HomeAndhra PradeshGeneral Elections India: దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. ఏపీలో మే 13న పోలింగ్, జూన్...

General Elections India: దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్

General Elections India: దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఏపీ, తెలంగాణలో ఒకే రోజు ఎన్నికలు జరగనున్నాయి. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరుగుతంది. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కానుంది. తొలి దశలో 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 26న రెండో దశ పోలింగ్, 7న మూడో దశ పోలింగ్ జరగనుంది. మే 13న నాలుగో దశ పోలింగ్ నిర్వహిస్తారు. నాలుగో దశలో తెలంగాణ ఎంపీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 20న ఐదో దశ పోలింగ్, మే 25న ఆరో దశ పోలింగ్, జూన్ 1న తుది దశ జరగనుంది. General Elections India

22 రాష్ట్రాల్లో ఒకే విడతలో లోక్ సభ ఎన్నికలు

* నాలుగు రాష్ట్రాల్లో రెండో విడతలో ఎన్నికలు
* కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్ లో రెండు విడతల్లో ఎన్నికలు
* ఛత్తీస్ గఢ్, అసోం లో మూడు విడతల్లో ఎన్నికలు
* ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖంఢ్ లో నాలుగు విడతల్లో ఎన్నికలు
* మహారాష్ట్ర. జమ్మూకశ్మీర్ లో ఐదు విడతల్లో ఎన్నికలు
* యూపీ, బీహార్, బెంగాల్ లో ఏడు విడతల్లో ఎన్నికలు

మొత్తం ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు
* ఏప్రిల్ 19న లోక్ సభ ఎన్నికల తొలి విడత పోలింగ్
* 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్
* ఏప్రిల్ 26న లోక్ సభ ఎన్నికల రెండో విడత పోలింగ్
* 89 నియోజకవర్గాల్లో రెండో విడత పోలింగ్
* మే 7న లోక్ సభ ఎన్నికల మూడో విడత పోలింగ్

* 94 నియోజకవర్గాల్లో మూడో విడత పోలింగ్
* మే 13న లోక్ సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్
* 96 నియోజకవర్గాల్లో నాలుగో విడత పోలింగ్
* మే 20న లోక్ సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్
* 49 నియోజకవర్గాల్లో ఐదో విడత పోలింగ్

* మే 25న లోక్ సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్
* 57 నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్
* జూన్ 1న లోక్ సభ ఎన్నికల ఏడో విడత పోలింగ్
* 57 నియోజకవర్గాల్లో ఏడో విడత పోలింగ్

ఇవీ చదవండి No Re poll: జీరో వయలెన్స్‌, నో రీపోల్.. ఇవే వచ్చే ఎన్నికల్లో ప్రధాన అంశాలు..
YSRCP Candidates Final List: సామాజిక న్యాయం చేతల్లో చేసి చూపించాం: ముఖ్యమంత్రి జగన్
CM Jagan Ready to Elections: ఎన్నికల సమరానికి సీఎం జగన్‌ సిద్ధం.. 18 నుంచి ప్రచార సమర భేరి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు