YS Jagan Assets: ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం జగన్, ఆయన భార్య భారతిరెడ్డి, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించారు. సీఎం జగన్ దగ్గర చేతిలో ఉన్న నగదు రూ.7 వేలుగా పేర్కొన్నారు. భార్య వైఎస్ భారతిరెడ్డి చేతిలో ఉన్న నగదు రూ.10 వేలుగా పేర్కొన్నారు. సీఎం జగన్ దగ్గర మూవబుల్ అసెట్స్ రూ.483.08 కోట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. భార్య భారతిరెడ్డి దగ్గర మూవబుల్ అసెట్స్ రూ.119.38 కోట్లు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సీఎం జగన్ స్థిరాస్తుల విలువ రూ.35.90 కోట్లు అని, భార్య వైఎస్ భారతిరెడ్డి స్థిరాస్తుల విలువ రూ.31.11 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
2019లో జగన్ ఆస్తుల విలువ రూ.375.20 కోట్లుగా పేర్కొన్నారు. 2024లో జగన్ ఒక్కడి ఆస్తి విలువ రూ.529 కోట్లుగా పేర్కొన్నారు. ఐదేళ్లలో రూ.247.27 కోట్లు ఆస్తులు పెరిగినట్లు అఫిడవిట్‌లో సమర్పించిన ఆస్తుల ప్రకారం తెలుస్తోంది. జగన్ కు రూ.263,64,92,685 విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జగన్ పేరుతో ఇడుపులపాయలో 39.52 ఎకరాల భూమి ఉంది. భార్య భారతికి 176 కోట్ల ఆస్తి ఉంది. ఐదేళ్లలో భారతిరెడ్డికి అరకిలో బంగారు, వజ్రాభరణాలు పెరిగాయి. రూ.75 లక్షల విలువైన సావరిన్ గోల్డ్ బాండ్లు ఉన్నాయి.
రిలయన్స్, జియో ఫైనాన్స్ లో భారతిరెడ్డి పెట్టుబడులు పెట్టినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. భారతిరెడ్డి పేరుతోనే తాడేపల్లిలో ఇల్లు ఉంది. జగన్ కుమార్తెలు హర్షిణిరెడ్డికి రూ.1,31,75,471, వర్షారెడ్డికి రూ.1,54,78,466 విలువైన విదేశీ ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సీఎం జగన్‌పై మొత్తం 26 కేసులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటిలో 11 సీబీఐ కేసులు, ఈడీ కేసులు 9 ఉన్నాయి. జగన్ పేరిట బంగారం ఏమీ లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సొంత కారు లేదని జగన్ కుటుంబం అఫిడవిట్‌లో పేర్కొంది. రాజమండ్రిలో జగన్ అఫిడవిట్ తయారైనట్లు తెలుస్తోంది.
పులివెందులలో సీఎం వైఎస్ జగన్ తరపున ఒక సెట్ నామినేషన్
పులివెందులలో సీఎం జగన్ తరఫున నిన్న ఒక సెట్ నామినేషన్ దాఖలైంది. సీఎం జగన్ తరపున నామినేషన్ ను వైఎస్ మనోహర్ రెడ్డి వేశారు. సీఎం జగన్ తరపున ఒక సెట్ నామినేషన్ వేశామని, 25న సీఎం వైఎస్ జగన్ నామినేషన్ వేస్తారని వైఎస్ మనోహర్‌రెడ్డి తెలిపారు. మళ్లీ జగనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ ఆయన వెల్లడించారు.
మేనిఫెస్టోకు తుదిమెరుగులు
మేనిఫెస్టోకు వైయస్సార్ సీపీ తుది మెరుగులు దిద్దుతోంది. సీఎం జగన్ సమక్షంలో మేనిఫెస్టోపై కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. విశాఖలో ముఖ్యనేతలతో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల అవసరాలు తీర్చేలా మేనిఫెస్టో రూపకల్పన ఉంటుందని తెలుస్తోంది. నేడు విజయనగరంలో బస్సు యాత్ర, రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు సీఎం జగన్. ఇప్పటివరకు 21 జిల్లాలో 67 నియోజకవర్గాలు కవర్ చేస్తూ బస్సుయాత్ర సాగింది. ఈనెల 25న పులివెందులలో నామినేషన్ ను సీఎం జగన్ వేయనున్నారు. ఈనెల 26న మేనిఫెస్టో విడుదలకు జగన్ సిద్ధమవుతున్నారు. తర్వాత ప్రతిరోజు రెండు లేదా మూడు నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: Pemmasani: పెమ్మసాని.. చాలా పెద్ద ఆసామి! ఆస్తుల్లో దేశంలోనే ధనిక ఎంపీ అభ్యర్థి!
TDP MP Candidates: టీడీపీ ఎంపీ అభ్యర్థులుగా వైసీపీ సిట్టింగ్ ఎంపీలు! తుది దశకు చేరిన కసరత్తు!
Memantha Siddham: మూడు వారాలుగా జనం మధ్యలోనే జగన్.. పండుగలు కూడా బస్సు యాత్రలోనే!
