Top 10 Movies: టాలీవుడ్‌ హిస్టరీలో ఎక్కువ రోజులు ఆడిన మూవీస్‌ ఇవే..!

Top 10 Movies: ఇప్పుడు ఎంత గొప్ప సినిమా అయినా థియేటర్లలో ఓ వారం లేదా పది రోజులు.. మహా అయితే రెండు వారాలు.. అంతే. ఇక ఎత్తేసి వేరే సినిమాలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు నెల రోజులు ఆడితే గొప్ప అన్నట్లు ప్రస్తుతం వ్యవహారం నడుస్తోంది. కానీ ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడిన సినిమాల జాబితా చూస్తే.. మనమే ఇలా ఆదరించామా అనిపించక మానదు. అలాంటి సినిమాలు ఇవీ.. (Top 10 Movies)

ఇప్పుడు రికార్డులు అంటే డబ్బు కలెక్షన్స్‌ మాత్రమేననే అభిప్రాయం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ఉంది. అభిమానులు కూడా మా హీరో సినిమా ఎంత డబ్బు వసూలు చేసిందనే టాపిక్‌పైనే డిస్కషన్‌ చేసుకుంటారు. కానీ ఒకప్పుడు ఇలా కాదు.. మూవీ అంటే ఎక్కువ రోజులు ఆడితేనే రికార్డు అని చెప్పుకొనే వారు. ఈ క్రమంలో ఓ దశాబ్ధం కిందటి వరకు ఎక్కువ రోజులు ఆడిన మూవీస్‌నే హిట్‌ సినిమాలుగా చూసేవారు.

బాలకృష్ణ నటించిన చిత్రం లెజెండ్‌. 2014లో ఈ మూవీ వచ్చి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రొద్దుటూరు అర్వేటిలో 55 రోజులు ఆడాక షిఫ్ట్ అయిన ఈ సినిమా అర్చ‌న థియేట‌ర్లో 1000 రోజులు దాటేసి ఏకంగా 1,116 రోజులు ఆడింది. ఇక రామ్‌ చరణ్‌ నటించిన మగధీర సినిమా విషయానికి వస్తే కర్నూలులో షిఫ్టుల వారీగా వెయ్యి రోజులు ఆడి రికార్డు సృష్టించింది. మహేష్‌ బాబు నటించిన పోకిరి మూవీ 2006లో వచ్చింది. థియేటర్లలో సుమారు 580 రోజులు ఆడి రికార్డు తిరగరాసింది.

బాలయ్య నటించిన సమర సింహారెడ్డి ఆ రోజుల్లోనే 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడ‌డంతో పాటు ప‌లు కేంద్రాల్లో 365 రోజులు ఆడింది. మంగమ్మ గారి మనవడు సినిమా ఏకంగా 567 రోజులు థియేటర్లో ఆడింది. చిరంజీవి నటించిన ఖైదీ మూవీ 365 రోజులు ఆడింది. మరో చరిత్ర మూవీ 1978లో విడుదలై 556 రోజుల పాటు థియేటర్ల‌లో కంటిన్యూగా ఆడింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమాభిషేకం సినిమా 533 రోజుల పాటు ఆడింది. సీనియర్‌ ఎన్టీఆర్‌ లవకుశ మూవీ ఏకంగా 469 రోజుల పాటు థియేటర్లో ఆడింది.

కె. రాఘవేంద్రరావు – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అడవి రాముడు. 1977లో వచ్చిన అడ‌వి రాముడు థియేట‌ర్ల‌లో 365 రోజులు ఆడింది. దీంతో పాటు ఏకంగా రు. 3 కోట్ల షేర్ రాబట్టిందని అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా ఎన్టీఆర్ క‌మ‌ర్షియ‌ల్ స్టామినా నిరూపించిందని స్పష్టమైంది.

చాలా వరకు డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగులో సంచలన విజయాలు నమోదు చేశాయి. ఇప్ప‌టి కోలీవుడ్ క్రేజీ హీరో శింబు తండ్రి టి. రాజేంద‌ర్ న‌టించ‌డంతో పాటు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన సినిమా ప్రేమ‌సాగ‌రం. ఈ సినిమా 1983లో రిలీజ్ అయ్యి తెలుగులోనే ఏకంగ 465 రోజులు ఆడి రికార్డులు సృష్టించింది.

Read Also : Telugu Movies: తెలుగులో స్టార్ హీరోల డిజాస్టర్ సినిమాలు ఇవే..

Read Also : Ram Charan Daughter: మెగా ఇంట ప్రిన్సెస్.. కుమార్తెకు జన్మనిచ్చిన ఉపాసన

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles