Taekwondo awards: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్ ‘తైక్వాండో’ అండర్ – 14,17 & 19 బాల, బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రజతం, మూడు కాంస్య పతకాలు దక్కించుకున్నారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు. (Taekwondo awards)
ఈ పోఈలు గతేడాది డిసెంబరు 31 నుంచి ఈ ఏడాది జనవరి 5 వరకు మధ్య ప్రదేశ్ రాష్ట్రం ‘బీటల్’లో జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
విజేతలు వీరే:
• అండర్ 19 బాలికల (52-55 కేజీలు) విభాగంలో హస్తి తేజస్విని (యస్.వి.జూనియర్ కాలేజీ ,కోడూరు ఆర్.యస్. అన్నమయ్య జిల్లా) రజత పతకం సాధించారు.
• అండర్ 19 బాలికల (46-49 కేజీలు ) విభాగంలో వారణాసి హిమ శ్రీ (మున్సిపల్ హై స్కూల్ , కస్పా, విజయనగరం) కాంస్య పతకం సాధించారు.
• అండర్ 14 బాలికల (16-18 కేజీలు) విభాగంలో ఆకుల సమీరా (జెడ్పీహెచ్ఎస్, భాగ్యనగరం, దొర్నిపాడు, మండలం, నంద్యాల జిల్లా) కాంస్య పతకం సాధించారు.
• అండర్ 17 బాలురు (73-78 కేజీలు) విభాగంలో పెదగాడి ధనుష్ తేజ,
(ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అశోక్ నగర్, కాకినాడ, కాకినాడ జిల్లా) కాంస్య పతకం సాధించారు.
తైక్వాండో అనేది ఒక కొరియన్ యుద్ధకళ, దక్షిణ కొరియా జాతీయ క్రీడ. కొరియన్‌లో, టై అంటే “పాదంతో దాడి చేయడం లేదా పగలుకొట్టడం” కోం అంటే “పిడికిలితో దాడి చేయడం లేదా పగలుకొట్టడం”, డో అంటే “మార్గం,” “పద్ధతి,” లేదా “కళ.” దీని ప్రకారం, టైక్వాండో అనేది సాధారణంగా “పాదం, పిడికిలి ఉపయోగించే విధానం” లేదా “తన్నడానికి , గుద్దడానికి ఒక పద్ధతి”గా అనువదించవచ్చు.
కొరియాలో అనేక అంతర్యుద్ధాలు , జీవిత కష్టాల కారణంగా ప్రజలు స్వీయ-రక్షణ సాధనంగా దీనిని సృష్టించారు.సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో ఇది అధికారిక ఒలింపిక్ క్రీడగా మారగలిగింది. ఇది కేవలం యుద్ధ కళ కంటే ఎక్కువ. కాబట్టి ఇది కేవలం చేయి పాదాల ద్వారా పోరాటం మాత్రమే కాదు, ఆలోచనా విధానం, స్వీయ క్రమశిక్షణ , ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం. మరో మాటలో చెప్పాలంటే, శరీరం ఇంకా మనస్సు మధ్య సమతుల్యత. శిక్షణ ద్వారా విద్యార్థి ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, శారీరక ఆరోగ్యం, సమన్వయం, ఆత్మరక్షణను పెంపొందించుకుంటాడు.
ఇది తరచుగా పోరాట క్రీడగా అభ్యసిస్తారు. టైక్వాండో ఇతర ఆసియా యుద్ధ కళలతో అనేక సారూప్యతలను పంచుకున్నప్పటికీ, ఇది అనేక కీలక అంశాలలో వాటికి భిన్నంగా ఉంటుంది. టైక్వాండో కొరియా జాతీయ క్రీడ నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, అంతర్జాతీయ పోటీలను నిర్వహించి, ఒలింపిక్ క్రీడల కార్యక్రమంలో ఆధునిక పోటీ క్రీడగా పరిణామం చెందింది.
Read Also : Journalist House Sites: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల భూసేకరణ ప్రక్రియ వేగవంతం.. మూడు రోజుల్లో బడ్జెట్ రిలీజ్!
