HomeAndhra PradeshAP DGP: ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు.. వారిని పోలీసు విధులకు వినియోగించవద్దని స్పష్టీకరణ

AP DGP: ఏపీ డీజీపీ కీలక ఆదేశాలు.. వారిని పోలీసు విధులకు వినియోగించవద్దని స్పష్టీకరణ

AP DGP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు బాస్‌ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. మహిళా పోలీసులను పోలీసు విధులకు వినియోగించ వద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసు కమిషనర్లు, రేంజ్‌ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. (AP DGP)

గ్రామాల్లోని మహిళలు, చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఇతర శాఖలతో సమన్వయ పర్చుకుని వారికి కావల్సిన పూర్తి సహాయ సహకారాలు అందంచడం మహిళా పోలీస్‌ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి వెల్లడించారు.

Read Also : Number 46 in Numerology: నంబర్‌ 46.. అంత ప్రాధాన్యమెందుకు? కష్టానికి న్యూమరాలజీ తోడైతే విజయం సాధ్యమా?

గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా పోలీసులను పోలీసు శాఖలోని సాధారణ విధులైన బందోబస్తు, రిసెప్షన్‌, శాంతిభద్రతల వంటి వాటికి వినియోగించడం, తరచుగా పోలీస్‌ స్టేషన్లకు పిలిపించడం వంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని డీజీపీ (DGP KV Rajendranath Reddy) స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసు కమిషనర్లు, రేంజ్‌ డీఐజీలు, జిల్లా ఎస్పీలకు డీజీపీ నేడు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

ఎవరైనా డీజీపీ ఆదేశాలకు విరుద్ధంగా మహిళా పోలీసులను పోలీసు విధులకు వినియోగించినట్లు తేలితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన వెలువరించింది.

Read Also : AP High court: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తరలింపుపై కేంద్రం స్పష్టత

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు