తమలపాకుతో (Betel Leaves) అనేక ఉపయోగాలు ఉన్నాయి. పూజల్లోనూ, తాంబూలంలోనూ తమలపాకుది విశిష్ట పాత్ర. అనేక ఔషధ గుణాల సమాహారం తమలపాకు (Betel Leaves). భోజనం తిన్నాక దీన్ని కలిపి తాంబూలం వేసుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఇలా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మన ఆరోగ్యాన్ని రిపేర్ చేయడంలోనూ తమలపాకులు దోహదపడతాయి. అనారోగ్య సమస్యల్ని పారదోలుతాయి.
1. పెళ్లిళ్లు, వేడుకలు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు భోజనాలు అయ్యాక తమలపాకులతో తాంబూలం ఇస్తుంటారు. వీటిని తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
2. తమలపాకుల్లో నియాసిన్, కెరోటిన్, విటమిన్ సి, రైబోఫ్లావిన్, క్యాల్షియం తదితర పోషకవిలువలు ఉంటాయి. మన శరీరానికి ఇవి అవసరం.
3. అనేక ఆలయాల్లో నిత్య పూజలు జరుగుతుంటాయి. పూజల్లో తమలపాకులు తప్పకుండా వాడుతుంటారు. అనంతరం వీటిని భక్తులకు అందజేస్తుంటారు.
4. హెడ్డేక్ తగ్గించడానికి తమలపాకులు బెస్ట్ మెడిసిన్. జీర్ణక్రియ పనితీరు మెరుగుపరిచేందుకు కూడా తమలపాకులు ఉపయోగపడతాయి.
5. శరీర ఉష్ణోగ్రత పెరగడానికి చలికాలంలో ఎక్కువ మంది తమలపాకులు తింటుంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పొట్టలోని అనేక సమస్యలను పారదోలుతాయి.
6. మలబద్ధకం సమస్యకు తమలపాకులు మంచి మెడిసిన్. రక్త ప్రసరణ బాగా జరిగేందుకు కూడా తమలపాకులు ఉపయోగపడతాయి.
7. జీవితంలో నిత్యం మనకు వచ్చే జలుబు, దగ్గు, ఒంట్లో నలతగా ఉండటం లాంటి సమస్యలను తమలపాకులు పటాపంచలు చేస్తాయి.
8. ఆస్తమా, ఛాతి నొప్పిని కూడా తగ్గిస్తాయి. మన శరీరానికి ఫ్రీరాడికల్స్ అప్పుడప్పుడూ హాని కలిగిస్తుంటాయి. వీటి నుంచి రక్షణ పొందాలంటే తమలపాకులు దివ్యౌషధం.
9. ఇవన్నీ సైన్స్ ప్రకారం తేలినప్పటికీ మన పూర్వీకులు తమలపాకుల ఉపయోగాలు ముందే చెప్పారు. 60 ఏళ్లు పైబడిన బామ్మలంతా దాదాపు ఎక్కువ మంది ఇప్పటికీ తమలపాకులు కలిపి ఆకు వక్క వేసుకోనిదే వారికి రోజు గడవదు.
డైలీ రొటీన్ ఫుడ్ బోర్ కొడుతోందా.. ఆరోగ్యం కోసం ఇలా ప్రయత్నించండి..
1. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి మళ్లీ భోజనం లేదా చపాతీ… చాలా మంది డైలీ ఫుడ్ మెనూ ఇలా ఉంటుంది. వీరిలో కొంత మంది రాత్రి పూట భోజనానికి బ్రేక్ ఇచ్చి ఏ ఫలమో, జ్యూసో లాగిస్తుంటారు.
2. అయితే, ఇలాంటి డైలీ రొటీన్ ఫుడ్ తో బోర్ కొడుతోందా? కొత్తగా ఆరోగ్యాన్ని పాడు చేయని ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే.. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి.
3. పోషక విలువలున్న ఫుడ్ తీసుకుంటేనే మనకు అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది. వాస్తవానికి రోజువారీ మనం తీసుకొనే ఫుడ్ లో చాలా రకాల వాటిలో అనారోగ్యం కలిగించే పదార్థాలుంటాయి.
4. ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. రోగనిరోధక శక్తి తగ్గి, జబ్బులు త్వరగా సోకుతాయి. కండబలం, మెమొరీ పవర్ తగ్గుతుంది. అందుకే ఆయిలీ ఫుడ్ ను అవాయిడ్ చేయాలి.
5. కూరగాయలు, పండ్లు, గింజలు, మొలకలు లాంటివి రోజూ తినేలా ప్లాన్ చేసుకోవాలి. వీటి ద్వారానే మనకు ఆరోగ్యకర జీవితం సాధ్యమవుతుంది.
6. రోజూ ఏదో ఒకరమైన వంటలో విటమిన్ సి కలిగిన నిమ్మకాయ ఉండేలా చూసుకోండి. దంతాలు ఎముకల బలం పెంచుతుంది. క్యాన్సర్ కణాలను నివారించే శక్తి కూడా నిమ్మకాయకు ఉంది.
7. పచ్చి బఠాణీలు కూడా హెల్తీ ఫుడ్. జింక్, ఐరన్, ఖనిజాలు ఉంటాయి. వీటితోపాటు రోజుకో గుడ్డు ఉడికించి తింటే ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.
8. రోజుకో యాపిల్ పండు తిన్నా ఉపయోగమే. దీంతో పాటు రోజూ దాదాపు మూడు లీటర్ల నీరు తాగుతుండాలి. అప్పుడే శరీరంలో మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది.
9. ఆప్రికాట్లు తీసుకోవడం వల్ల విటమిన్ బీటా కెరోటిన్, పొటాషియం, లైకోపిన్, ఫైబర్ లభిస్తాయి.
Read Also : Health tips: తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఫుడ్ కోసం ఇలా చేయండి..
