Double ISMART: డేరింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దానికి కంటిన్యూ చేస్తూ డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని పూరీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో రామ్ పోతినేని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ మూవీలో మాస్ డైలాగులు, మేనరిజంతో హీరో రామ్ మెప్పించారు. ఇప్పుడు రెండో పార్ట్‌లోనూ అంతకు మించిన మాస్ మసాలా ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెప్పారు.
పూరి జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్‌లో రామ్ (Ram pothineni) కథానాయకుడిగా తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) సినిమాకు సంబంధించిన టీజర్ ఈరోజు విడుదల చేశారు. మాస్ గెటప్‌లో హీరో రామ్ డైలాగులు అదిరిపోయాయి. విల్ పాత్రలో సంజయ్ దత్ నటించడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. సంజయ్ దత్ సైతం కాస్త పవర్‌ఫుల్‌గానే కనిపించడం విశేషం. టీజర్ ఆధారంగా చూస్తే ‘ఈ సారి వినోదం, డబుల్ యాక్షన్ గ్యారెంటీ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ మాస్ టీజర్ ఇక్కడ చూసేయండి మరి.
ఇవీ చదవండి: Mannara Chopra: వర్షంలో డ్యాన్స్.. మన్నారా చోప్రాపై దారుణమైన ట్రోలింగ్
Rashi Singh: రాశి సింగ్ హాట్ ఫొటో గ్యాలరీ.. భూతద్దం భాస్కర్ నారాయణ బ్యూటీ కలర్‌ఫుల్ పిక్స్!!
Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్ షో.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వైరల్
Tamannaah Latest: తమన్నా భాటియా లేటెస్ట్ హాట్ ఫొటో షూట్
Palak Tiwari: పాలరాతి శిల్పం.. పాలక్ తివారి ఫొటో గ్యాలరీ..
