HomeAndhra PradeshChittoor Law News: చిత్తూరులో ప్రధాన న్యాయస్థాన నూతన భవనాల ప్రారంభం

Chittoor Law News: చిత్తూరులో ప్రధాన న్యాయస్థాన నూతన భవనాల ప్రారంభం

Chittoor Law News: చిత్తూరు జిల్లా కేంద్రంలో ప్రధాన న్యాయస్థాన నూతన భవనాల సముదాయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి న్యాయస్థానం ప్రాంగణానికి వచ్చిన సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు, హైకోర్ట్ చీఫ్ జస్టిస్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ, చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిలకు జిల్లా జడ్జి ఈ.భీమారావ్, జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్, ఎస్పీ మణికంఠ చందోలు స్వాగతం పలికారు.

అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, నూతన భవనమునకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం రెండవ అంతస్తు లో జిల్లా కోర్టును సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు మరియు హైకోర్ట్ చీఫ్ జస్టిస్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జిలు పరిశీలించారు. అనంతరం కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రారంభోత్సవ కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సభ్యులు, న్యాయవాదులు అధికారులు పాల్గొన్నారు..

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టి, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ రావు రఘునందన్ రావ్ పాల్గొన్నారు.

ఇవీ చదవండి: Juvenile Justice Act: బాలల న్యాయ చట్టం పరిధిలోనే బాలల హక్కుల కమిషన్ పనిచేస్తుంది
AP BJP News: ఏపీ బీజేపీలో టీడీపీ ముద్ర.. కేండేట్ల ఎంపికలో అన్యాయంపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదుల వెల్లువ!
YSRCP Candidates Final List: సామాజిక న్యాయం చేతల్లో చేసి చూపించాం: ముఖ్యమంత్రి జగన్
Law University Kurnool: నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన.. న్యాయ రాజధానికి మరో మకుటం!
Judiciary Andhra Pradesh: ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్ ఆవిష్కరణ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు