Priyamani: స్టార్ హీరోయిన్ ప్రియమణితో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ వెరైటీగా ప్రవర్తించారు. అది ఎక్కడ జరిగిందో వివరాల్లోకి వెళ్తే.. అజయ్ దేవగణ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మైదాన్. ఉగాది పండుగ కానుకగా ఈనెల 10వ తేదీన అంటే ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. మూవీ మొదటి రోజే రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా మైదాన్ మైవీని తీశారు.
ఈ మూవీని చూసేందుకు మైదాన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బోనీ కపూర్ థియేటర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంలో కథానాయిక ప్రియమణితో కలిసి ఫొటోలు దిగారు. కానీ, బోనీ కపూర్ ఇక్కడ ప్రవర్తించిన తీరు చర్చనీయాంశమైంది. ప్రియమణి నడుముపై చేతులు వేయడంతో ఊరుకోక.. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు బోనీ కపూర్. దీంతో ప్రియమణి కాస్త ఇబ్బందికరంగా ఫీలయ్యింది.
ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. 68 ఏళ్ల వయసులో ఉన్న బోనీ కపూర్.. ఇలా ఓ సీనియర్ హీరోయిన్ పట్ల అసభ్యంగా వ్యవహరించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.
దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. “ప్రియమణి లాంటి సీనియర్ హీరోయిన్‌తో బోనీ కపూర్ అసహ్యంగా ప్రవర్తించడం బాగాలేదు. ఇక రాబోయే నటీమణులతో బోనీ ఎలా ప్రవర్తిస్తాడో నేను ఊహించలేకపోతున్న” అంటూ సోషల్‌మీడియా పోస్టులో రాశారు. మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ..’ మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని గుర్తుంచుకోండి. ఇలా ప్రవర్తించడం అవమానకరం అంటూ పోస్టులో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: RC16: రామ్ చరణ్‌కు జంటగా జాన్వీ కపూర్.. అఫిషియల్ అనౌన్స్‌మెంట్!!
అదృష్టం అంటే శనయా కపూర్‌దే
Janhvi Kapoor Bawaal: అమెజాన్ ప్రైమ్‌లో జూలై 21న బవాల్ రిలీజ్.. జాన్వీ కపూర్‌కు హిట్ దక్కేనా?
