HomeLife StyleRelationship Strong: మీ రిలేషన్ షిప్ బలహీనపడుతోందని అనుమానమా? సంకేతాలివే..

Relationship Strong: మీ రిలేషన్ షిప్ బలహీనపడుతోందని అనుమానమా? సంకేతాలివే..

ఒక రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా (Relationship Strong) ఉండాలంటే ఇద్దరి మధ్య అనుబంధం, నమ్మకం ముఖ్యం. నమ్మకం (Relationship Strong) సడలితే ఎంతటి బంధమైనా బలహీనం అయిపోతుంది. తద్వారా బ్రేకప్ కావడానికి దారి తీస్తుంది. వీలైనంత వరకు తప్పులు జరగకుండా, నమ్మకం కలిగించేలా ప్రవర్తిస్తే ఆ రిలేషన్ షిప్ కలకాలం కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి బంధం దెబ్బతింటే ఇక అతుక్కోవడం చాలా కష్టంతో కూడుకున్నది.

ప్రేమ జంటల మధ్య తరచూ తగాదాలు వస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో పదే పదే ప్రేమ పేరుతో వేధించడం మానుకోవాలి. వీలైతే కూర్చొని మాట్లాడుకోవడం లాంటివి చేయాలి. ప్రేమిస్తున్నారు కదా అని విపరీతంగా ఫోన్లు చేయడం, మెసేజ్ ల ద్వారా వేధించడం లాంటివి చేయరాదు. దీని వల్ల గొడవలు మరింత ముదురుతాయి. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఇవ్వాలి.

ప్రేమికులైనా, భార్యా భర్తల మధ్య అయినా ప్రేమ బాగుండాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి. ముందుగా ప్రవర్తన బాగుండాలి. ఏ బంధంలో అయినా ఇది వర్తిస్తుంది. నమ్మకం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. నమ్మకం లేకపోతే ప్రేమకు తావులేదు. ట్రస్ట్ కలిగించేలా మీ ప్రవర్తన లేకపోతే ఇక బ్రేక్ అప్ కు దగ్గరలో ఉన్నారని అర్థం చేసుకోవాలి.

ప్రేమలో ఏవైనా గొడవలొచ్చినప్పుడు కొందరు పదే పదే ఎదుటి వ్యక్తి గతం గురించి ప్రశ్నిస్తుంటారు. ఇలాంటి పనులు చేయకూడదు. ఇది గొడవలు పెరిగేలా చేస్తుంది. ఇందువల్ల కూడా బ్రేకప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గతం గురించి ప్రస్తావించడం మానుకోవాలి. మరోవైపు వెక్కిరింతల్లాంటివి కూడా చేయకుండా ఉంటేమంచిది. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు బతికే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రవర్తన మానేయాలి. ఇలా చేయడం వల్ల బ్రేకప్ కాకుండా చూసుకోవచ్చు.

Relationship: రిలేషన్ షిప్‌లో క్లోజ్‌గా ఉండాలంటే అలాంటి పొరపాట్లు చేయకండి

నచ్చిన వ్యక్తులతో రిలేషన్ షిప్ లో దగ్గరగా మెలగాలంటే కొన్ని అలవాట్లు మానుకోవాలి. మరి కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలి. కొన్ని పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు పరిచయం ఉన్న అందరితోనూ క్లోజ్ గా మెలగలేం. నచ్చిన వ్యక్తులు కొందరితోనే అన్ని విషయాలూ పంచుకుంటాం. ఇలాంటి నేపథ్యంలో మనకు దగ్గరైన వ్యక్తులతో బంధం మరింత దగ్గర అవ్వాలంటే కొన్ని టిప్స్ పాటిస్తుండాలి.

నిజాయితీగా ఉండడంతోపాటు మీ ఇద్దరికీ ఇష్టమైన వాటిని చూడటం, ఔటింగ్ కు వెళ్లి నచ్చిన ప్రదేశాలను సందర్శించడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల మీ మధ్య క్లోజ్ నెస్ పెరుగుతుంది. అలాగే ఒకరి కోసం మరొకరు సాయం చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకోవడం వల్ల దగ్గరవడానికి వీలవుతుంది.

బంధం దగ్గరవ్వాలంటే కొన్ని తప్పులు జరగకుండా చూసుకోవాలి. తప్పులు పదే పదే చేస్తుండడం వల్ల రిలేషన్ దెబ్బతినే చాన్స్ ఉంటుంది. మనం క్లోజ్ గా ఉండాలని అనుకొనే వారితో ఎలా ప్రవర్తించాలనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా నిజాయితీగా ఉన్నామని రుజువు చేసుకోవాలి. నిజాయితీగా మెలగడం వల్ల మిమ్మల్ని మీ పార్ట్నర్ వదిలి పెట్టలేరు. ఒక వేళ మీరు మీ నిజాయితీని నిరూపించుకోలేకపోతే వారు మిమ్మల్ని విశ్వసించలేరు. ఎప్పుడూ నమ్మకం కలగదు. అందుకని మీరు కచ్చితంగా నిజాయితీగా ఉండి తీరాలి.

ఇద్దరి మధ్య క్లోజ్ నెస్ పెరగాలంటే ఒకరికి మరొకరు కమ్యూనికేట్ చేయడంలో కరెక్ట్ గా ఉండాలి. చిన్న విషయాలను కూడా ఆనందంగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. ఇద్దరూ కలిసి ఆనందిస్తూ గడిపితే అద్భుత క్షణాలు అవుతాయి. మీకు నచ్చిన వారితో క్లోజ్ గా ఉండాలంటే ఇలాంటివి ప్రయత్నించి చూస్తే మీకే అర్థమవుతుంది. మీ బంధం తప్పకుండా దృఢంగా తయారవుతుంది.

Read Also : Vastu for Luck: అదృష్ట దేవత వరించాలంటే ఇలా చేయండి!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు