HomeLife StyleLife partner name: మీ ఫోన్‌లో మీ జీవిత భాగస్వామి పేరు ఎలా ఫీడ్ చేసుకున్నారు?...

Life partner name: మీ ఫోన్‌లో మీ జీవిత భాగస్వామి పేరు ఎలా ఫీడ్ చేసుకున్నారు? ఇలా ప్రయత్నిస్తారా?

Life partner name: లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ తోడు అవసరం. స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్‌ ఉండటం కామనే. పెళ్లి అయ్యేంత వరకు యువతీ యువకులకు ఓ రకమైన లైఫ్‌ ఉంటే పెళ్లి తర్వాత కొత్త జీవితం మొదలవుతుంది. వైవాహిక జీవితం అనేది అనుభవిస్తేనేగానీ తెలియదు. వివాహ బంధంతో ఒక్కటైన జంటలు జీవిత భాగస్వామిని ఏమని పిలుస్తారు? ప్రాంతాలను బట్టి, పెరిగిన పరిస్థితులను బట్టి రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. Life partner name

పెద్దలు చెప్పిన దాని ప్రకారం నడుచుకొనే జంటలు కాస్త సంప్రదాయబద్ధంగా ఉంటారు. సహజంగా ఇల్లాలు భర్తను.. ఏమండీ అని పిలుస్తుంది. కొందరు భర్తలు భార్యను పేరుతో పిలుస్తుంటారు. పూర్వ కాలంలో అయితే ఏమోయ్‌.. ఏమేవ్‌.. ఇదిగో నిన్నే.. అంటూ పిలుచుకునే సందర్భాలు చూసి ఉంటాం. ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటివి చూడొచ్చు. నేటి కాలంలో పెళ్లి కాగానే వేరు కాపురం సహజం అయిపోయింది. ఉద్యోగాలు, వ్యాపారాలు, రకరకాల పనుల నిమిత్తం పట్టణాలు, నగరాలు, ఇతర రాష్ట్రాల్లో జంటలు నివసించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఇద్దరే జీవనం కొనసాగిస్తుంటారు. పేర్లతో పిలుచుకోవడం, బుజ్జీ, డియర్‌.. లాంటి ముద్దు పదాలతో పిలుచుకుంటూ ఉంటారు.

లవ్‌ మేరేజీలు చేసుకున్న వారైతే ఒసేయ్‌, ఏమే, ఏరా, అరేయ్‌.. లాంటి పదాలతో పిలుచుకోవడం మనం చూసే ఉంటాం. కానీ, అరేంజ్డ్‌ మ్యారేజీలు చేసుకున్న వారు.. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వారు.. మహిళలు తన భర్తను ఏవండీ అని, పురుషులైతే పేరుతో పిలుచుకుంటూ ఉంటారు.

సెల్‌ఫోన్లో పేరు ఎలా ఫీడ్‌ చేసుకుంటారంటే..

ఇటీవల కాలంలో స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక తమ జీవిత భాగస్వామి పేర్లను ఎలా ఫీడ్‌ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా ఉంటోంది. తాజాగా ఓ ఫేస్‌బుక్‌ గ్రూపులో మీ జీవిత భాగస్వామి పేరును ఎలా ఫీడ్‌ చేసుకున్నారని పోస్టు పెట్టగా అందుకు ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానమిచ్చారు. కామెంట్లతో హోరెత్తించారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి..

సింగం
దేవత
డార్లింగ్
ఉంటే కదా..
బావ
టార్చర్
నేమ్ తోనే
మై వెంకీ
హోం మినిస్టర్
స్వీట్ హార్ట్
డెవిల్
మై హోం
ఫైర్
మై లైఫ్
ఏమేవ్
మా ఇంటి లక్ష్మి
క్రైమ్ పార్టనర్
డెవిల్ డార్లింగ్
దీవెన
ఆమె
పద్మా పెళ్లాం
అందాల రాక్షసి
అమ్ము
మై లవ్
సైకో
హస్బెండ్
నా సగభాగం దొబ్బేసిన దానా
నైఫ్
క్వీన్
రాజి
హబ్బీ
మామ్
హోంమంత్రి
మై హార్ట్ బీట్స్
హ్యాపీ హోం
స్వీట్ హార్ట్
డాల్బీ అట్మోస్
ఎల్ పీ (లైఫ్ పార్టనర్)
నా ఊపిరి
మై..
మిసెస్
లవ్‌లీ
ఏంజిల్
వైఫీ

ఇదీ చదవండి: Mental Health Condition in Family: దాంపత్యంలో భాగస్వామి హ్యామీగా ఉన్నారా? ఎలా తెలుసుకోవాలంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు