HomeNationalECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..

ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..

ECI: 2024 సార్వత్రిక ఎన్నికలకు దేశం సన్నద్ధమవుతుండగా, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోషల్ మీడియా వేదికల్లో ‘టర్నింగ్ 18’, ‘యు ఆర్ ది వన్’ వంటి ప్రత్యేకమైన ప్రచారాల ద్వారా పౌరులను నిమగ్నం చేయడానికి ఒక వినూత్న ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి ప్రధాన సామాజిక మాధ్యమాల్లో ఉనికిని కలిగి ఉంది. ఇటీవల పబ్లిక్ యాప్, వాట్సాప్ ఛానల్ మరియు లింక్డ్ఇన్లలోనూ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.

పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవడానికి పట్టణ ఉదాసీనత, యువత ఉదాసీనతలు ప్రధాన కారణాలుగా కమిషన్ వివిధ సందర్భాల్లో గుర్తించింది. 18వ లోక్ సభ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ‘టర్నింగ్ 18’ అనే ప్రచార కార్యక్రమం ప్రత్యేకంగా యువ మరియు తొలిసారి ఓటింగ్ లో పాల్గొననున్న వారిని లక్ష్యంగా చేసుకుంటుంది. రాబోయే ఎన్నికలలో పాల్గొనడానికి యువతను ప్రేరేపించడం మరియు గత ఎన్నికలలో గుర్తించిన పట్టణ మరియు యువత ఉదాసీనత యొక్క క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం దీని ప్రాథమిక లక్ష్యం.

‘టర్నింగ్ 18’ ప్రచారం ద్వారా యువత దృష్టిని ఆకర్షించడానికి వివిధ ఇతివృత్తాలు మరియు వ్యూహాలను ఉపయోగిస్తుంది. యువతకు సులభంగా దగ్గరవుతూ వారి మనసులో నిలిచిపోయేలా కంటెంట్ ఉండనుంది. అదనంగా స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నికల నిర్వహణలో సాధించిన పురోగతిని నొక్కిచెప్పడానికి ఈ ప్రచారం గత మరియు ఇటీవలి ఎన్నికలను ‘అప్పుడు వర్సెస్ ఇప్పుడు’ గా పోల్చి చూపుతుంది. 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటు వేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ద్వారా ఈ ప్రచారం యువ ఓటర్లలో పౌరుల బాధ్యత అనే భావాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా, ఇన్ఫోగ్రాఫిక్స్, మహిళా ఓటర్ల పెరుగుతున్న భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా 18-30 సంవత్సరాల వయస్సులో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య ప్రక్రియ యొక్క సమగ్రతను ప్రదర్శిస్తుంది.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు (సిఇఒలు), జాతీయ పబ్లిక్ బ్రాడ్ కాస్టర్లు అయిన డిడి న్యూస్ మరియు ఆకాశవాణిలు అందించిన ప్రచారంతో ‘టర్నింగ్ 18’ ప్రభావవంతంగా మారింది. దానికి తోడు ఇసిఐ తన ప్రముఖ జాతీయ మరియు రాష్ట్ర స్వీప్ ఐకాన్ల నెట్వర్క్ తో అనిసంధానించడం వల్ల ఈ ప్రచారం ప్రభావం రెట్టింపయింది. ఈ సమిష్టి ప్రయత్నం సమాజంలోని విభిన్న విభాగాలలో ప్రచారం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, దాని లక్ష్య ప్రేక్షకులను సమర్థవంతంగా చేరుకోవడానికి మరియు రాబోయే ఎన్నికలకు గణనీయమైన వేగాన్ని అందుకోడానికి సహాయపడుతుంది.

‘టర్నింగ్ 18’ ప్రచారం ఆధారంగా, ఇసిఐ ‘యు ఆర్ ది వన్’ పేరుతో మరో ప్రభావవంతమైన ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న వివిధ వాటాదారుల అమూల్యమైన సహకారాన్ని గుర్తించడం, ఒక వేడుకలా జరుపుకోవడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఓటర్లు మరియు రాజకీయ పార్టీల నుండి బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓలు), గ్రౌండ్ స్టాఫ్, పోలింగ్ పార్టీలు, పరిపాలనా సిబ్బంది, మీడియా నిపుణులు, కేంద్ర దళాలు మరియు భద్రతా సిబ్బంది వరకూ ఎన్నికల ప్రక్రియ యొక్క సమగ్రత మరియు సామర్థ్యాన్ని నిర్ధారించడంలో ప్రతి వాటాదారు కీలక పాత్ర పోషిస్తారు.

ఆకర్షణీయమైన కథనాలు, దృశ్యాల ద్వారా (ఉదాహరణకు ‘ఏదేమైనా సరే.. మీరు నడవాల్సిన అదనపు మైలు మీకోసం మేమే నడుస్తాం’) వ్యక్తుల అంకితభావం మరియు నిబద్ధతను ఈ ప్రచారం హైలైట్ చేస్తుంది, ప్రజాస్వామ్య చట్రంలో వారి పాత్రలు మరియు బాధ్యతలను చూసి గర్వపడేలా చేస్తుంది. ఎన్నికలలో కీలక వాటాదారులు, ఆసక్తికరమైన వృత్తాంతాలు మరియు గత ఎన్నికల కథలను హైలైట్ చేయడం మరియు తెరవెనుక పనిచేస్తున్న పోలింగ్ బృందాల అవిశ్రాంత కృషిని తెలిపే వీడియోలు/రీల్స్, ప్రతి ఓటరును చేరుకునేలా సవాలు చేసే భూభాగాలను నావిగేట్ చేయడం వంటివి అనేకం ఈ కార్యక్రమంలో ఉంటాయి.

ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన ఎన్నికల కథలు, పదబంధాలు, ఎన్నికల నిఘంటువుతో ఓటర్లను నిమగ్నం చేయడం, మునుపటి ఎన్నికల నుండి ఆసక్తికరమైన ఎన్నికల కథలను పంచుకునే ‘చునావి కిస్ సే’ వంటి ప్రచారంలో అనేక ఇతర ఆసక్తికరమైన అంశాలున్నాయి. భారత దేశ ఎన్నికలు A టు Z అనే సిరీస్ ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు, ప్రక్రియ గురించి అవగాహన కల్పిస్తుంది. ఈసీఐతో వర్డ్ ప్లే అనేది ఎన్నికల సంబంధిత నిబంధనల టెర్మినాలజీ గురించి వెదుకుతూ సాగే ఆటవిడుపు సిరీస్. ‘సవాల్- జవాబ్’ అనే సిరీస్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఆకర్షణీయమైన పోల్స్ మరియు పిక్సెల్స్ సిరీస్ ద్వారా ఇసిఐ ప్రారంభం నుండి భారత ఎన్నికల దృశ్య ప్రయాణాన్ని పంచుకుంటుంది.

సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కోసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఇసి శ్రీ రాజీవ్ కుమార్ హైలైట్ చేసిన విధంగా ఆన్లైన్లో నకిలీ వార్తలు మరియు తప్పుడు సమాచారం వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇసిఐ ‘వెరిఫై బిఫోర్ యు యాంప్లిఫై’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా నకిలీ వార్తలను ఛేదించి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సమాచారాన్ని పంచుకునే ముందు జాగ్రత్త, శ్రద్ధ వహించాలని వ్యక్తులను కోరింది.

ఈ చురుకైన చర్య కంటెంట్ యొక్క ఖచ్చితత్వం మరియు ప్రామాణికతను విస్తరించే ముందు ధృవీకరించుకోడానికి పౌరులకు అధికారం ఇవ్వడం ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తిని తగ్గించి ఎన్నికల ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడటంలో తోడ్పాటు అందిస్తుంది. అదనంగా ఎన్నికల షెడ్యూల్, ఈసీఐ అందుబాటులోకి తెచ్చిన యాప్ లు మరియు కమిషన్ నిర్ణయాలు, ఎన్నికల జాబితాలో పేరును ఎలా తనిఖీ చేయాలి మరియు పోలింగ్ స్టేషన్లను ఎలా కనుగొనాలి మొదలైన వాటితో సహా ఇతర క్లిష్టమైన అంశాలపై సమాచారాన్ని వినియోగదారుల కోసం కచ్చితమైన, క్రమపద్ధతిలో గ్రాఫికల్ గా, రీల్స్ ద్వారా పంచుకుంటోంది.

ఇవీ చదవండి: CEC: ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయకూడదు: ఈసీ కీలక సూచనలు
CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ
AP DCS Exam: ఏపీలో డీఎస్సీ పరీక్ష వాయిదా? రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఏమన్నారంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు