UPI lite: యూపీఐ లైట్ వాడుతున్న వారికి గుడ్ న్యూస్. చిన్న మొత్తాల్లో చేసే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లైట్‌లో (UPI lite) ఆటోమేటిక్‌గా డబ్బులు లోడ్ చేసుకునే విధానాన్ని ప్రపోజ్ చేసింది. ఈ విధానంలో చెల్లింపులు మరింత ఇన్‌క్రీజ్ అయ్యే చాన్స్ ఉంది. దీంతో పాటు ఫాస్టాగ్‌కు (Fastag) కూడా ఇదే పద్ధతిని ఆర్బీఐ రికమెండ్ చేసింది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)కు చెందిన సులభతరమైన వెర్షన్ ను యూపీఐ లైట్‌గా పిలుస్తారు. వ్యాలెట్‌లాగా ఇది వర్క్ చేస్తుంది. దీంతో చేసే చెల్లింపులకు పిన్ తో పని లేదు. ఇందులో గరిష్ఠంగా రూ.2000 వరకు డబ్బులు జమ చేసుకోవచ్చు. ఒకరోజులో రూ.2 వేలు మాత్రమే లావాదేవీలు చేయాలనే నిబంధన ఉంటుంది. ఒకసారి గరిష్ఠంగా రూ.500 మాత్రమే పేమెంట్ చేసుకోవచ్చు.
Read also: Gangs of Godavari: ఓటీటీ వేదికలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. స్ట్రీమింగ్ అప్పుడే
Modi 3.0 Cabinet: ఏపీ నుంచి కేంద్ర మంత్రి పదవులు ముగ్గురికి…
Modi 3.0 Cabinet: కేంద్ర మంత్రి పదవులు తెలంగాణలో ఎవరెవరికంటే..
Hyderabad: కక్కుర్తి పడ్డారో ఖతమైపోతరు.. హైదరాబాద్‌లో డేటింగ్ స్కామ్!
