Andhra Pradesh Elections: ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈనెల 26న జరిగిన నామినేషన్ల పరిశీలనలో 25 పీసీలకు 503 నామినేషన్లు, 175 ఏసీలకు 2,705 నామినేషన్లను ఆమోదించడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.
పీసీలకు చెందిన 183 నామినేషన్లు, ఏసీలకు చెందిన 939 నామినేషన్లను పరిశీలన అనంతరం తిరస్కరించామన్నారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 25 పీసీలకు సంబంధించి మొత్తం 686 నామినేషన్లు, 175 ఏసీలకు సంబంధించి మొత్తము 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు వెల్లడించారు.
పీసీలకు సంబంధించి అత్యధిక మొత్తంలో గుంటూరు పీసీకి 47 నామినేషన్లు, అత్యల్పంగా 16 నామినేషన్లు శ్రీకాకుళం పీసీ కి దాఖలు అయ్యాయని తెలిపారు. నామినేషన్ల ఆమోదం విషయంలో అత్యధికంగా 36 నామినేషన్లు నంద్యాల పిసికి, అత్యల్పంగా 12 నామినేషన్లు రాజమండ్రి పిసికి ఆమోదించామన్నారు.
అదేవిధంగా ఏసీలకు సంబంధించి అత్యధిక మొత్తంలో తిరుపతి ఏసీ కి 52 నామినేషన్లు, అత్యల్పంగా 8 నామినేషన్లు చోడవరం ఏసీ కి దాఖలు అయ్యాయని తెలిపారు. నామినేషన్ల ఆమోదం విషయంలో అత్యధికంగా 48 నామినేషన్లు తిరుపతి ఏసీ కి, అత్యల్పంగా 6 నామినేషన్లు చోడవరం ఏసీ కి ఆమోదించబడ్డాయన్నారు.
ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని, నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు మినహా మిగిలిన వారు మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పరిగణించబడతారని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: SAMARTH APP: క్విక్ పోలీసింగ్ కోసం సమర్థ్ మొబైల్ యాప్ తీసుకొచ్చిన ఈసీ
YS Jagan Assets: ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం జగన్ ఆస్తుల వివరాలు
EC Serious: పేరులేని రాజకీయ హోర్డింగ్‌లపై ఈసీఐ కొరడా
ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
CEC: ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకూడదు: ఈసీ కీలక సూచనలు
CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ
Andhra Pradesh Elections: స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ.. అధికారులు ఓర్పుతో వ్యవహరించాలి
