HomeAndhra PradeshMuslim Voters in AP: ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న...

Muslim Voters in AP: ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలివే..

Muslim Voters in AP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం ఏర్పడింది. అప్పుడే ముఖ్య నేతలందరూ జోరుగా ప్రజల్లో తిరుగుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ క్యాండేట్లను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు వైయస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రేపటి నుంచి ఎన్నికల శంఖారావం మొదలు పెట్టనున్నారు. ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖం పూరించనున్నారు. భారీ బహిరంగ సభతో తన సత్తా చాటనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సామాజికవర్గాల వారీగా ఓట్లను ప్రభావితం చేసేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభావవంతమైన కమ్యూనిటీ ముస్లిం ఓటర్లు.. ఎక్కువ ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఓ లుక్కేద్దాం.. (Muslim Voters in AP)

విజయవాడ వెస్ట్ – 60000
గుంటూరు ఈస్ట్ – 70000
నెల్లూరు సిటీ – 60000
కర్నూలు – 90000
కడప – 80000

అనంతపురం అర్బన్ – 55000
నంద్యాల – 60000
ఆదోని – 70000
మదనపల్లి – 50000
ప్రొద్దుటూరు – 50000

చిత్తూరు – 25000
తెనాలి – 25000
మచిలీపట్నం – 20000
ఒంగోలు – 30000
హిందూపురం – 50000

గుంతకల్లు – 40000
కదిరి – 40000
రాయచోటి – 65000
తాడిపత్రి – 30000
చిలకలూరిపేట – 35000

నరసరావుపేట – 30000
నెల్లూరు రూరల్ – 30000
కావలి – 20000
ఉదయగిరి – 32000
ఆత్మకూరు – 31000

కోవూరు – 22000
బద్వేలు – 24000
పులివెందుల – 31000
కమలాపురం – 30000
జమ్మలమడుగు – 25000

మైదుకూరు – 27000
నందిగామ – 22000
జగ్గయ్యపేట – 21000
తాడికొండ – 23000
మంగళగిరి – 25000

పొన్నూరు – 26000
ప్రత్తిపాడు – 21000
గుంటూరు వెస్ట్ – 30000
పెనమలూరు – 25000
పెదకూరపాడు – 22000

సత్తెనపల్లి – 31000
వినుకొండ – 20000
గురజాల – 37000
మాచర్ల – 20000
బాపట్ల -20000

పర్చూరు -20000
మార్కాపురం – 20000
గిద్దలూరు – 27000
ఆళ్లగడ్డ – 40000
శ్రీశైలం – 42000

నందికొట్కూరు – 38000
పాణ్యం – 35000
బనగానపల్లె – 30000
డోన్ – 20000
ఎమ్మిగనూరు -27000

ధర్మవరం – 20000
రాజంపేట – 25000
తంబళ్లపల్లె – 25000
పీలేరు – 45000
మదనపల్లి – 45000

పుంగనూరు – 35000
చిత్తూరు – 22000
పలమనేరు – 38000

ముస్లిం మైనార్టీల ఓట్లు చాలా నియోజకవర్గాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోకెల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కీలక పాత్ర వీరిదే. ఇక్కడ దాదాపు 90 వేలకు పైచిలుకు ముస్లిం ఓట్లు ఉన్నాయి. తర్వాత గుంటూరు, విజయవాడ, కడపలోనూ అత్యధికంగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ముస్లింలకు కీలక పదవులు దూరమయ్యాయి. అయితే, ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వంలో ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. కడపకు చెందిన అంజాద్‌ బాషా డిప్యూటీ సీఎంగా ఐదేళ్లపాటూ కొనసాగుతుండటం విశేషం. అలాగే ముస్లిం మైనార్టీ మహిళ జకియా ఖానమ్‌ మండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా నియామకం అయ్యారు.

Read Also: Independence Day: What is Independence Day? గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకొంటాం?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు