Pradyumna IAS: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని పరిటాల శ్రీరాములు డిగ్రీ కళాశాలలో ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రీడలు యువజన సర్వీసులు, రోడ్లు భవనాల శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రద్యుమ్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.నేటి యువత విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. (Pradyumna IAS)
ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రీడాకారులతో పరిచయం చేసుకొని క్రీడల నిర్వహణ నియమ నిబంధనలు క్రీడాకారులు తెలుసుకోవాలని సూచించారు. అలాగే ఏ ఏ సచివాలయ తరఫున ఆడుతున్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ క్రీడల్లో యువతీ ,యువకులు ఉత్సాహంగా పాల్గొని పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రపంచ స్థాయిలో ప్రస్తుత క్రీడాకారులు క్రీడల్లో ఎదగాలని ఆకాంక్షించారు.
మండల స్థాయి నుంచి ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొడం జరుగుతుందన్నారు. అందువల్ల ప్రతి క్రీడాకారులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అందున విభిన్న ప్రతిభా నైపుణ్యాలతో రాష్ట్రానికి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని, ఈ క్రీడల్లో క్రీడాకారులు తమ ప్రతిభ పఠవాలను ప్రదర్శించాలన్నారు.
అనంతరం ప్రిన్సిపల్ సెక్రెటరీ కలెక్టరు ఒక జట్టుగా, మరొక జట్టుగా జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ లు కాసేపు షటిల్ ఆడి క్రీడాకారులను విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఆ తర్వాత పెనుగొండ కొండపై ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కొండపై నిర్మించిన రోడ్డు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచి పనులు చాలా బాగున్నాయని, సుమారు రూ. 13 కోట్లతో నిర్మించిన ఆరు కిలోమీటర్ల మేరకు నాణ్యత కలిగిన రోడ్డు నిర్మించినందుకు సంబంధిత శాఖ ఇంజనీర్లను ప్రిన్సిపల్ సెక్రెటరీ అభినందించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కోనేరును పరిశీలించారు.
అనంతరం పెనుగొండ నుంచి బయలుదేరి పుట్టపర్తి కోడూరు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణపు పనులను ప్రిన్సిపాల్ సెక్రటరీ పరిశీలించిన అనంతరం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఆర్ అండ్ బి సంజీవయ్య, డి నాగరాజు ఏఈ వెంకటేష్, తాసిల్దార్ సురేష్, కమిషనర్ వంశి, తదితరులు పాల్గొన్నారు.
Read Also : Sahiti Awards: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సాహితీమూర్తులకు పురస్కారాలు.. అనంతపురంలో 9న సదస్సు
