HomeAndhra PradeshAP DSC Notification: ఏపీలో టీచర్‌ ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. డీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్‌.. ఏ...

AP DSC Notification: ఏపీలో టీచర్‌ ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. డీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్‌.. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులంటే..

AP DSC Notification: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన వారికి ఎట్టకేలకు ఎన్నికల ముంగిట జగన్‌ సర్కార్‌ వీరికి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నిన్న విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఏజిల్లాకు ఎన్ని పోస్టులు, విధి విధానాలు, డీఎస్సీ నోటిఫికేషన్‌ గురించి సమగ్ర సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. (AP DSC Notification)

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. ఏపీ టెట్‌, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏడు యాజమాన్యాల కింద ఉన్న.. జిల్లా పరిషత్, మండల పరిషత్,మున్సిపల్,ఎపి మోడల్ స్కూల్స్,ఎపి రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్ సొసైటి,ఎపి ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (ఆశ్రమ్), ఏపీ సోషల్ వెల్పేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసేటీ, మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పనిచేస్తున్న విద్యాసంస్థల్లోని ఖాళీలన్నిటి భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.

వాటిలో ఎస్జీటీ 2,280 ఖాళీలు, స్కూల్ అసిస్టెంట్ 2,299, టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42 ఖాళీలు కలిపి మొత్తం 6,100 పోస్టులను డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కాగా ఈప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ ఖాళీలన్నిటినీ రానున్న డీఎస్సీ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందన్నారు. జీరో వేకెన్సీ అనే విధానంతో ఖాళీలన్నిటినీ భర్తీ చేస్తామన్నారు.

ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ టెట్)కు సంబంధించి ఈనెల 8న నోటిఫికేషన్ జారీ చేసి ఈనెల 27 నుంచి మార్చి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించి మార్చి 14న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. డీఎస్సీకి సంబంధించి ఈనెల 12న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. మార్చి 15 నుంచి 30 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించి ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలను వెల్లడించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

పరీక్ష కేంద్రాలు ఇవీ..

సమీప రాష్ట్రాల్లో నివసిస్తున్నతెలుగు అభ్యర్దుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని కేంద్రాలతో పాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, బరంపురంలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే స్వేఛ్ఛ కూడా అభ్యర్ధులకే ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్‌లో ఉపాధ్యాయ నియామక ఉత్తర్వులను జారీ చేస్తామని మంత్రి బొత్స స్పష్టీకరించారు.

ఐదేళ్లలో రూ.73,000 కోట్లు ఖర్చు చేశాం

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఈప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని ఈఐదేళ్ళలో విద్యపై రూ.73 వేల కోట్లను ఖర్చు చేశామని మంత్రి బొత్స వెల్లడించారు. వారం రోజుల క్రితం ఐబీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.

రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ ఏపీ టెట్, డీఎస్సీ 2024 షెడ్యూల్ వివరాలు వివరించారు. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను రిజర్వేషన్లతో సహా నోటిఫికేషన్లో పొందుపర్చడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులకు టెక్నాలజీ లెడ్ టెస్టింగ్ ట్రైనింగ్ కార్యాక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఆంగ్ల మాధ్యమంపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ టెట్,డీఎస్సీ పరీక్షల నిర్వహణపై ఫిర్యాదుల నివృత్తికి ఈనెల 8వ తేదీ నుంచి విద్యాశాఖ కమీషనర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలిపారు.

ముఖ్యమైన తేదీలు ఇవీ..

* ఈనెల 27 నుంచి మార్చ్ 9 వరకు టెట్ పరీక్ష
* మార్చి 14న టెట్ తుది ఫలితాలు
* మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్సల్ లో డీఎస్సీ పరీక్షలు
* మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్
* మార్చి 31న ప్రాథమిక కీ విడుదల
* ఏప్రిల్ 1న ప్రాథమిక కీలో అభ్యంతరాల స్వీకరణ
* ఏప్రిల్ 2న ఫైనల్ కీ విడుదల
* ఏప్రిల్ 7న డీఎస్సీ ఫైనల్‌ ఫలితాలు ప్రకటన
* జూన్ నాటికి పోస్టింగ్‌లు పూర్తి

ఏ జిల్లాకు ఎన్ని పోస్టులంటే..

ఇదీ చదవండి: AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు గ్రేట్‌ న్యూస్‌.. 6,100 పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు