HomeLife StyleGirl Friend: మీ గర్ల్‌ఫ్రెండ్‌లో ఈ విషయాలు గమనించారా? ఆమె మోసం చేయదు!

Girl Friend: మీ గర్ల్‌ఫ్రెండ్‌లో ఈ విషయాలు గమనించారా? ఆమె మోసం చేయదు!

Girl Friend: యుక్త వయసులో ఉన్నప్పుడు చాలామంది ప్రేమించి ఉంటారు. కొందరు ప్రేమ పక్షులు లోకం తెలియకుండా విహారాలు కూడా చేస్తుంటారు. మధురానుభూతులు ప్రేమలో చవిచూడటం జరుగుతూ ఉంటుంది. ప్రేమికులు చాలా మంది అభిప్రాయ భేదాలు వచ్చి బ్రేకప్‌ చెప్పుకుంటూ ఉంటారు. ఇందుకు కారణాలు చాలా ఉంటాయి. ప్రస్తుత కాలంలో బ్రేకప్‌లు అత్యంత సహజంగా మారిపోతున్నాయి. ఇటీవల జరుగుతున్న ప్రేమ (Girl Friend) వ్యవహారాల్లో సగానికి సగం బ్రేకప్‌లే అవుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

అబ్బాయిలకు అమ్మాయిలే ఎక్కువగాబ్రేకప్‌ చెబుతున్నారట. ఈ విషయంలో మోసపోతున్న అబ్బాయిల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా మంది యువకులు తొలిప్రేమలో మోసపోతే మళ్లీ ప్రేమలో తలదూర్చడం లేదట. ఇలాంటి ఘటనలు జరిగితే చాలా మంది యువకులు ప్రేమతో ఉలిక్కిపడతారట. కాబట్టి అబ్బాయిలు ప్రేమించే ముందు కాస్త ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.

ఈ బ్రేకప్‌లలో అబ్బాయిలే ఎక్కువగా బాధితులవుతున్నారని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రేమలో ఉన్నప్పుడు చుట్టుపక్కల పరిసరాలు గుర్తు లేకుండా ఎంజాయ్‌చేయడం, తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు విడిపోవడం.. ఇలా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. బంధంలో ఉన్నప్పుడు సుడిగాలిలా విభేదాలు తలెత్తుతాయంటున్నారు. ఇలాంటివి రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవాలని, ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో ముందుంటారట. చిన్నచిన్న విషయాలను చాలా సంతోషంగా అబ్బాయిలతో పంచుకుంటారట అమ్మాయిలు. అయితే, అమ్మాయిలు నిజంగా అబ్బాయిలను ప్రేమిస్తుంటే వారి కుటుంబ సభ్యులను అబ్బాయిలకు పరిచయం చేస్తారట. ఇలా కాకుండా కేవలం కలుసుకోవడాలు, ఖర్చు పెట్టించడం లాంటివి చేస్తుంటే మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారని అబ్బాయిలు గ్రహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అందరూ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించే యువతికి మీపై విధేయత, ప్రేమ ఉంటే, ఆమె ఎల్లప్పుడూ మిమ్మల్ని సోషల్ మీడియాలో గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. ఉదాహరణకు, మీరు ఆమె ప్రేమికుడు అని చూపించడానికి ఆమె, మీ ఫోటోను పోస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదా కొంతమంది పటంలోని చిత్రంలాగా నువ్వే నా ప్రపంచం అని నటిస్తారట. మీ గర్ల్ ఫ్రెండ్‌ మీ ఇద్దరి రిలేషన్‌ను సీక్రెట్‌గా ఉంచేందుకు ఇష్టపడదట. మీరు తన ప్రేమికుడు అని ప్రపంచం మొత్తానికి చూపించాలని అనుకునే అమ్మాయిలే ఎక్కువ ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఆమె మీతో తన సంబంధాన్ని రహస్యంగా ఉంచడానికి ఇష్టపడదట.

మీ గర్ల్‌ ఫ్రెండ్‌ ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ట్రై చేస్తుందని చెబుతున్నారు. మీరు తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని చూపించడానికి ఆమె ఎంత వరకైనా వెళ్తుందట. ఆమె మీకు చాలా గౌరవం, ప్రేమ, కేరింగ్‌ ఇవ్వడం ద్వారా మిమ్మల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందట. మీ పుట్టినరోజు లేదా ఇతర ప్రత్యేకమైన రోజును జరుపుకోవడం ద్వారా ఆమె మిమ్మల్ని అట్రాక్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తుందట. శృంగారం పరంగానూ ఓ అడుగు ముందుకేసి మిమ్మల్ని సంతోషపెట్టడానికి కూడా వెనుకాడదట. అమ్మాయి ఇలాఉన్నట్లయితే.. అబ్బాయిలు మోసపోవడానికి చాన్స్‌ ఉండదట. అలాంటి అమ్మాయిలను వదులుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Relationship Tips for Couple: భాగస్వామితో ఆ విషయాలు చెప్పకూడదట..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు