CM Jagan at flood affected areas: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన విజయవంతంగా ముగిసింది. రెండు రోజులపాటు రాష్ట్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు మండలాలు, ఊర్లలో సీఎం జగన్ పర్యటించారు. బాధితులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యారు. కలెక్టర్ బాగా స్పందించాడా? పనులు చేశాడా? సాయం అందిందా? అంటూ అందరినీ అడిగారు. వరద సమయంలో ఫొటోలకు పోజులివ్వకుండా వారం గడువు ఇచ్చి, కలెక్టర్లకు తగినంత డబ్బు, వనరులు ఇచ్చి బాధితులను ఆదుకోవాలని సూచించామన్నారు. (CM Jagan at flood affected areas)
థానేలంక, తోటరాముడిపేట, కొందుకుదురు, పొట్టిలంక, కొందుకుదురులంక, కూనలంక తదితర ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్.. అక్కడ గ్రామస్తులతో మాట్లాడారు. సీఎం జగన్ ఏ మాట్లాడారో ఆయన మాటల్లోనే…. (CM Jagan at flood affected areas)
“వరదలు వచ్చిన నేపథ్యంలో గోదావరి నీటి మట్టం దాదాపుగా 17 లక్షల క్యూసెక్కులు వస్తే 3వ ప్రమాద ఘంటిక. 16 లక్షల క్యూసెక్కులతో నీళ్ల ప్రవాహం వచ్చిన నేపథ్యంలో మన గ్రామాల్లో అంతా ఇబ్బందికర పరిస్థితి వచ్చాయి. మనం ఎలా ఉన్నాం.. మనకు జరగాల్సిన మంచి జరిగిందా? లేదా? అధికారులు సకాలంలో స్పందించారా లేదా? అధికారులు ఇక్కడికి వచ్చి తోడుగా ఉండి మిమ్మల్ని ఆదుకున్నారా లేదా? అన్న విషయాల మీద కనుక్కొనే దానికి, మిమ్మల్ని అడిగి తెలుసుకొనేందుకు ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను.

ఇంతకు ముందు పరిపాలనకు, మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనలో తేడా ఎలా ఉంది అన్నది ఒకసారి మీరంతా గమనించాలి. ఇంతకు ముందు అయితే ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అనే వాళ్లు కనపడరు. ఒకవేళ వస్తే ఫొటో కోసమో, అప్పటికప్పుడు అలా వచ్చి ఫొటోలు తీసుకొని పోవడమో, ప్రజలకు ఎలా జరుగుతోంది? ఏం జరుగుతోంది అని పట్టించుకొనే పరిస్థితి ఉండదు. వాళ్లు మాత్రం నాలుగు ఫొటోలకు మాత్రం కనపడే పరిస్థితి గతంలో చూసేవాళ్లం. మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్లు ఎవరైనా వస్తే అధికారులంతా కూడా వాళ్ల చుట్టూ తిరగడానికే సమయం సరిపోతుంది కానీ ప్రజలకు మంచి చేయడానికి ఎక్కడా కూడా పరిస్థితులు ఉండవు.
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, మీ బిడ్డ ప్రభుత్వంలో దీనికి మార్పు చేశాం. మొట్ట మొదటి సారిగా ఇటువంటి విపత్తు ఎక్కడైనా వస్తే కలెక్టర్‌కు పూర్తిగా తనకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా తన చేతుల్లో పెడుతున్నాం. కలెక్టర్‌ను అన్ని రకాలుగా ఎంపవర్ చేస్తున్నాం. గ్రామ స్థాయిలోనే సచివాలయం వ్యవస్థ స్థాపించడం జరిగింది. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్‌ను తయారు చేసి మీ అందరికీ తోడుగా నిలబడే ఒక గొప్ప వ్యవస్థను తీసుకురావడం జరిగింది. గ్రామ స్థాయిలో మన కళ్ల ఎదుటనే ఈరోజు విలేజ్‌క్లినిక్‌లు కనిపిస్తున్నాయి. అక్కడే ఏఎన్‌ఎంలు కనిపిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కనిపిస్తోంది. ఈ వ్యవస్థలన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత కలెక్టర్‌కు ఎటువంటి పరిస్థితిలో, ఇటువంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు, ఇటువంటి పరిస్థితుల్లో కలెక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాం.

వ్యవస్థలన్నింటినీ కూడా సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి మండల వ్యవస్థలన్నీ కూడా యాక్టివేట్ చేసి ప్రతి ఇంటికీ కూడా ఏ ఒక్కరికీ కూడా మంచి జరగాల్సిన చోట మంచి జరగకుండా ఉండే పరిస్థితి ఏ ఇంట్లోనూ ఉండకూడదు అని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతోంది. కలెక్టర్లకు ఒక వారం పాటు టైమ్ ఇస్తున్నాం. డబ్బులు ఇచ్చి కలెక్టర్లను అన్ని రకాలుగా ఎంపవర్‌చేసి, వ్యవస్థలన్నింటినీ యాక్టివేట్ చేసి కలెక్టర్లకు ఒక వారం రోజులు టైమ్‌ఇచ్చి, వారం రోజులతర్వాత నేనే ఆ గ్రామానికి వస్తాను. ఆ గ్రామంలో ఉన్న నా అన్నదమ్ములను, అక్కచెల్లెమ్మలను నేనే అడుగుతాను. ఏ ఒక్కరూ కూడా నాకు అందాల్సింది అందకుండా పోయింది.. కలెక్టర్ సరిగ్గా స్పందించలేదు.. వ్యవస్థలు సరిగ్గా పని చేయలేదు అన్న మాట ఎక్కడా కూడా వినపడకూడదు అని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఆ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఈ గ్రామానికి నేను వరదలు వచ్చిన వారానికి నేనే ఇక్కడికి వచ్చి దారి పొడుగునా అడుగుతూ వచ్చా ప్రతి ఇంట్లోకూడా. అక్కా.. మీ ఇంట్లో జరగాల్సినవి అన్నీ జరిగాయా అక్కా.. ప్రతి ఇంటికీ రూ.2 వేలు ఇచ్చారా? ప్రతి ఇంట్లోనూ కూడా ఇవ్వాల్సిన రేషన్ 25 కేజీల బియ్యంగానీ, ఒక లీటర్ పామాయిల్ గానీ, కందిపప్పు గానీ, పాలుగానీ, ఇలాంటివి 5 రకాల వస్తువులు ప్రతి ఇంట్లోనూ ఇచ్చారా లేదా అని అడగడం జరిగింది. ఎక్కడైనా కూడా ఇళ్లు డ్యామేజ్‌అయినా గుడిసె ఏదైనా డ్యామేజ్ అయితే, ఆ డ్యామేజ్ అయినది తక్కువ డ్యామేజ్ అయ్యింది, ఎక్కువ డ్యామేజ్ అయ్యింది అని చూడొద్దండి. గుడిసె డ్యామేజ్ అయ్యిందంటే పేదవాడు బతకడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి ఏరోజూ పేదవాడికి రాకూడదు. తక్కువ డ్యామేజ్, ఎక్కువ డ్యామేజ్ అని చూడకండి. డ్యామేజ్ అయిన ప్రతి ఇంటికీ కూడా కచ్చితంగా రూ.10 వేలు వచ్చేట్లుగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ఇవన్నీ కూడా ఆదేశాలిచ్చి కలెక్టర్లందరికీ ఆదేశాలిచ్చి, వారం రోజులు టైమ్ ఇచ్చి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ బిడ్డ మిమ్మల్ని అడిగే కార్యక్రమం చేస్తున్నాడు. పంటలు నష్టపోయిన ప్రతి ఒక్కరికీ కూడా నేను ఈరోజు ఒకటే మాట చెబుతున్నా. గతానికి ఈరోజుకు తేడా ఏమిటి అంటే.. మనందరి ప్రభుత్వంలో పంటలు ఎక్కడైనా నష్టపోతే ఆ నష్టపోయిన పంటలకు వెంటనే ఈ సీజన్ ముగియక మునుపే, ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇచ్చే ఒక గొప్ప సంప్రదాయానికి మనం నాంది పలికాం. అందులో భాగంగానే ఈరోజు వరదలు వచ్చాయి మనకు.. ఏ ఒక్కరైనా కూడాప్రతి ఎకరానూ ఎన్యుమరేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడే ఆర్బీకే వ్యవస్థ ఉంది. ఇక్కడే గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది.
గ్రామంలో ఉన్న ప్రతి ఎకరానూ ఎన్యుమరేట్ చేసి ఏ రైతు ఎన్ని ఎకరాలు నష్టపోయాడు, ఏ రైతు ఏ పంట వేశాడు అని చెప్పి ఆర్బీకేలో లిస్ట్ కూడా డిస్‌ప్లే చేస్తున్నాం. ట్రాన్స్‌పరెంట్‌గా, పారదర్శకంగా జరిగే ఈ కార్యక్రమంలో మీరు అక్కడికి వెళ్లి ఆ లిస్టు చూసుకొని.. మేము ఈ పంట వేశాం. ఈ పంటకు మాకు నష్టం జరిగింది. అయినా మా పేరు ఇక్కడ కనిపించడం లేదు అని ఎవరికైనా అనిపిస్తే వెంటనే అక్కడికి వెళ్లి మీ పేరు ఒకవేళ లేకపోతే, మీ పేరు లేదు అని కంప్లయింట్ ఇస్తే వెంటనే మళ్లీ రీవెరిఫై చేసి మళ్లీ మీ పేరు కచ్చితంగా అక్కడికి వచ్చేట్లుగా చర్యలు తీసుకుంటారు.. ఒకవేళ నిజంగానే మీకు నష్టం జరిగి ఉంటే మాత్రం. ఇటువంటి గొప్ప పారదర్శక వ్యవస్థను క్రియేట్ చేసి ఆ లిస్ట్ అక్కడ డిస్‌ప్లే చేసి, ఆ పంట నష్టానికి సంబంధించిన డ్యామేజ్ కూడా మరో రెండు మూడు రోజుల్లోఆ లిస్టు పెడతారు. ఆ తర్వాత 15 రోజులపాటు టైమ్ ఇస్తారు. ఆ తర్వాత ఇదే నెలాఖరులోపే పంట నష్టం జరిగిన డ్యామేజ్‌కి కూడా మీకు డబ్బులు వెంటనే ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్బంగా మీకు తెలియజేస్తున్నా.

విపత్తు ఏదైనా వచ్చినప్పుడు వీలైనంత వరకు ప్రతి అక్కకూ ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అన్నకూ ప్రతి తమ్ముడికీ తోడుగా ఉండాలని మీ బిడ్డ ప్రభుత్వం పరుగెడుతోందని చెప్పడానికి సంతోషపడుతున్నా. ఇదొక్కటే కాకుండా ఇక్కడికి థానేలంకకు వచ్చినప్పుడు, ఇంతకు ముందు లంక గ్రామాలకు పోయినప్పుడు కూడా అందరూ కూడా, చాలా ఎక్కువ మంది ఒకటే అడుగుతున్నారు. రివర్ట్‌మెంట్ కట్టగలిగితే నీళ్లు మా గ్రామంలోకి రాకుండా ఉండే పరిస్థితి అవుతుంది. భూములు కోతకు గురి కాకుండా ఉంటాయి. ఆ రివర్ట్‌మెంట్ కట్టే కార్యక్రమం చేయిస్తే బాగుంటుందని చాలా మంది చెప్పడం జరిగింది.
దీనికి సంబంధించి కూడా ఈ ప్రాబ్లమ్‌కు, పూర్తి శాశ్వత పరిష్కారం కోసం కలెక్టర్ నాతో రెండు మూడు రోజుల కిందట కూడా మాట్లాడినప్పుడు శాశ్వత పరిష్కారం కోసం తాను అన్వేషించి ఇక్కడ ఉన్న లంకలన్నీ కూడా ఎక్కడైతే ఆవాసం ఉన్నారో, ఎక్కడైతే హ్యాబిటేషన్స్ ఉన్నారో, ఎక్కడైతే మనుషులు ఉన్నారో అటువంటి లంకలన్నీ కూడా రివర్ట్‌మెంట్ కట్టే కార్యక్రమానికి కలెక్టర్ ప్లాన్ వేయడం జరిగింది. అందులో భాగంగానే చీఫ్ ఇంజనీర్ వచ్చాడు. అన్నీ చూశాడు. చూసిన తర్వాత పొట్టిలంకలో దాదాపు 1000 మీటర్లు, థానేలంకలో 400 మీటర్లు, గురజపులంకలో 600 మీటర్లు, కూనలంకలో మరో 800 మీటర్లు, వివేకానంద వారధిలో మరో 300 మీటర్లు, కుందుకూరులంకలో 400 మీటర్లు కట్టాలని ఎస్టిమేట్ చేశారు. ఇవన్నీ కలిపితే మూడున్నర కిలోమీటర్ల మేరకు ఈ రివర్ట్‌మెంట్ కట్టే కార్యక్రమం. దీనికి అయ్యే ఖర్చుకూడా దాదాపుగా 150 కోట్ల రూపాయలుఖర్చవుతుందని చెప్పడం జరిగింది.

దీన్ని కూడా శాంక్షన్ చేస్తున్నాడు మీ బిడ్డ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి సంబంధించి కూడా చీఫ్ ఇంజనీర్ చెప్పడం.. పది రోజుల్లో ఎస్టిమేట్లు పూర్తి చేసి నెలాఖరుకల్లా టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరో నెల.. అంటే మొత్తంగా 2 నెలల్లోపు వర్క్‌లు స్టార్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని కలెక్టర్ చెప్పడం జరిగింది. కలెక్టర్లకు ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం. కచ్చితంగా 2 నెలలు అయ్యేలోపే ఈ పనులన్నీ మొదలు పెట్టించి ఫొటోలు తీయించి మళ్లీ నాకు పంపించాలని కలెక్టర్లకు చెబుతున్నాం.
ప్రతి విషయంలోనూ మీకు మంచి జరగాలని, విపత్తు వచ్చినప్పుడు మీకు కచ్చితంగా తోడుగా, అండగా నిలబడే కార్యక్రమం కచ్చితంగా జరగాలని మనసావాచా కర్మణా మీకోసం మీ బిడ్డ ఎప్పుడూ కూడా ఆరాటపడుతూనే ఉంటాడు. తాపత్రయపడతానే ఉంటాడు అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ గ్రామంలో ఇంతకు ముందు ఓఎన్‌జీసీకి సంబంధించిన పరిస్థితులుకూడా మీ అందరికీ తెలిసినవే. గతంలో మీ అందరూ కూడా పరిస్థితులు చూశారు. ఏ ఒక్కరూ ఇచ్చిన పరిస్థితి లేదు. ఏ ఒక్కరూ ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం.. కచ్చితంగా పాతవన్నీ ఇప్పించడమే కాకుండా మళ్లీ ఇవ్వాల్సినవన్నీ కూడా కచ్చితంగా సమానికే వచ్చేట్లుగా, టైమ్‌కే ఇచ్చేట్లుగా చేస్తున్నాం.

మంచి చేసే విషయంలో ఎళ్లవేళలా దేవుడు తోడుగా ఉండాలని, మీ అందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ ఇంకా జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా.” అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
