HomeAndhra PradeshAmbati Rambabu on Sagar Issue: తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దు : మంత్రి...

Ambati Rambabu on Sagar Issue: తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దు : మంత్రి అంబటి

Ambati Rambabu on Sagar Issue: తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నాగార్జున సాగర్‌ వివాదంపై ఆయన నిన్న తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. తాము తమ వాటాకు మించి ఒక్క చుక్క నీరు కూడా తీసుకోబోమని స్పష్టం చేశారు. (Ambati Rambabu on Sagar Issue)

* నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారు
* తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దు
* తెలంగాణలో ఏ పార్టీ వచ్చినా మాకు సంబంధం లేదు
* ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి
* ఏ పార్టీని ఓడించాల్సిన అవసరం మాకు లేదు

* నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఏపీ వాటా తీసుకున్నాం
* అడ్డుగా వచ్చిన తెలంగాణ పోలీసులకు సర్ది చెప్పి పంపించాం
* మా వాటాకు మించి మేము ఏమీ తీసుకోలేదు
* ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకుంటారు
* దండయాత్ర అంటూ కొన్ని పత్రికలు పిచ్చి రాతలు రాస్తున్నాయి
* కేసులకు భయపడి చంద్రబాబు ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెట్టారు

* అన్యాయం జరిగింది కాబట్టి సరిచేసే ప్రయత్నం చేశాం
* సాగర్ కుడి కెనాల్ ను కూడా తెలంగాణ ఆపరేట్ చేయడం చట్ట విరుద్ధం
* ఆంధ్రావైపు కూడా తెలంగాణ పోలీసులే ఉంటున్నారు
* మన వాటా నీటిని విడుదల చేయాలన్నా… తెలంగాణ పర్మిషన్ తీసుకోవాలి
* ఏపీ అధికారులు అక్కడికి వెళ్లాలన్నా తెలంగాణ పోలీసుల పర్మిషన్ తీసుకోవాలంటున్నారు
* చంద్రబాబు అసమర్ధత వల్ల తెలంగాణ పోలీసులు ఏపీ భూభాగంలోకి వచ్చారు

* మన భూభాగంలోకి మన పోలీసులు, అధికారులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుంది
* మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టును మాత్రం వాడుకోలేదు
* మా వాటాను మేము వాడుకునే స్వేచ్ఛ మాకు కావాలి

నాగార్జునసాగర్ వివాదంలో ఏపీ పోలీసుల పై ఎఫ్ఐఆర్

ఏపీ పోలీసుల పై విజయపురి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా ఏపీ పోలీసులను చేరుస్తూ కేసు నమోదు చేశారు. తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా వచ్చారని కేసు పెట్టారు. 500 మంది సాయుధ బలగాలతో డ్యామ్ పైకి వచ్చారణ ఆరోపణ చేశారు. డ్యామ్ లో 13 గేట్లు ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. కృష్ణాబోర్డు నిబంధనలకు విరుద్ధంగా కుడికాలువ ద్వారా ఏపీకి నీరు వదిలారని ప్రస్తావించారు. సెక్షన్ 447, 427 కింద కేసు నమోదు చేశారు.

Read Also : Minister Meruga Nagarjuna: సంక్షేమ పథకాలపై తప్పుడు కథనాలు.. మంత్రి మేరుగ ఫైర్‌

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు