HomeAndhra PradeshEC Alert: ఏపీలో పోలింగ్ తర్వాత హింసతో ఎన్నికల సంఘం అప్రమత్తం

EC Alert: ఏపీలో పోలింగ్ తర్వాత హింసతో ఎన్నికల సంఘం అప్రమత్తం

EC Alert: ఏపీలోని పలు జిల్లాల్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత రోజు నుంచి జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. కౌంటింగ్ కు ముందస్తుగా భద్రతాపరమైన ఏర్పాట్లు చేయడంలో ఈసీ అధికారులు నిమగ్నం అయ్యారు. పెట్రోల్ అమ్మకాలపై ఇప్పటినుంచే ఆంక్షలు విధిస్తున్నారు. జూన్ 10 వరకు లూజు పెట్రోల్ అమ్మకం నిలిపివేసింది ఈసీ.

డ్రమ్ములు, డబ్బాలు, సీసాల్లో పెట్రోల్ అమ్మకుండా ఆంక్షలు విధించింది. పోలింగ్ రోజు ఆ తర్వాత పలుచోట్ల పెట్రోల్ బాంబులతో దాడులు జరిగిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి లో పెట్రోల్ బాంబుల స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఘర్షణలను సీరియస్ గా తీసుకున్న ఈసీ.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిపిందే.

ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఇప్పటికే సిట్‌ అధికారులు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలోనే కేంద్ర పారామిలటరీ బలగాలు పహారా కాస్తున్నాయి. ఫలితాల రోజు ఏర్పాట్ల పై ఇప్పటి నుంచే ఈసీ, పోలీసులు ఫోకస్‌ పెట్టారు. అన్ని ప్రాంతాల్లో రౌడీ షీట్ ఉన్న వారి బైండోవర్ గొడవలతో ఇప్పటికే అజ్ఞాతంలోకి కొందరు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల కౌంటింగ్ కు నాలుగు రోజుల ముందు నుంచే 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఇప్పటికే అమలాపురంలో 144 సెక్షన్ విధించారు. విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా పేల్చడం పై నిషేధం విధించారు.

ఇవీ చదవండి: SAMARTH APP: క్విక్‌ పోలీసింగ్‌ కోసం సమర్థ్‌ మొబైల్ యాప్‌ తీసుకొచ్చిన ఈసీ
EC Serious: పేరులేని రాజకీయ హోర్డింగ్‌లపై ఈసీఐ కొరడా
ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
CEC: ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకూడదు: ఈసీ కీలక సూచనలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు