9 లక్షల క్యూసెక్కులు అలా వెళ్లిపోయేవి. అప్పుడు ఈ మాదిరిగా 11.35 లక్షల క్యూసెక్కులు వరద వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు అనే వ్యక్తి తాను ప్రజల్ని పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ, కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడుతున్నాడు తప్ప, గవర్నెన్స్ మీద, ఏం చేయాలి అన్న దానిపై ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైంది.

దీనికి 30వ తారీఖు నుంచి పక్కా ప్రణాళిక చేసి ఉంటే మనకు బుధవారమే తుఫాన్ రాబోతోంది అని అలర్ట్ వచ్చినప్పుడే మనం ప్లానింగ్ చేసి ఉంటే తుంగభద్ర నుంచి వచ్చే నీరు శ్రీశైలం, నాగార్జున సాగర్ లో ఆగి ఉండేవి. పులిచింతలలో మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు. తర్వాత ఉప నదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డ్యామేజ్ ఎక్కడా ఉండేది కాదు.

బుడమేరు నుంచి వరదలు వస్తున్నాయని తెలుసు. వాటిని కూడా ఇక్కడి నుంచి పంపించే కార్యక్రమమే చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఎంత దారుణమైన పరిస్థితి నుంచి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించిన 11 లాకులను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు. అలర్ట్ లేదు. ఈ ప్రాంతంలోని ప్రజలను కనీసం పట్టించుకోకుండా ఎత్తేశారు. ఎందుకు ఎత్తారు? చంద్రబాబు నాయుడు ఉన్న కరకట్ట మీద ఇంటికి నీళ్లు పోకుండా రక్షించుకునేందుకు విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు.

నేను అడుగుతున్న ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతున్నాను. ఎవరైనా సమాధానం చెప్పాలనుకుంటే మొట్ట మొదట ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ప్రజలకు ఏం చేయబోతున్నామన్నది చెప్పి, ఆ తర్వాతే సమాధానం చెప్పాలని చంద్రబాబును గట్టిగా చెబుతున్నాను. ఇప్పటికీ రిలీఫ్ క్యాంపులు లేవు. నిన్నటి దాకా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని అడిగితే 6 రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. లక్షల మంది ఈరోజు నీట మునిగి ఉన్నారు. 6 రిలీఫ్ క్యాంపులు ఏ మూలకు సరిపోతాయి? ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో ప్రజలందరూ ఎక్కడికి పోవాలో తెలియదు, ఎక్కడ క్యాంపులు ఏర్పాటయ్యాయో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలంతా ఉన్నారు. ఇంతటి దారుణమైన మేనేజ్ మెంట్ ఏ ముఖ్యమంత్రీ ఏ హయాంలోనూ జరిగి ఉండదు.

11.30 లక్షల క్యూసెక్కులు రావడం కొత్తేమీ కాదు. ఇటువంటిదే 1903లో 11.90 లక్షల క్యూసెక్కులు, 2009లో కూడా 11.10 లక్షల క్యూసెక్కులు వచ్చింది. మా హయాంలో కూడా 2019, 2020, 2021, 2022లో కూడా ఇలాంటి రెయిన్ ఫాల్ నమోదు అయ్యింది. అయినా కూడా మా హయాంలో ఎప్పుడూ కూడా 11 లక్షల క్యూసెక్కులకు చేరడం, దాని వల్ల ప్రజలందరూ అతలాకుతలం కావడం ఎప్పుడూ జరగలేదు. 2021లో శ్రీశైలం నుంచి దిగువకు 8 లక్షల క్యూసెక్కులు కిందికి వదలడం జరిగింది. దిగువ పులిచింతలలోకి మూసీ నది నుంచి 1.50 లక్షల క్యూసెక్కులు రావడం జరిగింది.

మున్నేరు నుంచి ప్రశాశం బ్యారేజీలోకి 3.50 లక్షల క్యూసెక్కులు చేరినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల రిజర్వాయర్లు అన్నింటిలో కూడా ముందు నుంచే ఫ్లడ్ వస్తోందని, వాయుగుండంగా మారుతోందన్న సమాచారం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం, పులిచింతల, నాగార్జున సాగర్ డ్యాముల్లో నీటిని తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వల్ల డెవస్టేషన్ రాకుండా కేవలం 8 లక్షలు, 9 లక్షల క్యూసెక్కులు మాత్రమే కిందికి వెళ్లిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాం అన్నది కూడా ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుతున్నా.

ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ ను క్రియేట్ చేసినందుకు చంద్రబాబునాయుడు మొట్ట మొదటగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజలకు కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు. తినేదానికి తిండి లేదు. తాగేదానికి నీళ్లు లేవు. రిలీఫ్ క్యాంపులు లేవు. రూపాయి డబ్బు ఇవ్వలేదు. వీళ్లందరూ ఎలా బతకాలి అని అడుగుతున్నారు. చంద్రబాబు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పాలని అడుగుతున్నాను.

పార్టీ నుంచి అందరూ క్రియాశీలకంగా పని చేస్తారు. శీను దగ్గర నుంచి పార్టీ కేడర్ ఇప్పటికే పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వారు, కార్పొరేటర్ల దగ్గర నుంచి అందరూ కూడా ఇదే నీటిలో ఉన్నారు. ఈరోజు నుంచే కాదు. రెండు రోజుల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ కొద్దో గొప్పో వీళ్లు చేయగలిగినంత వరకు కచ్చితంగా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం అన్నది స్పందించాలి. అది చాలా ముఖ్యం.

జగన్ హయాంలో కూడాప్రభుత్వం ఉండేది. కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ అసంతృప్తిగా లేదు. ఎందుకు లేరంటే కారణం.. జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఉండేది. గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో మమేకమై ఉండేది. ఎప్పుడు వరద, తుపాన్ వచ్చినా వీళ్ల సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి ఫిర్యాదులతు ప్రజల నుంచిరాకుండా శాచ్యురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగాం. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుపాన్ వస్తే, కలెక్టర్ గారికి నేను చెప్పేవాడిని. నేను మీకు వారం రోజులు టైమ్ ఇస్తున్నా. వారం తర్వాత నేనే వస్తాను. వచ్చిన తర్వాత ప్రజలతో మమేకమై నేను అడుగుతాను. ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు, కలెక్టర్ స్పందించలేదు, కలెక్టర్ వల్ల మాకు మంచి జరగలేదు అన్న మాట ఎప్పుడూ వినపడకూడదు అని నేను ఆదేశాలు ఇచ్చేవాడిని. మా కలెక్టర్ బాగా పని చేశాడు, మా కలెక్టర్ మంచివాడు అని వినపడాలని గట్టిగా చెప్పేవాడిని. చెప్పిన ప్రకారం వారం రోజుల తర్వాత నేను వెళ్లేవాడిని. అప్పటికే వాలంటీర్ల సైన్యం అక్కడ ముందే ఉండేది.

గ్రామ సచివాలయాల్లో పని చేసే మొత్తం పిల్లలందరూ అక్కడే ఉండేవారు. వారం రోజులపాటు వాళ్లంతా కూడా ప్రభుత్వం అంతా కలిసి ప్రతి గడపకూ వెళ్లి సహాయ సహకారాలు అందిస్తూ, మొట్ట మొదటి సారిగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు ఆర్థిక సహాయం కూడా అందించినది ఒక్క జగన్ హయాంలోనే జరిగింది. అటువంటి కొత్త కొత్త సంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చింది మనమే. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ముందు పెట్టింది మనమే. పూర్తిగా ప్రతి గడపకూ సహాయ సహకారాలు అందించగలిగాం. రిలీఫ్ క్యాంపులు తుపాను వచ్చే నాటికే ఏర్పాటు అయ్యేవి. ముందుగానే లోతట్టు ప్రాంతంలో ఉన్న మనుషులను పంపేవాళ్లం. రిలీఫ్ క్యాంపుల్లో అందరినీ బాగా చూసుకోవడమే కాకుండా, బయటకు వెళ్లేటప్పుడు రూ.2 వేలు డబ్బులు కూడా ఇచ్చి పంపించిన కార్యక్రమం అప్పట్లో జరిగింది. అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించండి. చంద్రబాబు నాయుడు కూడా కనీసం ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి చేయాల్సిన పనులు గట్టిగా చేయాలని అడుగుతున్నా.

ప్రతి బాధితుడు కూడా మాట్లాడినది మీరు కూడా విన్నారు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారంటే తెలియదు సార్, తెలియదు అన్నా, మా బంధువుల ఇళ్లకు పోవాలి అంటున్నారు. కనీసం ఒక్క బాధితుడైనా రిలీఫ్ క్యాంపులకు మేం పోతున్నాం, అక్కడ పెట్టారు అన్న మాట ఒక్క బాధితుడైనా చెప్పాడా? అని అడుగుతున్నా. రెండు రోజుల్లో కనీసం ఏదైనా సహాయం అందిందా? ఇంటికి వచ్చి ఎవరైనా డబ్బులిచ్చారా? అని అడిగాను. డబ్బులు కథ దేవుడెరుగు.. మంచి నీళ్లు ఇచ్చే నాథుడు లేడనే మాటలు వినిపించాయి. మీరంతా కూడా విన్నారు. ఇది ప్రభుత్వ తప్పిదమే. మ్యాన్ మేడ్ ఫ్లడ్ మాత్రమే.’’ అని వైయస్ జగన్ అన్నారు.

Read also: YS Jagan: వక్ఫ్ బిల్లుకు మేం వ్యతిరేకం.. వైయస్ జగన్ క్లారిటీ
YS Jagan: మరో మూడు నెలల్లోనే చంద్రబాబు…. వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan: ఢిల్లీలో ధర్నాపై వైయస్సార్‌సీపీ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు
CBN vs YS Jagan: తగ్గేదే లేదు.. ఏపీలో హై వోల్టేజ్ రాజకీయం!
Prannoy Roy Interview with YS Jagan: వైయస్ జగన్‌తో ప్రణయ్ రాయ్‌ ఇంటర్వ్యూ.. అభివృద్ధి, మద్యం పాలసీపై క్లారిటీ!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు