HomeTelanganaCongress win in Telangana: తెలంగాణ హస్తగతం.. CONG 64, BRS 39, BJP 8,...

Congress win in Telangana: తెలంగాణ హస్తగతం.. CONG 64, BRS 39, BJP 8, MIM 7, CPI 1

Congress win in Telangana: తెలంగాణలో హస్తం పార్టీ జెండా పాతింది. సర్వశక్తులూ ఒడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. జాతీయ నాయకత్వం మొదలు.. రాష్ట్రంలో ముఖ్య నాయకులంతా పార్టీ విజయానికి సమష్టిగా కృషిచేయడంతో అజేయ విజయం ఖరారైంది. (Congress win in Telangana)

ఏ పార్టీకి ఎన్ని సీట్లు

కాంగ్రెస్‌ 64
బీఆర్‌ఎస్‌ 39
బీజేపీ 8
ఎంఐఎం 7
సీపీఐ 1

కాంగ్రెస్‌ వ్యూహం ఫలించిందిలా..
* రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి జోష్‌ వచ్చింది.
* వ్యూహకర్త సునీల్‌ కనుగోలు అస్త్రాలు పని చేశాయి.
* మొదట పార్టీని గెలిపించుకుందాం.. మనలో కొట్లాటలు తర్వాత చూసుకుందామనే భావన నేతల్లో వచ్చింది.
* భట్టి విక్రమార్క, రేవంత్‌ కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు.
* నేతల పాదయాత్రలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి.
* రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీల పర్యటనలతో శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది.
* రాహుల్‌ పాదయాత్ర ఎఫెక్ట్‌ కర్ణాటకతోపాటు తెలంగాణపై చూపింది.
* టీడీపీ, చంద్రబాబు సపోర్ట్‌ చేయడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.
* సీపీఐ, సీపీఎంతోపాటు కోదండరామ్‌ తదితరులు కాంగ్రెస్‌కు సపోర్ట్‌ చేయడం ప్లస్‌ అయ్యింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందన

తెలంగాణలో బీజేపీ కి ఇచ్చిన మద్దతుకు ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్లుగా తెలంగాణలో బీజేపీ కి మద్దతు పెరుగుతోందన్నారు. ప్రజల కోసం తాము పనిచేస్తూనే ఉంటామన్నారు. బీజేపీ కార్యకర్తలు చేసిన కృషిని అభినందించారు.

ఓటమికి కారణాలు విశ్లేషించుకుంటాం: కేటీఆర్

తాము ఆశించిన ఫలితాలు రాలేదని కేటీఆర్‌ అన్నారు. ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటామన్నారు. ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని చెప్పారు. ఈ ఎదురుదెబ్బను గుణపాఠంగా తీసుకుంటామన్నారు. తమకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా, నిలదొక్కుకున్నామన్నారు. ప్రతిపక్ష పాత్రలో కూడా ఇమిడిపోతామనిచెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ నిరాశపడొద్దు.. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని ఊరడించారు. కాంగ్రెస్ కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఇబ్బంది పెట్టం.. వాళ్లు కూడా కుదురుకోవాలని చెప్పారు. ఎక్కడ కోల్పోయామో .. అక్కడే తెచ్చుకుంటామన్నారు. స్వల్ప తేడాతో తమ అభ్యర్థులు చాలా మంది ఓడిపోయారన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. మార్పులు, చేర్పులు చేసుకొని ముందుకు వెళ్తామన్నారు. ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ ను పంపారని కేటీఆర్ తెలిపారు.

4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ స్పందన

మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని రాహుల్‌ చెప్పారు. భావజాలంపై తమ పోరు కొనసాగుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

* డిసెంబర్ 3న శ్రీకాంతాచారి అమరుడయ్యారు
* ఈ విజయంతో శ్రీకాంతాచారికి ఘననివాళి
* ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు
* తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను పెంచారు
* భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ స్ఫూర్తి నింపారు
* ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

* తెలంగాణ ఇచ్చిన సోనియా ఆకాంక్షలను సాధిస్తాం
* సోనియా, రాహుల్, ప్రియాంకది తెలంగాణ తో పేగుబంధం
* తెలంగాణ కు ఏ కష్టం వచ్చినా వారు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు
* కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన నేతలందరికీ కృతజ్ఞతలు
* ఈ విజయం తెలంగాణ అమరులకు అంకితం ఇస్తున్నాం

* ఉద్యమ స్ఫూర్తి తో పోరాడిన కార్యకర్తలకు ధన్యవాదాలు
* కాంగ్రెస్ విజయాన్ని అభినందించిన కేటీఆర్ కు థాంక్స్
* కొత్త సర్కార్ ఏర్పాటులో విపక్షం సహకరించాలి
* మిగతా పార్టీలు కూడా ప్రమాణస్వీకారానికి రావాలి
* పాలకపక్షం, ప్రతిపక్షాలను ప్రజలు నిర్ణయించారు

* ప్రజా తీర్పును అందరం శిరసావహిద్దాం
* సచివాలయ గేట్లు సామాన్యులకు తెరిచే ఉంటాయి
* ప్రగతి భవన్ డా. బాబాసాహెబ్ స్మారక భవనం గా మారుతుంది
* ప్రగతి భవన్ కాదు … ఇకపై అది ప్రజా భవన్
* ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తాం

* సీపీఐ, సీపీఎం , TJS లతో కలిసి ముందుకెళ్తాం
* కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నాం. మా కూటమి ఎన్నికల్లో గెలిచింది
* ఏ సమస్య వచ్చినా నైతికంగా అండగా ఉన్న రాహుల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు
* పార్టీ అంతర్గత విషయాలను సమన్వయం చేసిన ఇంచార్జ్ ఠాక్రే కు ప్రత్యేక కృతజ్ఞతలు
* ఈ విజయంలో 30 లక్షల మంది నిరుద్యోగుల పట్టుదల ఉంది.

Read Also : Exit Polls: ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌.. కాంగ్రెస్‌ హవా కొనసాగుతుందా? తెలంగాణలో పల్స్‌ ఎలా ఉందంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు