Telangana Budget: తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి బడ్జెట్‌ను నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రూ.2,75,891 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్నారు. వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు కేటాయింపులు చేశామన్నారు. కౌలు రైతులకు కూడా రైతు బీమా అమలు చేస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణామాఫి త్వరలో కార్యాచరణ ఉంటుందన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్నారు. Telangana Budget
ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్దితో ఉన్నామని తెలిపారు. అర్హులైన అందరికీ ఆరు గ్యారంటీలు అందుతాయన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచుతున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ లోని హామీలన్నీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఐటీ రంగం మరింత వృద్ధి చెందేలా కొత్త పాలసీ ఉంటుందన్నారు. రాష్ట్రం నలుమూలలకు ఐటీ కంపెనీలను విస్తరిస్తామన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలు వచ్చేట్టు చేస్తామన్నారు. గ్రామం యూనిట్ గా గ్రామీణాభివృద్ది ప్రణాళిక ఉంటుందన్నారు. ఆర్థికశక్తిగా హైదరాబాద్ ఎదుగుదలకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్ లో వందలాది ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ప్రతీ పంటకు మద్దతు ధర ఇస్తామని తెలిపారు. భట్టి ప్రసంగం ముఖ్యాంశాలు ఇవీ..
* ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తాం
* తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెస్తాం
* ప్రజల సంక్షేమం కోసం ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కొంటాం
* ప్రజాపాలన మరింత పటిష్టంగా ముందుకు సాగుతుంది
* నిస్సహాయులకు సాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
* సమానత్వమే మా ప్రభుత్వ విధానం
* అందరం కోసం మనందరం అనే స్పూర్తితో ముందుకెళ్తాం
* ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించడం మా చిత్తశుద్ధికి నిదర్శనం
* రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత
* గత ప్రభుత్వం దళిత బంధు పథకానికి రూ.17,700 కోట్లు చూపించారు.. ఒక్క పైసా ఇవ్వలేదు
* ఐటీ శాఖకు రూ.774 కోట్లు
* పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు
* పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
* జీఎస్డీపీ 2022-3తో పోలిస్తే 13,02,371 కోట్ల నుంచి 14,49,708 కోట్లకు
* ఆర్ధిక వృద్ధి 14.7 శాతం నుంచి 11.3 శాతం క్షీణించింది
* దేశీయ స్థాయిలో వృద్ధి రేటు 16.1 శాతం నుంచి 8.9 శాతానికి పడిపోయింది
* అధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది 5వ స్థానం
* టీఎస్ పీఎస్ సీ నిర్వహణ కోసం 40 కోట్లు కేటాయింపు
* అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలు నెరవేర్చాం
* విద్యుత్ రంగానికి ర.16,825 కోట్లు కేటాయింపు
* మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్ల అదనపు చెల్లింపు
* రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం
* గృహ జ్యోతి కింద రూ.500లకే వంటగ్యాస్
* సంక్షేమ పథకాల అమలుకు రూ.53,196 కోట్లు
* మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు
* కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తాం
* రాష్ట్రంలో ప్రభుత్వం తరపున రెండు లెదర్ పార్కులు
* రాష్ట్రం నలుమూలల అభివృద్ధికి ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు
* త్వరలో డ్రై పోర్టులను అందుబాటులోకి తెస్తాం
* పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు ప్రతిపాదిస్తున్నాం
* గ్రామీణ ప్రజల అభివృద్ధికి ఏఐ టెక్నాలజీని వినియోగిస్తాం
* ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బంది రానీయం
* ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరిస్తాం
* అమెరికాలోని ఐటీ సర్వ్ అనే సంస్థతో సంప్రదింపులు చేస్తున్నాం
* ఐటీ రంగంలో తెలంగాణ తిరుగులేని శక్తిగా నిలబడుతుంది
* 2 లక్షల రుణమాఫీపై త్వరలోనే విధివిధానాలు
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు
* పాలనకు కాదు రాష్ట్రాభివృద్ధికి హైదరాబాద్ గుండెకాయ
* హైదరాబాద్ కు ఆర్ధిక శక్తినిచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమే
* ఫార్మా, ఐటీ, ఓఆర్ఆర్, 24 గంటల విద్యుత్ ఘనత కాంగ్రెస్ దే
* హైదరాబాద్ అభివృద్ధి నాయకులు, అధికారుల కోసం కాదు
* మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పనా జోన్ గా మారుస్తాం
* మూసీ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధికి నూతన విధానాలు
* హైదరాబాద్ అభివృద్ధి నాయకులు, అధికారుల కోసం కాదు
* థేమ్స్ నది తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
* సాంస్కృతిక కట్టడాల పరిరక్షణను పకడ్బందీగా అమలు చేస్తాం
* మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కోసం రూ.1,000 కోట్లు
ఇదీ చదవండి: Telangana Voters: తెలంగాణలో ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ.. మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే…
Telangana Voters: తెలంగాణలో ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ.. మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే…
Maha Lakshmi Scheme Telangana: మహాలక్ష్మి పథకానికి అర్హులు ఎవరు? కావాల్సిన ధృవపత్రాలివే..
