CM Jagan tour at flood areas: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ, రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే పలుమార్లు వరద పరిస్థితులపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. కలెక్టర్లు, ఇతర అధికారులకు కీలక సూచనలు చేశారు. వరద బాధితులపై ఉదారంగా వ్వహరించి ఆదుకోవాలని సూచనలు చేశారు. మానవత్వంతో వ్యవహరించి ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలన్నారు. నిరంతరాయంగా సహాయ కార్యక్రమాలు కొనసాగేందుకే తొలుత ప్రాధాన్యం ఇచ్చిన సీఎం జగన్.. వరద పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత నేరుగా వెళ్లి బాధితులను కలుసుకోనున్నారు. (CM Jagan tour at flood areas)
కలెక్టర్లకు నిధులిచ్చి యుద్ధ ప్రాతిపదికన సాయం అందేలా చర్యలు చేపట్టారు. ఇప్పుడు పరిస్థితి కుదుట పడటంతో జగన్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నారు. సాయం అందిన తీరును పరిశీలించేందుకే పర్యటన చేస్తున్నారు. సరికొత్త సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త ఒరవడికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు.
నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లా బాధిత గ్రామాల ప్రజలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సాయంత్రం రాజమండ్రిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలతో సమావేశం నిర్వహిస్తారు.
అల్లూరి, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వరద సహాయ చర్యలను ముఖ్యమంత్రి జగన్ తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కుక్కునూరు చేరుకుంటారు. ఆ తర్వాత కాలినడకన గ్రామంలో వరద పరిస్థితి పై పరిశీలన చేస్తారు. ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. వరద నష్టం పై ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం జగన్ తిలకించనున్నారు.
Read Also : CM YS Jagan Review: భారీ వర్షాలు, వరద ప్రవాహం, సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష