HomeAndhra PradeshBotcha: పీకే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు: మంత్రి బొత్స

Botcha: పీకే ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు: మంత్రి బొత్స

Botcha: ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థంకావడం లేదని ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇటీవల పీకే కీలక కామెంట్స్ చేసిన సంగత తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని, కూటమి గెలుస్తుందంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో వైయస్సార్ సీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి బొత్స ఇవాళ విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు.

విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామన్న మంత్రి బొత్స.. గత ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థను పట్టించుకోలేదన్నారు. బొత్స ఇంకా ఏమన్నారంటే..

’’సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలతోనే విప్లవాత్మక మార్పులు. పీకే ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. లీడర్ కు, ప్రొవైడర్ కు కూడా పీకేకు తేడా తెలీదు. సీఎం జగన్ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కోసం మాట్లాడుతున్నారు. ప్యాకేజీ తీసుకుని పీకే మాట్లాడుతున్నారు.

పీకే ఏం మాట్లాడితే అది మొదటి పేజీలో వేసి ఆనందపడుతున్నారు. సీఎం జగన్ అంటే ప్రజలకు ఒక ధైర్యం. లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్. చంద్రబాబు పాలన పై పీకే ఎందుకు మాట్లాడడం లేదు. ఐపీఎస్‌ల పై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏ ఉద్ధేశంతో ఐపీఎస్‌ల పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఐపీఎస్‌లకు రాజకీయాలు అంటగట్టడం సరికాదు. ఎవరి ప్రయోజనాల కోసం ఐపీఎస్‌ల పై ఫిర్యాదు చేశారు?

ప్రశాంత్ కిషోర్ నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. పీకే ప్యాకేజీ తీసుకుని కామెంట్స్ చేస్తున్నారు. వాలంటీర్లపై టీడీపీకి ఎందుకంత కక్ష? ఎవరి ప్రయోజనాల కోసం ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఫిర్యాదు చేశారు? ఐపీఎస్‌ల పై రాజకీయాలు అంటగట్టడం సరికాదు’’ అని బొత్స కామెంట్స్ చేశారు.

ఇవీ చదవండి: AP DSC New Schedule: ఏపీ డీఎస్సీ 2024 షెడ్యూల్‌లో మార్పులు.. మార్చి 20వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లు
Minister meeting on Employees: సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల బృందం భేటీ
Sajjala on CBN: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు : సజ్జల రామకృష్ణారెడ్డి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు