Chirata: చిరాత వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల్ని నివారించవచ్చు. దీన్ని స్వెర్టియా చిరాయితా అని శాస్త్రీయంగా పిలుస్తారు. బిట్టర్ స్టిక్, ఈస్ట్ ఇండియన్ బాల్మోనీ అని కూడా దీన్ని పిలుస్తారు. చిరాత మొక్కలు హిమాలయాల్లో ఎత్తయిన ప్రదేశాల్లో ఉంటాయి. కశ్మీర్ నుంచి భూటాన్ వరకు ఉన్న హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఈ మొక్కలు విరివిగా పెరుగుతాయి. ఈ మొక్కల కాండాలను, బెరడును అనేక రకాల వ్యాధులను నివారించడంలో ఉపయోగిస్తారు. (Chirata)
చిరాత గురించి చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో దీనికి ఉన్న ప్రాధాన్యం ఎనలేనిది. ముఖ్యంగా మధుమేహం బారిన పడిన వారికి ఇది దివ్యౌషధంగా పని చేస్తుంది. చిరాతను ఎలా వినియోగించుకోవాలి? ఉపయోగాలేంటి? అనే అంశాలను అందరూ తెలుసుకోవాలి. చిరాతను అద్భుతాల నిధిగా అభివర్ణిస్తారు. చిరాతతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆయుర్వేద పుస్తకాల్లోనూ దీని ప్రాధాన్యం గురించి కథలు కథలుగా పేర్కొన్నారు.
ముఖ్యంగా మలేరియా, మధుమేహం, కాలేయ వ్యాధుల నివారణకు, ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా చిరాతను వినియోగిస్తారు. చిరాత కాండాన్ని, బెరడును ఉపయోగించి ఆయుర్వేద మందులను రూపొందిస్తారు.ఈ హెర్బ్‌లో సహజంగా యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్స్, గ్లైకోసైడ్స్, చిరటానిన్, చిరాటోల్, పాల్మిటిక్ యాసిడ్ లాంటి పోషకాలు మెండుగా ఉంటాయి.
చిరాత.. ఆరోగ్య ప్రదాత..
చిరాతలో ఉండే పోషకాలు శరీరంతోపాటు మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి మేలు చేస్తాయి. చిరాతలో స్వెర్టియామార్టిన్ అనే సమ్మేళనం కలిగి ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థ బలోపేతం చేయడంతోపాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఒత్తిడితో బాధపడుతున్న వారు, ఆందోళనతో ఉన్న వారు చిరాత రసాన్ని తీసుకుంటే మంచిది. మూర్ఛ వ్యాధి చికిత్సలోనూ చిరాతను వాడతారు. చర్మ సమస్యలూ దూరం చేస్తుంది చిరాత. చిరాతతో టీ కూడా తయారు చేసుకొని సేవించవచ్చు. చిరాత కాండాలు, బెరడుతో టీ చేసుకొని రోజూ ఓ కప్పు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బెరడును పొడిలా చేసి మార్కెట్లో అమ్ముతారు. దీన్ని తెచ్చుకొని నీటిలో వేసి బాగా మరిగించి ఆ టీని తాగితే అనేక రుగ్మతలు దూరం అవుతాయి.
ఇదీ చదవండి: Wrong Food Combinations: రాంగ్ ఫుడ్ కాంబినేషన్లు తెలుసా? ఇలా తింటే ఆరోగ్యం దెబ్బతింటుందట..
