HomeTelanganaTelangana TET: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌.. ముఖ్య తేదీలు ఇవీ..

Telangana TET: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్‌.. ముఖ్య తేదీలు ఇవీ..

Telangana TET: తెలంగాణలో టీచర్‌ ఎలిజబులిటీ టెస్ట్‌ (టెట్‌) నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయ్యింది. రేపటి నుంచి ఈ నెల 16 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. సెప్టెంబర్ 15 న టెట్ పరీక్ష, 27 న ఫలితాలు ఉంటాయని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఫీజు చెల్లింపులకు కూడా ఆగస్టు 16వ తేదీనే చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానంలో టెట్‌ నిర్వహిస్తారు. మొదటి సెషన్‌లో పేపర్ 1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. (Telangana TET)

Read Also : AP DSC News : ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్‌? తప్పని పరిస్థితిలో జగన్‌ సర్కార్‌.. టీచర్‌ ఉద్యోగార్థులకు గ్రేట్‌ న్యూస్‌!

పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు సెప్టెంబర్‌ 9 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు నోటిఫికేషన్‌లో తేదీల వివరాలు పేర్కొన్నారు. నిరుద్యోగులు.. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకొనే వారికి ఇది గుడ్‌ న్యూస్‌. కాలయాపన లేకుండా త్వరితగతిన టెట్‌, తర్వాత ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని ఉద్యోగార్థులు కోరుతున్నారు.

Read Also : AP DSC 2023 : ఏపీలో ఎన్నికల ముంగిట డీఎస్సీకి సన్నాహాలు.. ఎన్ని పోస్టులు భర్తీ?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు