Kalki Trailer: రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసేలా ఎలివేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ చాలా పవర్‌ఫుల్ గా, జోయ్ ఫుల్‌గా కనిపించారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Haasan) తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ యాక్షన్ సీన్లలో నటన ఇరగదీసినట్లు ట్రైలర్‌లో స్పష్టం అవుతోంది. ఇక ప్రభాస్.. డైలాగులతో, యాక్షన్‌తో వేరే ప్రపంచానికి తీసుకెళ్లడం పక్కా అనే విధంగా ట్రైలర్ ఉంది. కల్కి మూవీ ట్రైలర్ తెలుగులో ఇక్కడ చూసేయండి.
ఇవీ చదవండి: Kalki 2898AD: ప్రభాస్ కల్కి వాయిదా? మే 13న ఎన్నికల నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
Kalki 2898 AD: కల్కి 2898AD ప్రత్యేకం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!
What Is Project K Movie : కల్కి 2898 AD.. ఈసారి హాలివుడ్ రేంజ్‌లో ప్రభాస్ దుమ్ము రేపుతాడా?
Sleep: మనిషికి నిద్ర ఎలా ఉపయోగపడుతుంది? ఆరోగ్యంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
