HomeLife StyleHealthy Food Tips: హీరోయిన్‌లా ఫిట్‌గా ఉండాలంటే రోజూ ఈ ఆహారం ట్రై చేయండి!

Healthy Food Tips: హీరోయిన్‌లా ఫిట్‌గా ఉండాలంటే రోజూ ఈ ఆహారం ట్రై చేయండి!

Healthy Food Tips: శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందుకోసం రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటారు. తీసుకొనే ఆహారంలో డైట్‌ ఫాలో కావడం, పోషకాహారం తీసుకోవడం, జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం, యోగా, రన్నింగ్‌, జాగింగ్‌.. ఇలా అనేక పద్ధతుల ద్వారా బాడీ ఫిట్‌నెస్‌ కోసం ట్రై చేస్తుంటారు. అయితే, సరైన డైట్‌ పాటించడం ద్వారా కూడా హీరోలు, హీరోయిన్ల మాదిరిగా ఫిట్‌గా ఉండొచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.

కిచిడీ అంటే సహజసిద్ధమైన గ్లూటేన్ ఫ్రీ ఆహారంగా చెప్పుకోవచ్చు. ఇది తినడం వల్ల సీలియెక్ వ్యాధి, గ్లూటేన్ సెన్సిటివిటీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఆరోగ్యంగా, ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలంటే కిచిడీ తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు. కిచిడీ తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

మనదేశంలో ఆహారపు అలవాట్లు (Healthy Food Tips) అనాదిగా చాలా కొనసాగుతున్నాయి. మనదేశంలో ఉన్న రుచులు బహుశా ఏ దేశంలోనూ లేవంటే అతిశయోక్తి కాదేమో. ఇదే సమయంలో ఆరోగ్యపరంగా ప్రయోజనాలు కూడా ఒనగూరేలా మన ఆహార పదార్థాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా కిచిడీ కీలకమైనది. అత్యంత పోషక విలువలున్న ఫుడ్‌గా కిచిడీని అభివర్ణిస్తారు. అయితే, చాలా మంది కిచిడీని చేసుకొని తింటూ ఉంటారు. కిచిడీ ఒక్కటే అయినా ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయని స్పష్టం చేస్తున్నారు నిపుణులు.

డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు.. సగ్గుబియ్యంతో చేసే చికిడీ తీసుకుంటే నియంత్రణలో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తడి సగ్గుబియ్యం కిచిడీ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ రెగ్యులేషన్ నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. హై బ్లడ్ షుగర్ లెవెల్స్ ముప్పు తొలగిపోవాలంటే కిచిడీ తీసుకోవాలి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు.. ఈ ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు చూడొచ్చు. అయితే, కిచిడీలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఫలితంగా చాలా సులభంగా జీర్ణమౌతుంది. కిచిడీ తిన్నప్పుడు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుందని, బరువు తగ్గడానికి కూడా తగ్గడానికి శ్రేయస్కరంగా ఉంటుందని చెబుతున్నారు.

కడుపు ఖాళీ ఉంటే మెదడు బాగా పని చేస్తుందట..

కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మెదడు చాలా బాగా పని చేస్తుందని అనేక పరిశోధనల్లోనూ వెల్లడైంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఘ్రెలిన్‌ అనే హర్మోన్నుఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అది కడుపు ఆకలిగా ఉందన్న సంగతిని మెదడుకు చేరవేస్తుందట. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ హార్మోన్ ఇతర వ్యవహారాల్లో కూడా పాల్గొంటున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. నేర్చుకోవడానికి, జ్ఞాపక శక్తికి, ప్రదేశ విశ్లేషణకి చెందిన పనులను చక్కబెట్టే మన మెదడులోని హిప్పోక్యాంపస్ అనే ప్రాంతాన్ని ఘ్రెలిన్ ఉత్తేజితం చేసి, దాని సామార్థ్యాన్ని పెంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దీనివల్ల మనం చురుగ్గా, చలాకీగా, చేసే పని మీద ఎక్కువ ధ్యాసతో ఉంటామని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, దీనర్థం మనం తినడం మానేయాలని కాదు.. కానీ మనమెంత తింటున్నామన్న విషయంపై అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని ఇది తెలియజేస్తుంది. మనం సరైన విధానంతో ఆహరం తీసుకోవడం వల్ల మన రోజుని ఎంత మెరుగు పరచుకోవచ్చన్న విషయం ఆధారపడి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Food: జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం కోసం ఆయుర్వేద చిట్కాలు ఇవే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు