HomeAndhra PradeshLand Titling Act: 2019-24 మధ్య కాలంలో పేదలకు ఎంత భూమి పంపిణీ జరిగిందంటే..

Land Titling Act: 2019-24 మధ్య కాలంలో పేదలకు ఎంత భూమి పంపిణీ జరిగిందంటే..

Land Titling Act: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఎన్నికల సందర్భంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మీ భూములు లాగేసుకుంటుందంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయి. పెద్ద ఎత్తున పేపర్లలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు సైతం వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అసలు 2019-24 మధ్య కాలంలో జగన్ సర్కార్ పేదలకు ఎంత భూమి పంపిణీ చేసిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

2014 – 19 మధ్యలో చుక్కల భూములకి సంబంధించి ఒక చిన్న మెమో ద్వారా అన్ని డాటెడ్ భూములను ’22-ఏ’ రిజిస్టర్ లో పెట్టి, అవి ట్రాన్సాక్షన్ జరగకుండా, రైతులందరినీ ఇబ్బంది పెట్టారు. అలాగే షరతులు గల పట్టాలు, అనాదీన భూములు, విలేజ్ సర్విస్ ఈనాములు మొదలైనవి అన్నీ ఇబ్బడి ముబ్బడిగా 22-ఏ లో రిజిస్టర్ లో పెట్టి రైతులను పలు ఇబ్బందులకు గురిచేశారు. 22-ఏ పెట్టడానికి వీలు కాని భూములపై చిన్న చిన్న కంప్లైంట్స్ ఇప్పించి, వాటిని Dispute Register లో పెట్టి, రైతులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగేలా చేశారు.

అలాగే CRDA పరిధిలో అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళని బెదిరించి, ఆ భూములు లాక్కుని, తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని, మళ్ళీ ఆ భూములు హక్కుదారులైన అసైనీకి చెందకుండా, అవి చట్ట విరుద్ధంగా కొనుగోలు చేసిన వారికి చెందేట్లుగా, గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ తీసుకున్నారు. దానిమీద సిఐడి కేసు నడుస్తోంది. అలాగే రివర్ పోరంబోకు ల్యాండ్స్ ని కూడా కబ్జా చేసి, రికార్డులు మార్చే దుశ్చర్యకు పాల్పడ్డారు.

2019 – 24 కాలంలో
తర్వాత 2019 లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములను 22-ఏ నుంచి తీసివేయడం జరిగింది
 1,07,134 మంది రైతులకు సంబంధించిన 2,06,315 ఎకరాలు చుక్కలు భూములు
 అలాగే 1,65,584 మంది రైతు లకు సంబంధించి 1,58,113 ఎకరాలు విలేజ్ సర్వీస్ ఈనాము భూములు
 22,346 SC రైతులకు సంబంధించిన SC కార్పొరేషన్ భూములు 22,837 ఎకరాలు
 22042 మంది రైతులకు సంబంధించిన షరతులు గల పట్టా భూములు 33,394 ఎకరాలు
 దీనితో పాటు గా కొత్తగా 42,307 అర్హులైన భూమి లేని నిరుపేదలకు 46,463 ఎకరాలు పట్టాలు ఇవ్వడం జరిగింది.
 అలాగే 1,56,655 గిరిజన రైతు లకు 3,27,482 ఎకరాలు RoFR, మరియు DKT పట్టాలు ఇవ్వడం జరిగింది.
 అలాగే 9,064 ఎకరాల లంక భూములను 17,768 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది.

తరువాత అసైన్డ్ భూములకు సంబంధించి అన్యాక్రాంతం కాని 20 సంవత్సరాలకు పైబడిన అసైన్మెంట్ కు సంబంధించిన రైతులకు ఫ్రీ హోల్డ్ రైట్స్ ఈ ప్రభుత్వం ఇచ్చింది. మొత్తంగా జగన్ ప్రభుత్వంలో 20,24,709 మంది రైతులకు 35,44,866 ఎకరాల భూమికి సంబంధించిన సర్వహక్కులు కల్పించింది. జగన్ ప్రభుత్వం ప్రజలకు సర్వహక్కులు కలిపిందే గానీ, గత ప్రభుత్వం మాదిరిగా రికార్డుల్లో భూములను 22-ఏ లో పెట్టడం, లేదా Assigned భూములను ఆక్రమించుకోవడం లేదా రైతులను ఇబ్బందులకు గురిచేయడం లేదా పేదల ఆస్తులను లాక్కోవడం చేయలేదు.

రీసర్వే
ఇప్పటివరకు 6000 గ్రామాలలో రీ సర్వే పూర్తి అయితే 79.64 లక్షల ఎకరాలు సర్వే పూర్తి అయింది.
 కొత్తగా 10.52 లక్షల మ్యూటేషన్లు,
 15.76 లక్షల కొత్త సబ్ డివిజన్ లు ,
 83 వేల బౌండరీ వివాదాల పరిస్కరించడం,
 74.64 లక్షలు సర్వే రాళ్ళు ఏర్పాటు ఈ రీసర్వే కార్యక్రమం లో ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది.
 ఇప్పటివరకు 20.13 లక్షల భూహక్కు పత్రాలు రైతులకు ఇవ్వడం జరిగింది.
 15,000 సెక్రటేరియట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది అమలు చేస్తూ 31 లక్షల House Sites, DKT Patta లకు Conveyance Deed రిజిస్ట్రేషన్ చేసి 17 లక్షల పైగా రిజిస్ట్రేషన్ డీడ్ లు ఇవ్వడం జరిగింది.

read also: PM Modi in Anakapalli: ఏపీలో ల్యాండ్‌, శాండ్‌ మాఫియా నడుస్తోంది: అనకాపల్లిలో ప్రధాని మోదీ
CM Jagan on Land Titling Act: ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రతిపక్షాల దుష్ప్రచారం.. సీఎం జగన్‌ వివరణ ఇదీ!
AP Cabinet Meeting: అసైన్‌మెంట్ ల్యాండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీ కేబినెట్‌లో నిర్ణయాలు..
YS Jagan in Pithapuram: పిఠాపురంలో సీఎం జగన్ మాస్‌ స్పీచ్.. ఇక్కడ చదవండి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు