Kesineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తాజాగా జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టీడీపీలో టికెట్ దక్కక వైసీపీలో చేరి విజయవాడ ఎంపీ టికెట్ సాధించిన కేశినేని నాని.. (Kesineni Nani) తన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. జాగ్రత్తగా ఆలోచించాకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రెండుసార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా విజయవాడ అభివృద్ధికి మద్దతు ఇస్తానన్నారు.
తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు కేశినేని నాని. విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్న కొత్త ప్రజాప్రతినిధులకు విషెస్ చెప్పారు.
కార్యకర్తలు, నమ్ముకున్న వాళ్ల పరిస్థితి ఏంటి?
కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆయన్ను నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానులు, వ్యాపారాల్లో ఉన్న వారు ఆందోళనలో పడ్డారు. ఇంతకాలం ఒక నాయకుడిని నమ్మి ప్రయాణం కొనసాగించామని, ఇప్పుడు ఆయన ఇలా చేయడం సబబు కాదంటున్నారు. రాజకీయంగా కేసులు, ఇబ్బందులు ఉంటాయని, కానీ వాటికి భయపడి లేదా వైరాగ్యంతో రాజకీయాలకే దూరం కావడం నాయకుడికి మంచిది కాదని చెబుతున్నారు.
ఓటమి కుంగదీసిందా?
మాజీ సీఎం జగన్ సైతం దారుణ ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కార్యకర్తలపై దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చిహ్నాలను ధ్వంసం చేయడంపై ఎక్స్ వేదికగా స్పందించారు. గవర్నర్‌కు వైసీపీ నాయకులు సైతం వినపతిపత్రం ఇచ్చారు. మరో వారం పది రోజుల్లో కేడర్‌ను ఉత్సాహపరుస్తూ ఆయన ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాంటిది కేశినేని నాని.. ఇలా ఒక్క ఓటమికే రాజకీయ వైరాగ్యం తెచ్చుకోవడం ఏంటన్నది ఇప్పుడు కార్యకర్తలు చెబుతున్న మాట. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, గెలిచినప్పుడు ఎంత బాధ్యత పెరుగుతుందో ఓడినప్పుడు కేడర్‌కు ధైర్యం చెప్పి ముందుండి ఉద్యమాలు, పోరాటాలు చేయడం నాయకుడి లక్షణమని చెబుతున్నారు. మరో ఐదు సంవత్సరాలు ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేసి మళ్లీ గెలిచి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి: TDP MP Candidates: టీడీపీ ఎంపీ అభ్యర్థులుగా వైసీపీ సిట్టింగ్ ఎంపీలు! తుది దశకు చేరిన కసరత్తు!
Modi Pawan Kalyan: జనసేనానిపై మోదీ పొగడ్తలు.. పవన్ కాదు.. తుఫాన్
Perni Nani: చంద్రబాబు చెప్పినట్లు పీవీ రమేష్ ఆడుతున్నాడు: పేర్ని నాని
Perni Nani: పదేళ్లయినా నా కోసం బతుకుదామనే ఆలోచనతో పోటీ చేయడం లేదు: పేర్ని నాని
