HomeCinemaIndian 2: భారతీయుడు 2 ఓటీటీ వేదిక ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

Indian 2: భారతీయుడు 2 ఓటీటీ వేదిక ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

Indian 2: ఇటీవల విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న భారతీయుడు 2 చిత్రం ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ (Kamal Haasan) ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. భారతీయుడు 2 (Indian 2). శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది.

ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈనెల ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది ఇండియన్ 2. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. చిత్ర అర‌వింద‌న్ (సిద్ధార్థ్‌), ఆర్తి (ప్రియ భ‌వానీ శంక‌ర్‌) మ‌రో ఇద్ద‌రు స్నేహితులు క‌లిసి స‌మాజంలో అవినీతి, అన్యాయాలపై గళమెత్తుతుంటారు. సోషల్ మీడియా వేదికగా పోరాటాలు ఉదృతం చేస్తుంటారు. ఒక త‌ప్పు చేసినా దాని నుంచి తప్పించుకోలేము అన్న భయం అందరిలో రావాలని, అందుకు ఇండియన్ (భారతీయుడు అలియాస్ సేనాపతి) రావాల్సిందేనని చెబుతుంటారు.

ఈ నేపథ్యంలో మిత్రబృందం అంతా కలిసి సోషల్ మీడియాలో ఈ అంశాన్ని వైరల్ చేస్తారు. ఆ పిలుపును అందుకున్న సేనాప‌తి స్వదేశంలో అడుగు పెడ‌తాడు. ఇన్నాళ్లూ ఆయ‌న ఎక్క‌డున్నాడు? తిరిగొచ్చిన తర్వాత ఆయ‌న స‌మాజంలో కుళ్లుని ఏ విధంగా క్లీన్ చేసేస్తాడు. ఇదే క్రమంలో చోటు చేసుకున్న అనేక పరిణామాలేంటి? అన్నది మిగిలిన కథ. సేనాపతి కోసం కాపు కాసిన సీబీఐ అధికారి ప్ర‌మోద్ (బాబీ సింహా) భార‌తీయుడిని అరెస్ట్ చేశాడా? తదితర వివరాలు తెలియాలంటే చిత్రాన్ని ఓటీటీ వేదికగా చూసేయండి మరి.

ఇవీ చదవండి: Indian 2: సేనాపతికి ఊహించని షాక్.. వారం రోజుల కలెక్షన్లు ఇంతేనా?
Kalki Trailer: కల్కి ట్రైలర్‌ ఆగయా.. రికార్డ్స్‌ చెక్‌ చేసుకోమంటున్న ప్రభాస్‌
Kalki 2898 AD: కల్కి 2898AD ప్రత్యేకం.. స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచంటే!
Project K: ప్రభాస్‌ అభిమానులకు మరో గుడ్‌ న్యూస్‌.. ‘ప్రాజెక్ట్‌ కె’పై కీలక అప్‌డేట్‌.. టైటిల్‌ రివీల్‌ ఏ దేశంలో అంటే..!
The Raja Saab: రాజా సాబ్ గ్లింప్స్.. డార్లింగ్ ప్రభాస్ లుక్ అదిరిందిగా..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు