శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

YS Jagan : పులివెందులలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్.. తరలివచ్చిన జనం

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 25 నవంబర్ 2025

YS Jagan : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పులివెందుల పర్యటన, క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్భార్‌ నిర్వహించారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో జగన్‌ కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు తెలుసుకుని, వారి సమస్యలు ఓపిగ్గా విని, వారికి భరోసా కల్పించారు.

ఆపన్నులకు అండగా
వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైయస్‌ జగన్‌ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వచ్చిన వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన వైయస్‌ జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

గోడు వెల్లబోసుకున్న రైతులు
వరుస తుపాన్లు, వర్షాలతో తాము అల్లాడిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందడం లేదని పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తామంతా భరోసాగా బ్రతికామని, కానీ ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్ధితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వంపై రైతుల తరుపున పోరాడతామని వారికి అండగా ఉంటామని వైయస్ జగన్‌ భరోసానిచ్చారు.

ఇవీ చదవండి: YS Jagan tweet : చంద్రబాబూ.. రైతును ఆదుకున్నదెప్పుడు? అన్నదాతల కష్టాలపై జగన్ ట్వీట్
YS Jagan at Hyd : ఆరేళ్ల తర్వాత సీబీఐ కోర్టుకు జగన్.. బిగ్ ట్విస్ట్?

ట్యాగ్స్: , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading