Pawan Kalyan at Mangalagiri: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మంగళగిరికి మకాం మార్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి మంగళగిరి జనసేన ఆఫీస్ తరలించినట్లు సమాచారం. (Pawan Kalyan at Mangalagiri)
జనసేన కేంద్ర కార్యాలయ సిబ్బంది, ఇతర విభాగాలు ఫైళ్లు, కంప్యూటర్లు మంగళగిరికి తరలించారట. ఇకపై షూటింగ్ లు ఉంటేనే పవన్ హైదరాబాద్ కు వెళ్లనున్నారని టాక్. మంగళగిరి పార్టీ ఆఫీస్ లో పవన్ కు అనుగుణంగా ఇంటి నిర్మాణం చేస్తున్నారట. సినిమాలపై చర్చలకు కూడా దర్శకులు మంగళగిరికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.
Read Also : Mudragada on Pawan: కాపుల కొట్లాటగా మారిన పవన్ టూర్.. ముద్రగడ లేఖతో మరింత రంజుగా రాజకీయం!
మరో 8 నెలల్లో ఏపీలో ఎన్నికలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌పై ఇప్పటికే అధికార పార్టీ దూకుడు పెంచింది. ఆరోపణలు, విమర్శల పర్వం జోరందుకుంది. పవన్ నాన్ లోకల్ అనే ఆరోపణ రాకుండా మంగళగిరిలోనే ఉంటూ రాజకీయాలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సీఎం జగన్‌లాగా ఏపీలోనే ఉండాలని యోచిస్తున్నారట. ఈ క్రమంలో మంగళగిరిలోనే మకాం వేసేలా కసరత్తు చేస్తున్నారు.
Read Also : Pawan Kalyan: పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన పని.. జవాబుదారీతనంతో రాజకీయాలు చేస్తున్నా: పవన్ కల్యాణ్
