HomeLife StyleParenting: తల్లిదండ్రులూ మీ పిల్లలతో జాగ్రత్త.. ప్రతి విషయాన్నీ గమనిస్తారు!

Parenting: తల్లిదండ్రులూ మీ పిల్లలతో జాగ్రత్త.. ప్రతి విషయాన్నీ గమనిస్తారు!

Parenting: పిల్లల పెంపకం అన్నది అతిపెద్ద టాస్క్. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలను జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. వారి ముందు తల్లిదండ్రులు కాస్త డీసెంట్‌గా బిహేవ్‌ చేయాల్సిఉంటుంది. తల్లిదండ్రులు ప్రవర్తించే తీరును, వారు చేసే ప్రతి విషయాన్ని పిల్లలు నిశితంగా గమనిస్తూ ఉంటారు.

తల్లిదండ్రులకు ఉన్న కొన్ని అలవాట్లు పిల్లలను చాలా ప్రభావితం చేస్తాయి. ఇవి మీ పిల్లలను ఒంటరి చేసేలా చేస్తాయి. తల్లిదండ్రులంటే భయంపుట్టేలా చేస్తాయని గుర్తించాలి. అందుకే పిల్లల ముందు తల్లిదండ్రులు పద్ధతిగా ఉండాలి. లేని పక్షంలో పిల్లల జీవితాలను నాశనం చేసిన వారు అవుతారు.

పిల్లల విషయంలో ప్రస్తుత కాలం తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటుండటం చూస్తున్నాం. తమ పిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారని భావిస్తారు. వేరే పిల్లల కంటే మా పిల్లలే అన్నింట్లో ముందుండాలని తపన పడుతారు. కానీ దీని కోసం తల్లిదండ్రులు తమకు తెలియకుండానే పిల్లలను బాధపెట్టేలా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పనులు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఎలాంటి అలవాట్లు ఉంటే పిల్లలు ప్రభావితం అవుతారన్నది ప్రతి పేరెంట్ తెలుసుకోవాలి.

బెదిరించ కూడదు
తప్పు చేసినప్పుడు లేదా చదువులో వెనకబాటుకు గురైన సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లలపై హార్స్ గా బిహేవ్‌ చేస్తుంటారు. ఎలా పడితే అలా తిట్టేస్తుంటారు. కానీ ఈ బెదిరింపులు పిల్లలను తీవ్రంగా భయపెడతాయి. ఇది చిన్న పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుందో ఊహించలేం. తల్లిదండ్రులు తరచుగా పిల్లల్ని బెదిరిస్తే వాళ్లు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారని అనేక అధ్యయనాల్లో సైతం వెల్లడైంది.

గేలి చేయకూడదు
వేరేవారి పిల్లలు తమ పిల్లలకంటే బాగా చదివినిప్పుడు, మంచిగా ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులు వాళ్లముందే తమ పిల్లలను ఎగతాళి చేయడం గమనిస్తుంటాం. వాళ్లను చూసి నేర్చుకో అని తిడుతుంటారు. కానీ ఇది మీ పిల్లలను చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు ఏం ఆలోచించకుండా పిల్లలను ఆటపట్టిస్తుంటారు. కానీ ఇది వారి మనసులో అలాగే ఉండిపోతుందని గుర్తించాలి. మీ పిల్లల ఎదుగుదలకు ఇలాంటి పరిస్థితులు అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు.

వారు ఏం చెబుతున్నారో వినాలి
పలువురు తల్లిదండ్రులు తాము చెప్పిందే పిల్లలు వినాలనుకుంటారు. కానీ పిల్లలు ఏం చెబుతున్నారో పట్టించుకోరు. కొంతమంది ఏదో విన్నామా అనిపిస్తే.. మరికొంతమంది మాత్రం అసలు పిల్లలను మాట్లాడనివ్వరు. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసన్ని దెబ్బతీస్తుందట. మీ పిల్లలు ఎలా ఉన్నారనేది పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది. అసలు చాలా మంది పిల్లలకు ఏం కావాలో విడిచిపెట్టి.. నువ్వు ఇది చేయకూడదు. అది చేయాలంటూ ఆదేశిస్తుంటారు. ఇది వారి మనసుపై ప్రభావితం చూపుతుంది. దీనివల్ల మీ పిల్లలు నిశబ్దంగా ఉండిపోతారు.

ఇలా ఉండొద్దు..
తమ పిల్లలు తప్పు చేస్తే చాలు.. తల్లిదండ్రులు కొందరు అందరిముందు తిట్టేస్తుంటారు. కొంతమంది అయితే ఏకంగా చేయి చేసుకుంటూ ఉంటారు. ఈ అలవాటు ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల పిల్లలకు తల్లిదండ్రులపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. భయం ఆవహిస్తుంది. తరచుగా పిల్లలను కొట్టడం వల్ల వారికి తల్లిదండ్రులపై భయం తప్ప ప్రేమ పుట్టే అవకాశం తగ్గిపోతుంది. అందుకే అందరి ముందు కాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి పద్ధతిగా చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: Ascaris lumbricoides: పిల్లలు బరువు పెరగడం లేదా? నీరసంగా ఉన్నారా? నులిపురుగుల నివారణ ఇలా..
IB SCERT: డబ్బున్నోళ్ల పిల్లల మాదిరే గవర్నమెంట్‌ బడుల పిల్లలకూ విద్యాబోధన.. ఏపీ సర్కార్‌ కీలక అడుగులు
JVD at Bhimavaram: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం.. పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేశాం : సీఎం జగన్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు