HomeAndhra PradeshAndhra Pradesh Elections: స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ.. అధికారులు ఓర్పుతో వ్యవహరించాలి

Andhra Pradesh Elections: స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణ.. అధికారులు ఓర్పుతో వ్యవహరించాలి

Andhra Pradesh Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్దంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. వీరిరువురూ సమన్వము, ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలపై సమగ్ర అవగాహనలతో తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు.

వచ్చే ఎన్నికల్లో ఎటు వంటి హింసకు, రీపోలింగ్కు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. గంజాయి, లిక్కర్, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలని, రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్ట్ లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.

గోవా, హర్యానా నుండి అక్రమంగా లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తులు రూ.50 వేలకు మించి నగదు కలిగి ఉంటే వెంటనే జప్తుచేయాలని, వ్యాపారులు, సాదారణ పౌరుల విషయంలో ఆచితూచి అడుగువేయాలని, వారిని ఎటు వంటి ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోనే పరిష్కరించాలని, ఇందుకై రాష్ట్ర మంతా ఒకే విదానాన్ని అనుసరించేలా త్వరలో ఎస్.ఓ.పి.ని (Standard Operating Procedure) రూపొందించి కమ్యునికేట్ చేయనున్నట్లు తెలిపారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికై ముందస్తుగా పొందాల్సిన అనుమతి విషయంలో తగిన వివరణకై భారత ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపడమైనదని, అయితే ఈ అంశంలో తగిన వివరణ అందేలోపు ఇంటింటి ప్రచారానికి సంబందించి ముందస్తు సమాచారాన్ని సంబందిత ఆర్.ఓ.కు మరియు సంబందిత పోలీస్ స్టేషన్ కు ఇస్తే చాలు అనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలకు తెలియజేయాలని సూచించారు.

భారత ఎన్నికల సంఘం రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకును నియమించిందని, వీరే ఎన్నికల సంఘానిక కళ్లు, చెవులు వంటి వారని, వీరు నేరుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో పనిచేస్తుంటారన్నారు. ప్రత్యేక సాధారణ పరిశీలకులు, ప్రత్యేక వ్యయ పరిశీలకు ఇప్పటికే రాష్ట్రావని వచ్చి పలు ప్రాంతాల్లో పర్యటించారన్నారు. రాష్ట్రంలో చేస్తున్న ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో వీరు సంతృప్తి చెందేలా చూసుకోవాలన్నారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని, తమ కార్యాలయం నుండి పంపించే ఫిర్యాదులపై జిల్లా స్థాయిలోనే సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకున్న తదుపరి మాత్రమే నివేదిక పంపాలని ఆదేశించారు. తదుపరి చర్యల కోసం తగు ఆదేశాలు జారీ చేయాలని తమ కార్యాలయం నివేదిక పంపొద్దు అని స్పష్టంగా సూచించారు.

వీడియో కాన్పరెన్సు ముగింపు సందర్బంగా రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి మరియు అదనపు డిజిపి (లా & ఆర్డర్) శంక్బ్రత్ బాగ్చీ మాట్లాడుతూ ప్రత్యేక సాధారణ పరిశీలకులు రామ్ మోహన్ మిశ్రా రాష్ట్ర పర్యటన సందర్బంగా చేసిన పలు సూచలను డి.ఇ.ఓ.లకు, ఎస్పీలకు వివరించారు. రూ.10 లక్షలకు పైబడి జప్తుచేయబడిన నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువుల సమచారాన్ని ఎప్పటి కప్పుడు ఐ.టి. అధికారులకు తెలియపర్చాలన్నారు. ఎన్ఫోర్సుమెంట్ ఎజన్సీల నోడల్ అధికారులతో తరచుగా సమావేశమై గంజాయి, లిక్కర్, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై నిఘాను పటిష్టపర్చాలన్నారు. లిక్కర్, డ్రగ్స్ రవాణా చేసే కింగ్ పిన్లపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్ట్ ల్లో కూడా నిఘాను మరింత పటిష్టపర్చాలని ఆదేశించారు.

అదనపు సీఇఓ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏఆర్వోలు అదనంగా కావాల్సిన వారు సంబందిత జాబితాలను మూడు రోజుల్లో సి.ఇ.ఓ. కార్యాలయానికి పంపిస్తే, వాటిని కన్సాలిడేట్ చేసి ఇ.సి.ఆమోదం కోసం పంపిస్తామన్నారు.

అదనపు సీఇఓ ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్ మాట్లాడుతూ సోషల్ మీడియా కంప్లైంట్స్ పై తగు చర్యలు తీసుకునేందుకు ఇప్పటికీ ఎస్.ఓ.పి.ని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు కమ్యునికేట్ చేయడం జరిగిందని మరియు మీడియాకు అథారిటీ లెటర్స్ జారీకై సమగ్ర సమాచారాన్ని కూడా అందజేయడం జరిగిందని, వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరారు.

ఇవీ చదవండి: Vote: ఓటు వేసేందుకు ఆధార్‌ తప్పనిసరి కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత
ECI: ఓటర్లకు అవగాహన పెంచేలా ఈసీఐ ప్రత్యేక చర్యలు ఇవీ..
CEC Press Meet: జూన్ 16తో ముగియనున్న లోక్‌సభ గడువు.. ఈలోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఈసీ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు